..
Jasprit Bumrah – మైదానంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించే బౌలర్… కానీ వ్యక్తిగతంగా చూస్తే చాలా లో-ప్రొఫైల్ మనిషి… అతని ఆట హైప్రొఫైల్… నిజజీవితంలో సాఫ్ట్, అణకువగా ఉంటాడు, ఓవరాక్షన్ ఉండదు… అతిగా స్పందించడు… ఓ పరిణతి కనిపిస్తూ ఉంటుంది… వివాదాలు, వార్తల్లో పెద్దగా కనిపించడు…తన ఆటే అన్నీ మాట్లాడుతుంది…
నిన్నటి వరల్డ్ కప్ ఫైనల్లో 4 ఓవర్లు వేసి, జస్ట్, 15 పరుగులు ఇచ్చి, ఏకంగా నాలుగు వికెట్లు తీసుకోవడం నిజంగా ప్రశంసనీయమే… అంతకుముందు ఫైనల్‌కు చేర్చిన మ్యాచులో కూడా తను 16, 18 ఓవర్లలో పొదుపుగా రన్స్ ఇవ్వడం విజయకారణం…
Ads
తన గురించి వివరాల సెర్చింగులో కొన్ని విశేషాలు ఆసక్తికరంగా అనిపించాయి… అతని జీవిత భాగస్వామి Sanjana Ganesan,,,. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్… క్రికెట్ టోర్నమెంట్ల కోసం ప్రపంచమంతా తిరుగుతుంటుంది…
ట్రోలర్‌కు ఘాటు కౌంటర్ … కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి సంజనాను ఎగతాళి చేశాడు… “నువ్వు అంత అందంగా కూడా లేవు… బూమ్రాను ఎలా బుట్టలో వేసుకున్నావ్?” అని కామెంట్ చేశాడు… సంజనా మామూలుగా నోరు మూసుకుని వెళ్లే వ్యక్తి కాదు… వెంటనే అతనికి ఘాటు సమాధానం ఇచ్చింది…
- “చెప్పులాంటి మొఖం పెట్టుకుని తిరుగుతున్న నీలాంటి వాళ్ల గురించి ఏమంటారు మరి?” అని చెప్పుతో కొట్టినట్టు రిప్లై ఇచ్చింది… ఆ స్క్రీన్‌షాట్ అప్పుడే వైరల్ అయింది… ఇప్పుడూ మళ్లీ సోషల్ మీడియాలో తిరుగుతోంది…
ఐపీఎల్లో మొదలైన పరిచయం … బూమ్రా- సంజనా ప్రేమకథ కూడా బుమ్రా నడత వంటిదే… పెద్దగా హడావుడిగా మొదలుకాలేదు… సంజనా స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గా Indian Premier League మ్యాచ్‌లను కవర్ చేస్తూ ఉండేది… అప్పటికి బూమ్రా Mumbai Indians జట్టులో స్టార్ బౌలర్…
మ్యాచ్‌ల ముందు, తర్వాత జరిగే ఇంటర్వ్యూల్లో ఇద్దరూ పలుమార్లు కలుసుకున్నారు… ఆ పరిచయం మెల్లగా స్నేహంగా మారింది… తర్వాత ప్రేమగా మారింది…
ఒకసారి బ్లాక్ కూడా చేశాడట! వారి ప్రేమకథలో ఒక చిన్న ఆసక్తికర సంఘటన కూడా ఉంది… సోషల్ మీడియాలో సంజనా చాలా యాక్టివ్‌గా ఉండేది… అప్పట్లో ఆమె చేసిన కొన్ని కామెంట్లు చూసి బూమ్రా ఆమెను ఒకసారి బ్లాక్ కూడా చేశాడని చెప్పుకుంటారు… తర్వాత నిజం తెలుసుకుని మళ్లీ మాట్లాడటం మొదలైంది… అదే స్నేహంగా మారి… ప్రేమగా మారింది…
గోవాలో సింపుల్ పెళ్లి … 2021లో బూమ్రా ఒక్కసారి క్రికెట్ నుంచి స్వల్ప విరామం తీసుకున్నాడు…. విషయం ఏమిటయ్యా అంటే… కొద్ది రోజుల్లోనే వార్త బయటపడింది — గోవాలో చాలా ప్రైవేట్‌గా బూమ్రా- సంజనా పెళ్లి జరిగింది… కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఆ వేడుకలో పాల్గొన్నారు… అట్టహాసం లేదు, ఆడంబరం లేదు… జస్ట్, అలా ఒక్కటైపోయారు…
బుమ్రాది అహ్మదాబాద్‌లో సెటిలైన ఓ పంజాబీ సిక్కు కుటుంబం… తన చిన్నప్పుడే తండ్రి మరణిస్తే తల్లి కష్టపడి పెంచింది, ఆమె టీచర్… సంజనాది పూణె, హిందూ కుటుంబం… ఆమె మొదట్లో మోడల్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్టు కూడా… ఈ జంటకు ఒక కుమారుడు. అతని పేరు అంగద్...
లో-ప్రొఫైల్ మనిషి… హైప్రొఫైల్ ఆట… బూమ్రా వ్యక్తిత్వం గురించి క్రికెట్ అభిమానులు చెప్పేది ఒక్కటే —
అతను ఎంత పెద్ద స్టార్ అయినా… అహంభావం చూపడు. మైదానంలో కూడా అతని ప్రవర్తన చాలా ప్రశాంతంగా ఉంటుంది. వికెట్ తీసినా ఎక్కువగా సెలబ్రేషన్ చేయడు.
కానీ అతని బౌలింగ్ మాత్రం ప్రత్యర్థులకు భయం పుట్టిస్తుంది… ఒక ఫైనల్ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం మామూలు విషయం కాదు… అలాంటి ప్రదర్శనలే అతన్ని ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలబెట్టాయి…
బూమ్రా ఎంత ప్రశాంతంగా ఉంటాడో… అవసరమైతే సంజనా అంతే ధైర్యంగా మాట్లాడుతుంది. అందుకే చాలా మంది అభిమానులు వీళ్లిద్దరిని చూస్తూ ఒకే మాట అంటారు — బ్యూటిఫుల్ కపుల్… ఇన్ అండ్ అవుట్…
Share this Article