.
Mohammed Rafee ……… అయ్యా నేను బావున్నాను : నాదెండ్ల భాస్కరరావు (90 ఏళ్లు)… ఇటీవల కాలంలో ఛానెల్స్ ముందస్తుగా చంపేస్తున్నాయి! లేదా ఆసుపత్రి పాలు చేసేస్తున్నాయి! కానీ అసలు అది నిజమా కాదా అని నిర్ధారణ కూడా చేసుకోవడం లేదు! పుకార్లను నాలుగు గోడల మధ్య ఎసి గదుల్లో కూర్చుని వార్తలుగా వండి జనానికి పంచి పెడుతున్నారు!
మీడియాకు తొందరెక్కువ! ప్రతిదీ బ్రేకింగ్ వేసుకోవాలి! ఫస్ట్ ఆన్ అనిపించుకోవాలి! ఎక్స్-క్లూజీవ్ కవరేజ్ తో సెబ్బాష్ అని పేరు తెచ్చుకోవాలి! ఈ పాకులాటలో చాలాసార్లు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలను చావకముందే చంపేశారు! ఇదొక చచ్చేచావు…
Ads
అలాగే నిన్న దాదాపు అన్ని చానెల్స్ పూర్వ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును ఆసుపత్రి పాలు చేశాయి. “పరిస్థితి విషమం మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి” అని వైద్యులుగా మారి రిపోర్ట్ ఇచ్చేసి స్క్రోలింగులు వేసేసుకున్నారు! కానీ, నిజానికి పాపం ఆయన క్షేమంగా ఇంట్లోనే వున్నారు! ఈ వదంతులు ఎలా వచ్చాయో, వార్తలుగా ఎలా మలిచారో చెప్పేది ఎవరు?
నాదెండ్ల భాస్కరరావుకు, వారి కుటుంబ సభ్యులకు విషయం తెలిసి విస్తుపోయారు. “అయ్యా నేను క్షేమంగా ఆరోగ్యంగా ఇంట్లోనే ఉన్నా”నని నాదెండ్ల భాస్కరరావు నాలాంటి తెలిసిన మీడియా మిత్రులకు ఫోన్ చేసి చెప్పుకున్నారు. మరో వైపు వారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏకంగా ప్రెస్ రిలీజ్ చేయాల్సి వచ్చింది రాత్రి! మా నాన్నగారు ఆరోగ్యంగా ఇంట్లోనే వున్నారు. ఆయన ఏ ఆసుపత్రిలో చేరలేదని చెప్పుకోవాల్సి వచ్చింది!
సహజంగా నిజమైన బ్రేకింగ్ న్యూస్ లలో పోటీ పడవచ్చు గానీ, ఇలాంటి అనారోగ్యపు వార్తల్లో పోటీ పడి ముందస్తుగా చంపేయడం, ఆసుపత్రిలో చేర్చేయడం ఎంత వరకు సబబు? ఇదేం జర్నలిజం!
ర్ధారించుకుని నిదానంగా ఇలాంటి వార్తలు వేస్తే మీకు వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఇలాంటి వదంతులు సృష్టించడం వల్ల వచ్చేదేమిటి? పోయేదేమిటి? ఇప్పటి జర్నలిజంలో విలువలు ఎలాగూ లేవనుకోండి! కొంచెం మానవత్వం అయినా ఉండాలని కోరుకుంటున్నాను…. – డా. మహ్మద్ రఫీ
Share this Article