Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!

March 9, 2026 by M S R

.

మాట మైకులో చెబితే అది తెలివిగా మారదు- విలువ పెరగదు- నవ్వు పుట్టించదు- పైగా మూర్ఖత్వమే పెద్దగా వినిపిస్తుంది…. ఈ వ్యాఖ్య ఆసక్తికరంగా అనిపిస్తోంది కదా… ఇవి త్రిష మాటలు… ఇప్పుడు త్రిషకు సంబంధించిన ఏ వార్తయినా, ఏ మాటయినా తమిళనాట సంచలనమే కదా…

ఆమె మాయలో పడిపోయి టీవీకే నేత విజయ్ సొంత పెళ్లానికి దూరమై, ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేశాక త్రిష కలకలం ఎక్కువైపోయింది… బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఓసారి.,. ‘త్రిష ఇంటి నుంచి బయటికివస్తే నిజమైన ప్రజాసమస్యలు తెలుస్తాయి’’ అని విజయ్ మీద వ్యాఖ్యలు చేశాడు… అదీ వివాదంగా మారిన సంగతి తెలిసిందే…

Ads

విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లయ్ చేశాక, ఇక విజయ్, త్రిష కలిసే తిరుగుతున్నారు… ఇక దాపరికం ఏముందని..? ఈ నేపథ్యంలో ఆమె మీద ఇంకెవరు ఏ మాటన్నా వివాదంగా మారుతోంది… ఓ తాజా ఘటన చూద్దాం…

త్రిష

ఇది ఇటీవల జరిగిన Galatta Awards కార్యక్రమంలో జరిగింది… రాపిడ్-ఫైర్ సెగ్మెంట్‌లో పాల్గొన్న నటుడు- దర్శకుడు పార్తీబన్‌కు స్క్రీన్‌పై నటీనటుల ఫోటోలు చూపిస్తూ ఒక్క లైన్ కామెంట్ చెప్పమన్నారు… అప్పుడు త్రిష ఫోటో కనిపించగానే ప్రేక్షకులలో కొందరు ఆమె కుందవి కుందవి అని అరిచారు... (కుందవి అంటే తెలుసు కదా, పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో ఆమె పోషించిన ఓ ప్రధాన పాత్ర పేరు)…

ఆ అరుపులకు స్పందించిన పార్తీబన్ “కుందవి కొద్దిరోజులు ఇంట్లోనే ఉండాలి… బయటకు రాకపోతే మంచిది” అన్నట్టు వ్యాఖ్య చేశాడు… స్టేజ్‌పై ఉన్నప్పుడు ఆ మాటలకు కొంతమంది ప్రేక్షకులు చప్పట్లు కొట్టినా, వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మాత్రం విమర్శలు మొదలయ్యాయి…

ఈ వ్యాఖ్యను చాలా మంది త్రిష గురించి ఇటీవల సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్తలతో కలిపి చూడటం మొదలుపెట్టారు… దీంతో విషయం మరింత చర్చనీయాంశమైంది… ఆమె బయటికి వచ్చి విజయ్‌తో కలిసి తిరుగుతోంది కదా, ఆమె కొన్నాళ్లు ఇంట్లోనే ఉంటే మంచిదని పార్తీబన్ వ్యాఖ్యానిస్తున్నట్టుగా జనం అర్థం చేసుకున్నారు…

త్రిష

ఈ నేపథ్యంలో త్రిష సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించింది… ‘‘మైక్రోఫోన్ పట్టుకున్నంత మాత్రాన చేసే వ్యాఖ్యలు తెలివైనవిగానో లేదా హ్యూమరస్‌గానో మారిపోవు… మైక్ కేవలం “మూర్ఖత్వాన్ని మరింత బిగ్గరగా వినిపిస్తుంది”… అవగాహన లేకుండా మాట్లాడే అసభ్యకరమైన మాటలు, ఎవరిని ఉద్దేశించి అన్నారో వారి కంటే.. మాట్లాడిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా బయటపెడతాయి..’’

ఆమె ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, అది పార్తీబన్ వ్యాఖ్యలకే కౌంటర్‌గా భావించారు అందరు… ఎవరికి తగలాలో వాళ్లకే తగిలింది…

వివాదం పెరుగుతుండటంతో పార్తీబన్ కూడా ఏదో విఫల వివరణకు ప్రయత్నించాడు… స్టేజ్ నుంచి దిగిన వెంటనే ఎవరో శ్రేయోభిలాషి తనతో ‘‘ఆ మాట అనకుండా ఉండాల్సింది’’ అన్నాడు… ఎందుకులే వివాదం అనుకున్న పార్తీబన్, ఆ వీడియో బయటికి రాకుండా చూడాలని నిర్వాహకులను కోరాడు… కానీ అప్పటికే ప్రేక్షకులు కొందరు దాన్ని రికార్డు చేశారు, బయటికి వదిలారు…

‘‘నేను మహిళల గురించి ఎప్పుడైనా చెడుగా మాట్లాడానా..? మహిళల స్వేచ్ఛ, సమానత్వానికి తాను ఎప్పుడూ మద్దతుగా మాట్లాడుతుంటాను, పైగా మహిళా దినోత్సవం రోజున ఉద్దేశపూర్వకంగా నేను విమర్శలు చేస్తానా..? ఐనాసరే, ఎవరికైనా తన మాటలతో బాధ కలిగితే క్షమాపణలు చెబుతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు…

అదేదో ‘‘త్రిషా, సారీ, నేనేదో సరదాగా ఉన్నాను, నీమీద నెగెటివ్ కామెంట్లు నా ఉద్దేశం కాదు’’ అని నేరుగా చెప్పేస్తే అయిపోయేది కదా… ఇలా త్రిష అనే పేరు వినిపిస్తే చాలు, చెన్నైలో కలకలం… అన్నట్టు ఈ పార్తీబన్ ఎవరంటే..? నటి సీత మాజీ భర్త… 1990లో పెళ్లి చేసుకుని, 2001లోనే విడిపోయారు… మళ్లీ వాళ్లు వేరే పెళ్లిళ్లు కూడా చేసుకోలేదు, సింగిల్‌గానే జీవిస్తున్నారు..!! (సీత – పార్తీబన్ లవ్, పెళ్లి, విడాకుల కథ మరోసారి చెప్పుకుందాం)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…
  • కేటీఆర్ ఇలా ట్వీటాడో లేదో… కవిత నుంచి కౌంటర్ పడింది…
  • త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!
  • అసలే జలపాతం చలి… కేవలం బికినీ… అప్పటి క్రేజీ లిరిల్ యాడ్ కథ…
  • హోరెత్తిన ఇండియా..! మురిపెంగా T20 వరల్డ్ కప్ ముద్దాడిన ఈ క్షణం..!!
  • అమెరికా తాజా ప్రేలాపనలకు విదేశాంగ మంత్రి జైశంకర్ జవాబు…
  • సూర్యకుమార్ కెప్టెన్సీ వైఫల్యాలు కాటేయకపోతే… గెలుపు మనదే…
  • అరవయ్యేళ్ల ఆ మహిళ ఎవరామె..? కాస్త సీరియస్‌గా చదవండి…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions