Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పేరుకే BRS- TDP వైరం… *యవ్వారాల్లో* జాన్‌జిగ్రీలే… ఏమంటావ్ బాపూ..?!

March 17, 2026 by M S R

.

వోటుకునోటు అని ఓ కేసు పెట్టి, చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమేశాడు కేసీయార్… వోకే, గుడ్… ఓ తెలంగాణ వ్యతిరేకిని పంపించేశాడు… తనతోపాటు జగన్ కూడా జంప్… తెలంగాణలో పార్టీ యాక్టివిటీస్ రద్దు… పవన్ కల్యాణ్ ఒక్కడే అప్పుడప్పుడు మెసులుతుంటాడు, బీఆర్ఎస్‌కు తన మీద ఏ సోయీ లేదు…

ఐతే… టీడీపీ, బీఆర్ఎస్ అంతగా నిప్పు ఉప్పూ యవ్వారం కదా… కానీ తెర వెనుక బాగోతాలు వేరు… ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించే కథనాలు, ప్రచారాలు చదివితే… అసలు బీఆర్ఎస్, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయా అనే రేంజులో ఉంటున్నాయి… (టీడీపీ మనిషిని లాగేసి, కేసీయార్ తనను ఏకంగా మంత్రిని చేసిన తీరు తెలుసు కదా… అదేమంటే రాజకీయ శక్తుల పునరేకీకరణ అంటాడు… సోది పురాణం… మావోయిస్టు పార్టీల్లాగే, లెఫ్ట్ పార్టీల్లాగే నిరర్థక పడికట్టు పదాలు అన్నమాట…)

Ads

సరే, తమ స్వార్థానికి టీడీపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎలా కలిసి పనిచేస్తారో, ఎలా దండుకుంటారో చెప్పడానికి ఉదాహరణకు ఓ కథనం చదవండి…



ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కార్యాలయంలో టీఆర్ఎస్ వాసనలేనా…? వాస్తవమే అంటున్నారు ఏలూరు జిల్లా వాసులు… టీఆర్ఎస్ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు దగ్గరి బంధుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే…

ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తమ్ముడు డాక్టర్ రవికుమార్ స్వయానా తలసానికి అల్లుడు… తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేస్తున్న సమయంలో రూ. 1000 కోట్లకు పైగా గొర్రెల స్కాంలో ఈడి అభియోగాలు మోపింది… తలసాని మంత్రిగా చేస్తున్న సమయంలో పిఏలుగా హరీష్, అభిమన్యు పనిచేశారుట…

రోహిత్ రెడ్డి

గొర్రెల స్కామ్ కేసులో తలసాని వద్ద పిఏగా పనిచేసిన హరీష్ ని కూడా విచారించింది… తలసాని పిఎగా పనిచేసిన హరీష్ ప్రస్తుతం ఎంపీ మహేష్ యాదవ్ వద్ద పిఎస్ గా పనిచేస్తున్నాడు… అలాగే తలసాని వద్ద పనిచేసిన మరో పిఏ అభిమన్యు అడిషనల్ పీఎస్ గా ఏలూరు కార్యాలయంలో పనిచేస్తున్నాడు… వావ్, వాట్ ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ టీడీపీ….

అలాగే హరీష్ తమ్ముడు రాకేష్ ఎంపీ మహేష్ యాదవ్ పిఏగా ఏలూరు కార్యాలయంలో పనిచేస్తున్నాడు… దీంతో ఎంపీ కార్యాలయంలో ఈ ముగ్గురి వల్ల తమకు పనులు జరగటం లేదని టిడిపి వర్గీయులు బాహాటంగానే మాట్లాడుతున్నారు…

ఎంపీ మహేష్ యాదవ్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న నేపథ్యంలో వీరి ముగ్గురే హవా సాగిస్తున్నారు. (నిజానికి మహేశ్‌కూ ఏలూరుకు లింక్ లేదు, అలా టికెట్ ఇచ్చారు, ఇలా గెలిచేశాడు జగన్ వ్యతిరేక హోరులో…) సరే, సదరు పీఏలు, పీఎస్‌ల యవ్వారాలపై నేనిక్కడ ఏ ఆరోపణలూ చేయడం లేదు గానీ… ఏలూరు జనంలో మహేశ్ పట్ల వేగంగా వ్యతిరేకత వచ్చింది, ఎందుకొచ్చిందో తెలుసుకునే సోయి కూడా తనకు లేదు, అది వేరే సంగతి…

kcr

మిగతా యవ్వారాలు ఎలా ఉన్నా సరే… ఎంపీ కార్యాలయానికి వస్తే తమకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని మహేష్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారే ఆవేదన వ్యక్తం చేస్తుండటం ఇక్కడ విశేషం… వీరి ముగ్గురి వల్ల ఎన్నికల సమయంలో కష్టపడిన యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు ముఖ్య నేతలు ఇటీవల ఎంపీకి దూరమయ్యారు…

తెలంగాణ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ యాదవ్ పేరు కీలకంగా మారడంతో .. ఆయన కార్యాలయం పనితీరుపై కూడా ఏపీ ప్రభుత్వం ఆరా తీయగా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయిట… చూడాలిక… ఏదో పేరుకు షోకాజు, ఆ సమయానికి చంద్రబాబు సీరియస్ అని వార్తలు, తరువాత అందరూ క్షేమం… ఏ చర్యలూ ఉండవ్… ఎన్ని చూశాం… కర్ర విరిగేది లేదు, పాము చచ్చేదీ లేదు… అసలు ఏలూరుకు తనను ఎంపీ అభ్యర్థిగా చేయడమే పే-ద్ధ అబ్సర్డ్…

పార్టీలు, సిద్ధాంత వైరుధ్యాలు, పోరాటాలు నథింగ్… ఎవరి స్వార్థం వాళ్లు చూసుకోవడమే… లేకపోతే బీఆర్ఎస్ కీలక నేత, కేసీయార్ అత్యంత ఆత్మీయ నేత, గుడ్ ప్లేయర్ రోహిత్ రెడ్డికీ… పుట్టా మహేశ్ యాదవ్‌కూ నడుమ ఈ బంధాలేమిటి..,? ఏకంగా మద్యంలో, డ్రగ్స్ కలుపుకుని, కలిసి తాగేసేంత సాన్నిహిత్యం ఏమిటి..? పోలీసులొస్తే కాల్చేయండి, తరువాత ఏమైనా నేను చూసుకుంటాను అనేంత బరితెగింపు ఏమిటి..?

మై డియర్ తెలంగాణ జాతిపిత, బాపు కేసీయార్ వింటున్నావా..? లీవ్ హరీష్, లీవ్ కేటీయార్… సొంత పార్టీలో ఎవరేమిటో అర్థమవుతోందా..? మరీ ప్రత్యేకించి నువ్వు స్కెచ్ చేసిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ నాటకంలో ప్రధాన పాత్రధారి రోహిత్ రెడ్డి నీ పార్టీని, నిన్ను ఎంత బదనాం చేశాడో అర్థమైందా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాత కేసీయార్ ఫ్యాన్… ధాటిగా ఆ పొలిటికల్ అనైతికతపై ప్రశ్నలు…
  • దిష్టి వ్యాఖ్యలు, వెక్కిరింపుల్ని తొక్కిపడేస్తూ… తెలంగాణ పరుగులు…
  • పేరుకే BRS- TDP వైరం… *యవ్వారాల్లో* జాన్‌జిగ్రీలే… ఏమంటావ్ బాపూ..?!
  • గుండమ్మ కథ రీమేక్..! అసాధ్యం… ఎస్వీఆర్, సూర్యకాంతం కావాలి కదా..!!
  • నేను ఎందుకు రాసుకుంటున్నాను ఇవన్నీ…
  • చిన్న భాష సినిమా… పెద్ద సంచలనం … మణిపురి బూంగ్…
  • మధుబాలగా సాయి పల్లవి..? ఆమె జీవితం నిజంగానే ఓ సినిమా కథ! 
  • కావ్య మారన్ హిట్ వికెట్… బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పాతాళంలోకి…
  • జై పాతాళ భైరవీ… గుర్తుతెచ్చుకోవాల్సిన ఓ పేరు… వి.జె.వర్మ ….
  • బఫూన్‌లా కనిపిస్తున్నామా..? సినిమా కంపోజర్ కోటికి మండిపోయింది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions