Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డ్రగ్స్ కేసు… రేవంత్ రెడ్డికి భలే కలిసొచ్చింది… ఎలాగంటే..?

March 16, 2026 by M S R

.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలం అలా కలిసొస్తోంది… తాజాగా మొయినాబాద్ డ్రగ్ కేసు కూడా సేమ్… ఎందుకంటే, ఇది తనకు రెండుమూడు రకాలుగా ప్లస్… 1) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డ్రగ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో బీఆర్ఎస్ ఫుల్ డిఫెన్స్‌లో పడిపోయింది… ఏం స్పందించాలో తెలియని దురవస్థ ఇప్పుడు ఆ పార్టీది…

2) ఎప్పుడూ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని చంద్రబాబు మనిషి, టీడీపీ చెప్పినట్టు ఆడుతున్నాడు అని ఆడిపోసుకుంటుంది కదా… అలాంటిది ఏకంగా ఓ టీడీపీ ఎంపీని డ్రగ్స్ కేసులో ఏ ఒత్తిడికీ గురిగాకుండా బుక్ చేసి, ‘టీడీపీ మనిషి’ అనే ముద్రను బ్రేక్ చేసుకున్నాడు… 3) ఈగల్ టీమ్ పెట్టిందే డ్రగ్స్ మీద పోరాటానికి, సో, ఏ స్థాయి వారు దొరికినా వదిలను అని తెలంగాణ జనంలోకి తనకు పాజిటివ్ అయ్యే సంకేతాల్ని పంపించుకున్నాడు…

Ads

4) బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు… ఎవరు హైదరాబాద్ బేస్డ్‌గా ఏ చట్టవ్యతిరేక యాక్టివిటీకి పాల్పడినా ఊరుకునేది లేదనే ఓ ఫరమ్ స్టాండ్ కనబరచడం కూడా తనకు పాజిటివే… (ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కొడుకు కూడా డ్రగ్స్ కేసులో దొరికితే ఈగల్ పోలీసులు వెంటనే బుక్ చేశారు రీసెంటుగా…)

ఓ పక్క రాష్ట్ర ఎంపీని ఏమాత్రం సంకోచం లేకుండా, ఆలస్యం లేకుండా, డ్రగ్స్ టెస్టు చేయించి, పక్కాగా ఫిక్స్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు… తెలంగాణ పోలీసులకూ ఇది ప్లస్ పాయింటే… ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు, రోహిత్ రెడ్డిని, ఇతరులను రిమాండ్ చేశారు… పోలీసులపైకి కాల్పులు అనేది సీరియస్ కేసే, ఒత్తిళ్లకు లొంగకుండా కేసును ఓ కంక్లూజన్ వరకు ఎలా తీసుకెళ్తారో చూడాలి… అసలే ఆ ఫామ్ హౌజ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందట…

ఇక వివిధ పార్టీల వైఖరులు చూద్దాం…



బీఆర్ఎస్ ఏం చెబుతుందో చూడాల్సి ఉండగా, పీసీసీ అధ్యక్షుడు తొందరపడి కేటీయార్ కూడా డ్రగ్ పరీక్షలకు సిద్ధపడాలని అర్జెంటుగా ఓ రాజకీయ రంగు పూశాడు… దీంతో కేసు రాజకీయంలోకి టర్న్ తీసుకుంది… నేను డ్రగ్స్ టెస్టులకు రెడీ, అన్ని పార్టీల ప్రతినిధులకూ టెస్టులు పెడితే నేనూ సిద్ధమే, పదే పదే నన్ను డ్రగ్స్ ఇష్యూలోకి లాగితే లీగల్‌ యాక్షన్ తీసుకుంటానని కేటీయార్ స్పందించాడు… వెరసి ఇష్యూ ఎటో వెళ్లిపోయింది… అసలు రోహిత్ రెడ్డి కేసుపై బీఆర్ఎస్ ముఖ్యులు ఏం స్పందిస్తారో వేచి ఉండాల్సింది కదా పీసీసీ..!

డ్రగ్స్

ఇదే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్, ఏలూరు ఎంపీ టీడీపీ… తెల్లారిలేస్తే రెండు పార్టీలు ఉప్పునిప్పు… కానీ ఇదుగో ఇవీ సంబంధాలు… ఈ కేసు, ఈ అరెస్టుపై బీజేపీ కూడా హేపీ… గతంలో బీజేపీని బదనాం చేయడానికి కేసీయార్ స్కెచ్ వేసిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఎపిసోడ్‌లో రోహిత్ రెడ్డే ప్రధాన పాత్రధారి…

సరే, టీడీపీ విషయానికి వద్దాం… ఇదే మహేశ్‌ను పక్కన పెట్టుకుని చంద్రబాబు మొన్నటి ఎన్నికల ముందు భీషణ ప్రతిజ్ఞ చేశాడు, డ్రగ్స్- గంజాయి తదితరాలన్నీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉక్కుపాదంతో అణిచేస్తానని… తీరా చూస్తే అదే మహేశ్, తాజాగా డ్రగ్ కేసు…

ఎప్పటిలాగే చంద్రబాబు సీరియస్, వివరణ అడిగాడు అని ఏవో వార్తలు రాయించారు… కానీ సస్పెండ్ మాత్రం చేయలేదు… ఎవరి మీద ఏ ఆరోపణలు వచ్చినా చంద్రబాబు సీరియస్ అని వార్తలు వస్తాయి, జనానికి కూడా అలవాటైపోయింది… మరోవైపు ‘‘నేను అమాయకుడిని, నన్ను అక్కడికి రావాలని రిక్వెస్ట్ చేస్తేనే వెళ్లాను, అంతేతప్ప నాకే పాపమూ తెలియదు’’ అని మహేశ్ ఏదో వీడియో విడుదల చేసినట్టున్నాడు… కవరింగ్, ప్రతి నిందితుడూ చెప్పేదేగా… తప్పు చేయకపోతే డ్రగ్స్ కేసులో పాజిటివ్ ఎలా వచ్చింది నాయకా..?

నాలుగు కుటుంబాలు… నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు ఈ కుటుంబాల్లో… పుట్టా మహేశ్ యాదవ్ ఎంపీ… (ఏలూరులో పాపులర్ లీడర్ మాగంటిని కాదని, ఎక్కడో రాయలసీమ నుంచి ఏలూరుకు తీసుకొచ్చి తనను ఎంపీ అభ్యర్థిగా ఎందుకు పెట్టారో టీడీపీకే తెలియాలి…) తండ్రి పుట్టా సుధాకర్ మైదుకూరు ఎమ్మెల్యే (గతంలో టీటీడీ చైర్మన్)…

మహేశ్ మామ యనమల రామకృష్ణుడు, మాజీ స్పీకర్, మాజీ మంత్రి… ఆయన కూతురు దివ్య తుని ఎమ్మెల్యే… (మహేశ్ సిస్టర్ ఇన్ లా)… ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు కూడా మహేశ్ బంధువు, అల్లుడి వరుస… (పుట్ట మహేశ్ సోదరుడు రవి యాదవ్ ఈ శ్రీనివాస్ యాదవ్ అల్లుడే)… రీసెంటుగా జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్ కూడా శ్రీనివాస్ యాదవ్ దగ్గరి బంధువు… అంటే ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్యేలు…

ఈ కుటుంబాలన్నీ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు వల్ల, మహేశ్ యాదవ్ కారణంగా తలెత్తుకోలేని పరిస్థితి… అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ… నిజానికి ఈ కుటుంబాాలన్నీ జనంలో మంచి ఆదరణ కలిగినవే… కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసుతో కొంత డ్యామేజీ… ఇలా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఇదీ డ్రగ్స్ కలకలం..!!

అన్నట్టు… డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ఆంధ్రజ్యోతి కొంత డిఫరెంట్ కోణంలోకి వెళ్లి విశ్లేషించింది… ఆ ముఖ్యాంశాలు ఇవీ…

డ్రగ్స్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బఫూన్‌లా కనిపిస్తున్నామా..? సినిమా కంపోజర్ కోటికి మండిపోయింది..!!
  • ఒకప్పుడు హెడింగ్స్ మీద కేర్… వర్తమానంలో పక్కా కేర్‌లెస్…
  • డ్రగ్స్ కేసు… రేవంత్ రెడ్డికి భలే కలిసొచ్చింది… ఎలాగంటే..?
  • మాస్ జాతర..! జబర్దస్త్ ఫార్మాట్‌కు జెమిని మరో కామెడీ వెర్షన్..?
  • వావ్… నటి రాధిక చెప్పిన ఓ సిగ్గు కథ… ఎంత మురిపెంగా ఉందో…
  • 90 ఏళ్ల దాకా మోదీ ఆ కుర్చీ వదలడా..? మరో రెండు టరమ్స్ తనేనా..?
  • ఓ ట్రెండ్ సెట్టర్ కవి వైరముత్తు… అందుకే వరించిన జ్ఞానపీఠ్…
  • పింక్, యెల్లో క్యాంపులు కిక్కుమంటే ఒట్టు… డ్రగ్స్ తేళ్లు కుట్టిన దొంగలు…
  • అక్కినేని – వాణిశ్రీ… వయసు మీద పడినా సరే ఎవర్‌గ్రీన్ జోడీ…
  • “ఆకలిపై యుద్ధం… 500 కోట్ల భోజనాలు… అక్షయపాత్ర అమోఘ ప్రయాణం”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions