Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పింక్, యెల్లో క్యాంపులు కిక్కుమంటే ఒట్టు… డ్రగ్స్ తేళ్లు కుట్టిన దొంగలు…

March 15, 2026 by M S R

.

భలే దొరికారు రేవంత్ రెడ్డికి ఒక్కొక్కరు… అనైతిక వర్తనులు… టీడీపీ, బీఆర్ఎస్ గ్యాంగులు కిక్కుమంటే ఒట్టు… మాట్లాడితే టన్నుల కొద్దీ బురదను తెలంగాణపై గుమ్మరించే టీడీపీ గ్యాంగ్ ఒకవైపు… బురదను సృష్టించి మరీ రేవంత్ రెడ్డిపై వెదజల్లే బీఆర్ఎస్ మరోవైపు…

ఈ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన రోహిత్ రెడ్డి… ఎవరు..? ఈ కొత్త రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన ఘొప్ప పార్టీ మాజీ ఎమ్మెల్యే… కేసీయార్ అత్యంత ఆత్మీయుడు… తనను ముందుపెట్టి, బీజేపీని బదనాం చేయడానికి ఓ పేద్ద డ్రామా క్రియేట్ చేసి, మోడీని, అమిత్ షా తలలు వంచాలని ప్లాన్ చేశాడు కదా కేసీయార్… ఆ నాటకంలో పాత్రధారి రోహిత్ రెడ్డి…

Ads

ఎవడో స్వామి అట, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చాడట.., అని బదనాం చేయడానికి ముందుగానే ఓ వెబ్ సీరిస్‌కు పెట్టినట్టు స్పై కెమెరాలు పెట్టి పెద్ద నాటకం ప్లాన్ చేశాడు కేసీయార్… అందులో బేస్ లేదు, తొక్కలేదు, దారుణంగా ఫ్లాప్… కానీ పెద్ద దొర ఊరుకోడు కదా… ఆ వీడియోలు అన్ని హైకోర్టులకు, సుప్రీం కోర్టుకు కూడా పంపాడు, పార్టీల అధ్యక్షులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించాడు… దేనికి..? తనకే తెలియదు…

వాళ్లందరూ ఎహె, ఏమిట్రా ఇవి అని ఏవగించుకుని చెత్త బుట్టలో పడేసి… ఇతనా ప్రధాని కావాలనుకుంటున్న కేరక్టర్ అనుకుని పకపకా నవ్వుకున్నారు, అలా తెలంగాణ ఇజ్జత్ పంచనామా చేశాడు కేసీయార్… ఏకంగా బీజేపీ జాతీయ కార్యదర్శిని లిఫ్ట్ చేయాలని ప్లాన్ చేశాడు కూడా…

(సరే, రాజకీయాల్లో మోడీ షాలకు శరం పెద్దగా ఉండదు కాబట్టి… ఇంకా ఇంకా కేసీయార్‌ను ఆత్మీయంగా కౌగిలించుకుంటూనే ఉంటారు, అలుముకుంటూనే ఉంటారు… ఇంత చేసినా తెలంగాణ బీజేపీలోని కేసీయార్ కోవర్టులు ఈరోెజుకూ బీఆర్ఎస్‌తో కలిసి పోదాం అంటుంటారు, అదొక దరిద్రం… ఒక్క బండి సంజయ్ మినహా)…

ఇప్పుడేమైంది..? సదరు రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌజులోనే ఫుల్లు డ్రగ్స్ కొట్టి తెలంగాణ ఈగల్ టీమ్‌కు దొరికిపోయాడు… పింక్ క్యాంపు కిక్కుమంటే ఒట్టు… (రేవంత్ రెడ్డి కుట్ర, శివధర్ రెడ్డి కుట్ర అని ఇంకా హరీష్, కేటీయార్ స్టార్ట్ చేయలేదు)… సమైక్యాంద్ర జంపింగ్‌కు కేసీయార్ మంత్రి కిరీటం పెట్టి, ఇప్పుడు గాయిగత్తర చేసే బీఆర్ఎస్‌కు మరో షాక్ ఏమిటంటే..?

పట్టుబడిన సభ్యుల్లో సదరు ఏపీ టీడీపీ ఎంపీకి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికీ, యనమల కుటుంబానికీ నడుమ ఉన్న బంధాలు చర్చనీయాంశం అవుతున్నాయి… ( పోలీసులపైకి కాల్పులు జరిపిన తుపాకీ లైసెన్సు రోహిత్ రెడ్డి సోదరుడి పేరిట ఉందని ప్రాథమిక సమాచారం… ) ఈ దాడి సమాచారం తెలిసిన వెంటనే రోహిత్ రెడ్డి పీఏ రెండు ఫోన్లను ధ్వంసం చేశాడని మరో సమాచారం వస్తోంది…

అసలు తెలంగాణలో ఫామ్ హౌజులు అంటేనే ఓ పెద్ద అవలక్షణాల అడ్డాలు… అవి జన్వాడ ఫామ్ హౌజు కావచ్చు, కుట్రలు- కుతంత్రాల ఎర్రవల్లి ఫామ్ హౌజు కావచ్చు… జన్వాడ- డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి ఆరోపణల జోలికి వెళ్లడం లేదు ఇక్కడ…

ఎంత బలుపు అంటే..? వాడెవడో రాజస్థానీ మాజీ ఎమ్మెల్యే నితిశ్ శర్మ అట… ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరిపి భయపెట్టాలనుకున్నాడు… గ్రేట్, ఐ అప్రిసియేట్ తెలంగాణ ఈగల్ ఫోర్స్, తెలంగాణ పోలీస్.., వాడెవడు అయితేనేం, పట్టుకుని, అప్పటికప్పుడు డ్రగ్ టెస్టు చేశారు, అరెస్టు చేశారు, టీడీపీ ఎంపీకి మొదట నెగెటివ్ వస్తే ఎర్రగడ్డలో చెక్ చేయిస్తే పాజిటివ్ అని తేలిందని తాజా వార్త… (డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన టీడీపీ కూటమి ఎంపీ స్వయంగా ఓ డ్రగ్స్ కేసులో దొరికిపోవడం విశేషమే)…

ఇటు పింక్ క్యాంపులాగే పచ్చ క్యాంపు కూడా సైలెంట్… చివరకు సాక్షి ఆ ఎంపీ పేరు రాస్తే, ఆంధ్రజ్యోతి, ఈనాడు పక్కా పక్షవాతం వార్తలాగే ఒక ఏపీ ఎంపీ రాసుకొచ్చాయి… దరిద్రం… అంటే ఆ పేరు బయటికి రాదా..? మీరు దాచిపెడితే ఆ వాసన బయటికి రాదా..? అఫ్‌కోర్స్, చంద్రబాబు, లోకేష్ స్టిల్ సైలెంటు… నైతిక వర్తన కేరాఫ్ టీడీపీ కదా పాపం…

(ఈ యెల్లో ఎంపీ ఒకాయన పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయిన రోజు చీకటిరోజు అని పిచ్చికూతలు కూస్తే టీడీపీ కూటమి నుంచి కనీస స్పందన లేదు, జనసేన నుంచి కూడా… అఫ్‌కోర్స్, 11 రోజులు నిద్రాహారాలు మాని విలపించిన బడా నాయకుడి పార్టీ కదా)…

ఏముంది లెండి..? చంద్రబాబు సీరియస్, మందలింపు, పార్టీ క్రమశిక్షణ కమిటీకి అప్పగింత అని ఏవో నాలుగు పిచ్చి, డొల్ల వార్తలు రాయిస్తారు ఇదే యెల్లో మీడియాలో… నాలుగు రోజులకు ఇంకేదో డైవర్షన్… అన్నట్టు సదరు ఏలూరు ఎంపీ ఎవరో తెలుసా..? ది గ్రేట్ చంద్రబాబు మెచ్చిన పాత టీడీడీ ఛైర్మన్ కొడుకు అట… అసలే ఇప్పుడు టీవీ5 నాయుడి అవేవో వీడియోలతో రచ్చ… ఇప్పుడీ ఎంపీ బాగోతం… భలే దొరికారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ ట్రెండ్ సెట్టర్ కవి వైరముత్తు… అందుకే వరించిన జ్ఞానపీఠ్…
  • పింక్, యెల్లో క్యాంపులు కిక్కుమంటే ఒట్టు… డ్రగ్స్ తేళ్లు కుట్టిన దొంగలు…
  • అక్కినేని – వాణిశ్రీ… వయసు మీద పడినా సరే ఎవర్‌గ్రీన్ జోడీ…
  • “ఆకలిపై యుద్ధం… 500 కోట్ల భోజనాలు… అక్షయపాత్ర అమోఘ ప్రయాణం”
  • మన్ పిశాచ్… ఐఫోన్, 33 వేల ఖర్చు, ఒకేరోజు షూట్… సినిమా కంప్లీట్…
  • ఏక్‌సేఏక్… దొందూ దొందే… బంగ్లా, పాక్ క్రికెటర్ల ‘చీప్ యాక్షన్’…
  • మూసీపై ఆ ముగ్గురు పాత సీఎంలు చేతులెత్తేసిన విధంబెట్టిదనిన..!!
  • టైటిల్‌లో అగ్ని ఉంటే చాలు… ఆ సినిమా మండిపోయి మసి..!
  • అమెరికా- ఇజ్రాయిల్ ప్లాన్లు ఎక్కడ బెడిసికొట్టాయి..? నెతన్యాహూ సేఫేనా..?
  • హనుమంతు జగన్నాయకుల దొర… తెలుగు పోలీసుల్లో ఓ చరిత్ర…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions