Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వామ్మో, ఏం కి‘లేడీ’ ప్లాన్ వేసిందిర భయ్… పాపం, ఆ భర్త బతికిపోయాడు…

February 19, 2026 by M S R

.

అందరికీ తెలిసిందే కదా… అసలే భర్తల రోజులు బాగాలేవు… ప్రియుల మోజులో పడి మొగుళ్లను కసకసా చేస్తున్న దుర్దినాలు… అసలు రీల్ లైఫ్ సినిమా కథలకన్నా రియల్ లైఫ్ (నిజజీవితాలు)లోనే ఎక్కువ ట్విస్టులు, ఎక్కువ మెలోడ్రామా…

ఈ కేసు ఓసారి చదవండి… వామ్మో, ఏం కిలేడీర భయ్, ఏం ప్లాన్ వేసిందీ అని ఆశ్చర్యపోతారు… కాకపోతే వాడి అదృష్టం బాగుండి, పోలీసులు కాస్త నిజాయితీగా దర్యాప్తు చేయడంతో ఆ భర్త బతికిపోయాడు… అసలు వార్తలోకి వెళ్దాం…

Ads



కట్టుకథకు కావలసిన స్కెచ్! కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల ప్రియాంక, చిక్కమగులూరులో ఒక పెళ్లికి వెళ్ళింది… పెళ్లి అయిపోయింది… తిరుగు ప్రయాణం మొదలైంది… బేలూరు బస్టాండ్‌లో దిగిన ఆమె ఇంటికి వెళ్లకుండా నేరుగా ఒక వాటర్ ట్యాంక్ (చెరువు) దగ్గరకు వెళ్ళింది… అక్కడక్కడా ఆమె కొన్ని ఆబ్జెక్ట్స్ వదిలేసింది… ఓ ప్లాన్ ప్రకారం…

  • హ్యాండ్ బ్యాగ్, ఆధార్ కార్డు ఒకచోట…

  • చున్నీ, చివరకు లోదుస్తులు (Undergarments) మరొక చోట…

ఇవన్నీ చూసిన వారు ఎవరైనా ఏమనుకుంటారు..? ఆమెపై లైంగిక దాడి జరిగిందని, ఆపై ఎవరో కిడ్నాప్ చేశారని లేదా చంపేసి నీళ్లలో పడేశారని అనుకోవాలని ఆమె పక్కాగా ప్లాన్ చేసింది…

అమాయకపు భర్త ఆవేదన.. పోలీసుల విచారణ! పాపం, ఆమె భర్త తన భార్యకు ఏదో ఘోరం జరిగిందని గగ్గోలు పెట్టాడు… 30 లక్షల విలువైన బంగారంతో ఆమె మాయమవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది… అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది… ఒకవేళ పోలీసులు కేవలం ఆ వాటర్ ట్యాంక్ దగ్గర దొరికిన ఆధారాలను బట్టే కేసును ముగించి ఉంటే, మొదటి నింద భర్త మీదే పడేది…

సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు ఫస్ట్ బుక్ చేసేది భర్తనే… “ఆస్తి కోసం భార్యను చంపి డ్రామా ఆడుతున్నావు” అని పోలీసులు థర్డ్ డిగ్రీ వాడితే, ఆ అమాయకుడు అడ్డంగా బుక్కయ్యేవాడు… లేదా నిజంగానే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారు, అత్యాచారం చేసి, ఎక్కడో చంపి పడేసి ఉంటారు అనుకుంటే కేసు వేరేగా ఉండేది…

కానీ, తుంకూరు ఎస్పీకి ఈ కేసులో ఏదో తిరకాసు కనిపించింది… సరే, దీని సంగతి ఏమిటో చూద్దాం అని తనే స్వయంగా దర్యాప్తు మొదలెట్టాడు… టెక్నాలజీ సాయం తీసుకున్నాడు… సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ సిగ్నల్స్ డేటాను జల్లెడ పట్టారు పోలీసులు… అందులో ప్రియాంక తన బట్టలు మార్చుకుని, ఒక వ్యక్తితో కలిసి వెళ్తున్న దృశ్యాలు బయటపడ్డాయి…

పాత ప్రియుడితో ఎంజాయ్.. 8 ఏళ్ల కొడుకు సంగతేంటి? చివరికి పోలీసులు పట్టేసుకున్నారు… అసలు కథ అర్థమైపోయింది… ఆమెను తన పాత స్నేహితుడు (ప్రియుడు) డేవిడ్ దగ్గర పట్టుకున్నారు… 30 లక్షల బంగారంతో క్షేమంగా ఉన్న ఆమెను చూసి పోలీసులు విస్తుపోయారు… ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నా కూడా, పాత మోజుతో భర్తను ఇరికించి వెళ్ళిపోవాలనుకున్న ఆమె తెలివికి అందరూ ఆశ్చర్యపోతున్నారు…

ఈ రోజుల్లో చట్టాలు భార్యలకు అనుకూలంగా ఉన్నాయని కొందరు ఇలాంటి ప్లాన్లతో భర్తలను బలిపశువులను చేస్తున్నారు… ఈ కేసులో పోలీసులు టెక్నాలజీని నమ్మి లోతుగా విచారణ చేయబట్టి ఆ భర్త బతికిపోయాడు… లేదంటే కటకటాల వెనుక ఉండేవాడు… ఇలాంటి కిలేడీల విషయంలో భర్తలు మరింత జాగ్రత్తగా ఉండక తప్పదు!…



అవునూ, ఆమెపై పోలీసులు ఏం కేసు పెట్టగలరు..? ఏ సెక్షన్లు కోర్టుల్లో నిలబడతాయి..? అదీ ఆసక్తికరమైన చర్చ...!! చేతిలో 30 లక్షలున్నాయి... కొన్నాళ్లు ఆగండి, డేవిడ్, ప్రియాంక హాయిగా బతికేస్తారు..!!



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ మాజీ జర్నలిస్టు… వెంట నడిచిన ఓ ఆటోడ్రైవర్… ఇదీ ఇంట్రస్టింగు కథే…
  • వామ్మో, ఏం కి‘లేడీ’ ప్లాన్ వేసిందిర భయ్… పాపం, ఆ భర్త బతికిపోయాడు…
  • ఉస్మాన్ తారీఖ్… కంట్రవర్సీ బౌలర్… కానీ నాణేనికి మరోవైపు ఏంటంటే…
  • యాటిట్యూడ్‌కే అమ్మ..! వాణిశ్రీ అంటే అప్పట్లో ఓ సినీ శివగామి..!!
  • ‘‘కల్వర్టు కిందకు లాక్కెళ్లి, దుస్తులు విప్పి… అత్యాచారయత్నమే కాదంటే…?’’
  • ఈ శృతి కథ మీ కథేనా … చదవండి, ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంది…
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గుపడాల్సిన ఓ వైఫల్యం..!!
  • ‘బలుపు కా బాప్’… నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేశావురా హార్దిక్…
  • తెలంగాణ రాజకీయాల్లో ఓ సైలెంట్ మార్పు..! బీసీ, వుమెన్ చైతన్యం..!
  • హోర్ముజ్ జలసంధిపై కుదరని సంధి… మళ్లీ ఉద్రిక్తతలు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions