Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆడ దెయ్యాలు వికృత రూపంతో, వికట ధోరణిలోనే ఉండిపోవాలా..?!

February 2, 2026 by M S R

.

దెయ్యం అంటే, ఆత్మ అంటే… తెల్ల చీరె కట్టుకుని, గాజు కళ్లతో… జుట్టు విరబోసుకుని, తెల్లటి పళ్లతో… భీకరంగా వ్యవహరిస్తూ, బీభత్సంతో… మనిషిని భయపెడుతూ, పీడిస్తూ… అన్నీ ఒకేరకంగా పూర్తి నెగెటివ్ షేడ్స్‌‌తో మాత్రమే ఉంటాయా..? ఉండాలా..?

అదేమిటో గానీ… దెయ్యం అనగానే మన సాహిత్యాలు, మన సినిమాలు, మన కళారూపాలు, మన ముచ్చట్లు అన్నీ ఆడ దెయ్యాలతోనే నింపేస్తారు గానీ, మగ దెయ్యాలకు పెద్దగా స్థానం లేదెందుకో..! కోరికలు తీరని మనుషులు మరణం తరువాత దెయ్యాలవుతారంటారు…

Ads

అంటే ఆడవాళ్లకు కోరికలు ఎక్కువ కాబట్టి, అవి తీరక… ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారా దెయ్యాలుగా… మగవాళ్లకు కోరికలు తక్కువ కాబట్టి, మరణించగానే నేరుగా పైలోకాలకు వెళ్లిపోతారా..? మన దెయ్యం సినిమాలు ఏది చూసినా ఇలాగే ఉంటాయెందుకో… ఈ దెయ్యం ఉపోద్ఘాతం దేనికీ అంటే..? కొందరు దర్శకులు మాత్రమే భిన్నంగా ఆలోచించి, ప్రయోగాలు చేయగలరు గనుక… ఓ సినిమా అదే పోకడ గనుక…

ఆ మలయాళ సినిమా… పేరు సర్వం మాయ… హారర్, కామెడీ జానర్… హీరో నివీన్ పౌలీ… అసలు మలయాళ మార్కెట్ చాలా చిన్నది తెలుగు ఇండస్ట్రీతో పోలిస్తే… తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోగాలు చేస్తారు… క్రియేటివిటీ చూపిస్తారు… అక్కడి ప్రేక్షకుల అభిరుచి కూడా అదే… రొటీన్ సోది సినిమా తీస్తే మోహన్‌లాల్ వంటి స్టార్ హీరో ఉన్నా సరే తిరస్కరిస్తారు…

అది 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తే, వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వసూళ్లు రాలేదు… అంత భారీ డిజాస్టర్… కానీ 30 కోట్లతో తీసిన ఈ సర్వం మాయ సినిమా ఏకంగా 140 కోట్లు వసూలు చేసింది… అంటే బంపర్ హిట్ అన్నట్టే మలయాళ మార్కెట్ రేంజును బట్టి..!

ఇప్పుడు తెలుగులో హాట్‌స్టార్ ఓటీటీలో ఉంది, అందుకే ఒకింత ఆసక్తి… ఏముందీ ఇందులో..? ఓ కుర్రాడు, గిటారిస్ట్, సంగీతం అంటే ప్రాణం, దేవుడిని నమ్మడు, పౌరోహిత్యం మీద అనాసక్తి… తప్పనిసరై పౌరోహిత్యంలోకి దిగాక ఓసారి ఓ ఆడ దెయ్యం కనిపిస్తుంది… తనకు మాత్రమే కనిపిస్తూ, ఇంకెవరికీ కనిపించక అల్లరి చేసే అందమైన దెయ్యం, దానికి డెలులు అనే పేరు పెడతాడు…

సర్వం మాయ

ఆ తరువాత పరిణామాలు, ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఎట్సెట్రా కథ… సింపుల్, అది భయపెట్టదు, భయపడుతుంది మనుషులకు… పైగా దెయ్యం తాలూకు పవర్స్ కూడా ఉండవు… ఆ భిన్నమైన దెయ్యం చివరకు ఎలా విముక్తి పొందుతుందనేదే కథ…

హారర్, దెయ్యం కథ అనగానే ఇందులో రక్తం, భయం, బీభత్సం మన్నమశానం ఏమీ ఉండవు… పైగా హీరోతో ప్రేమలో పడుతుంది… హీరో మరొకరిని ప్రేమిస్తుంటే సహించదు… ఈ పాత్రలో నటించిన రియా షిబు భలే పర్‌ఫామ్ చేసింది… ప్రేక్షకుడు ఆమె ప్రేమలో పడిపోతాడు సినిమా చూశాక… ఇలాంటి దెయ్యాలు మన జీవితాల్లోకి ఎందుకు రావు అని మనమే ప్రశ్నించుకునేలా…

అందమైన దెయ్యానికి తోడు కేరళ అందాలు… ఢమఢమ మోతలు గాకుండా సరళంగా సాగే నేపథ్యసంగీతం… పర్లేదు… ఎంచక్కా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు..! తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది… దర్శకుడు అఖిల్ సత్యన్ మెప్పిస్తాడు… మంచు కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఫిమేల్ లీడ్ రోల్ ఇందులో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!
  • ఆ పాట చరణాల సొగసు చూడతరమా…? వేటూరి మేథోమథనం కథ..!!
  • మళ్లీ ఇజ్జత్ తీసుకున్న పాకిస్థాన్… ఈసారి ఏకంగా దాని ప్రధాని వంతు…
  • నోటి తుత్తర ఎంత ప్రమాదకరమో చెప్పే సినిమా… మధురానగరిలో…
  • దేవనపల్లి కవిత..! టీఆర్ఎస్ కాదు… తెలంగాణ జాగృతి పార్టీయే..!!
  • అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడినట్టు…!!
  • ఇరాన్ యుద్ధనీతిని అస్సలు అంచనా వేయలేని ట్రంప్ వైఫల్యం…
  • ఇదే డెస్టినీ అంటే..! కేసీయార్ సార్, ఓసారి ఇది తాపీగా చదవగలరు…!!
  • అమెరికా, ఇజ్రాయిల్ తప్పులో కాలేశాయి..? మొస్సాద్‌కు మొదటిసారి షాక్..!!
  • సర్కారు సకాల స్పందన… రిటైర్డ్ ఉద్యోగులందరికీ భారీ ఊరట

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions