.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రాష్ట్ర ఖాజానాను మేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం… అదిప్పుడు ఉపయోగంలో లేక పఢావు పడిపోగా… ఆ అప్పులు, ఆ మిత్తీలు కడుతూ, నానా తిప్పలూ పడుతున్నది ఈ రేవంత్ ప్రభుత్వం… నిజంగా కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత నష్టపరిచిందో చెప్పాలంటే ఓ పే-ద్ద థీసిస్…
గత ఒక్క ఏడాదిలోనే రేవంత్ రెడ్డి ఏకంగా 33 వేల కోట్లను చెల్లించాల్సి వచ్చింది… అంటే, కట్టిన కాళేశ్వరం వేల కోట్ల దుర్వినియోగానికి తావిచ్చి, చివరకు నిరుపయుక్తమైపోగా.., ఇప్పటికీ దాని పేరిట తెచ్చిన రుణాలు, వడ్డీలు తెలంగాణ ఖజానాను మింగేస్తున్నాయి… రేవంత్ ప్రభుత్వం సంకల్పించిన పలు సంక్షేమ పథకాలకు కూడా డబ్బు లేకుండా చేస్తున్నాయి… కీలక ప్రాధాన్య ప్రాజెక్టులకూ డబ్బు లేని దురవస్థను క్రియేట్ చేస్తున్నాయి…
Ads
ఇంకా వివరాల్లోకి వెళ్దాం ఓసారి… కేసీయార్ కలల ప్రాజెక్టుగా చెప్పబడిన ఈ కాళేశ్వరం ఓ పేద్ద ఫ్లాప్ స్టోరీ ఎలాగైందంటే…?
1) ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ ఫెయిల్యూర్లు, దీనికి పక్కాగా కేసీయార్ బాధ్యుడు…
2) అడ్డగోలు అవినీతి, అక్రమాలు… బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలే కాదు, ప్రభుత్వం వేసిన కమిషన్ తేల్చింది, ఏసీబీ బోలెడుమంది అధికారులపైనా కేసులు పెట్టింది…
3) తీరా చూస్తే మేడిగడ్డ నిలువునా తస్కింది… మూడు బరాజుల స్థితీ ప్రమాదకరమే అని కేంద్రం తేల్చింది…
4) బాధ్యత వహించాల్సిన నిర్మాణ సంస్థలు తప్పించుకుంటున్నాయి, వాటిని ఎలా దారికి తీసుకురావాలో తెలియని దురవస్థ… నోటీసులు ఇచ్చారు, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి, రాష్ట్రంలో బ్యాన్ లిస్టులో పెట్టాలనీ యోచిస్తోంది సర్కారు…
5) ఆ తెచ్చిన అప్పులు కూడా అడ్డగోలు మిత్తీలకు తీసుకొచ్చారు… ఖర్చులో భారీ అక్రమాలు… ఇప్పుడు అవి మోస్తున్నది మాత్రం రేవంత్ రెడ్డి…
6) ఒకే ఏడాది తెలంగాణ వంటి రాష్ట్రం 33 వేల కోట్లను చెల్లించిందంటే మాటలు కాదు… (ఈ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో 47 వేల కోట్లు)… సో, ఓ పఢావు ప్రాజెక్టు తెలంగాణ ఖజానాను ఊడ్చేస్తున్నట్టు లెక్క…
7) ఇది గాకుండా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా అప్పులు అధిక వడ్డీలకు, స్వల్పకాలంలో చెల్లింపుల షరతులతో తీసుకొచ్చారు… అదీ భారమే…
8) దీనివల్ల సంక్షేమ పథకాలకు, ప్రాధాన్య ప్రాజెక్టులకు అవసరమైన డబ్బుకూ అవస్థలు…
ఇదీ స్థూలంగా…! ఈ భారాన్ని తగ్గించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు ఫలిస్తున్నాయి… రాజకీయంగా ఎంత విభేదించినా, రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత పాటించడం అనే రేవంత్ రెడ్డి ధోరణి బాగా ఉపయోగపడుతోంది… ఎలా అంటే..?
అడ్డగోలు మిత్తీలను తగ్గించాలని, రుణచెల్లింపుల గడువును కూడా పెంచాలని రేవంత్ రెడ్డి పదే పదే కేంద్రాన్ని అడుగుతున్నాడు… మోదీని కలిసినప్పుడూ విజ్ఞప్తి చేస్తున్నాడు… ఆ ప్రయత్నాలు ఫలించాయి… (ఈ రుణాలు ఇచ్చినవి ఆర్ఈసీ, పీఎఫ్సీ ప్రభుత్వ రంగ సంస్థలే) … ఇప్పుడు ఒకే ఏడాది 33 వేల కోట్లను చెల్లించిన రేవంత్ రెడ్డి, మిగతా రుణాలపై 10.90 సగటు వడ్డీ నుంచి 7.5 శాతం తగ్గింపుకి అంగీకరింపచేశాడు…
అంతేకాదు, 10 ఏళ్ల చెల్లింపు వ్యవధి నుంచి 25 ఏళ్లకు రీషెడ్యూలింగుకూ ఒప్పించాడు… అంటే దీర్ఘకాలిక రుణంగా మారింది… దీనివల్ల ఏటా చెల్లించాల్సిన మొత్తం తగ్గి, ఖజానాకు పెద్ద రిలీఫ్…!!
Share this Article