.
మొత్తానికి ఇండియా తన సామర్థ్యానికి తగిన ఆటతీరు చూపించింది… తనెవరో ఇంగ్లండ్ ప్లేయర్ అన్నాడు కదా, మొత్తం స్టేడియం సైలెంట్ అయిపోయేట్టు చేస్తామని… ఒక్క సెకండ్ కూడా సైలెంటుగా లేదు స్టేడియం… ఫస్ట్ బాల్ నుంచి చివరి బాల్ దాకా వయొలెంటే…
టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఇండియాకు సెకండ్ హయ్యెస్ట్ స్కోర్… అన్ని జట్లతో పోల్చినా ఫోర్త్ హయ్యెస్ట్… 253 పరుగులు… మామూలు స్కోర్ కాదు… ఒక్క అభిషేక్ శర్మను వదిలేస్తే బ్యాటర్లు అందరూ తమదైన పాత్ర పోషించారు… హార్దిక్ పాండ్యా కారణంగా అనవసరంగా దూబె ఔటయ్యాడు గానీ, లేకపోతే ఈ స్కోర్ మరింత పెరిగి, టాప్ వన్ స్కోర్ రికార్డు కూడా వచ్చేదేమో…
Ads
దక్షిణాఫ్రికా చేతుల్లో ఓటమి తరువాత… అసలు సెమీస్‌కు పోతుందా లేదానే సందేహాల నడుమ… దర్జాగా ఫైనల్స్‌లోకి వెళ్లడం గ్రేటే… ఇక్కడ మెచ్చాల్సింది మొత్తం జట్టును… కానీ సంజూ శాంసన్‌కు ఎక్కువ క్రెడిట్స్ దక్కాలి… సూర్యకుమార్ యాదవ్ ఇంకొద్దిసేపు నిలబడినా బాగుండేదేమో… బట్, అఫ్కోర్స్… ఎక్కువ పరుగులు చేయాలనే ధోరణిలో డిఫెన్స్ కుదరదు… ఎందుకంటే, ప్రత్యర్థి ఇంగ్లండ్ కాబట్టి… ఇది సెమీస్ కాబట్టి…! భలే టఫ్ ఫైట్ ఇచ్చింది కాబట్టి…!
హార్దిక్ ఫస్ట్ బాల్, ఫస్ట్ వికెట్ సాల్ట్… అది నో లుక్ వికెట్… అక్కడి నుంచి మొదలైంది ఇంగ్లండ్ వికెట్ల పతనం… ముందు నుంచీ అనుకుంటున్నదే ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్‌ను గనుక త్వరగా ఔట్ చేయగలిగితే ఇండియాకు బీభత్సమైన గెలుపు దక్కుతుందని… అదే జరిగింది…
బుమ్రాను ఓసారి మెచ్చుకోవాలి… వన్ డే, టెస్టు, టీ20 మ్యాచుల్లో 500 వికెట్లు సాధించిన బౌలర్… తను కూడా ఫస్ట్ బాల్కే ఓ వికెట్ తీసుకున్నాడు… అదీ ఓవకి వికెటో తెలుసా..? అత్యంత ప్రమాదకరంగా పరిగణించిన బ్రూక్‌దే..!
మొత్తం స్టేడియం సంబరాలు చేసుకుంది… మొత్తం క్రికెట్, పొలిటికల్, సినిమా, టీవీ సెలబ్రిటీలందరూ కనిపించారు ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో… ఎంజాయ్ చేశారు… కావల్సిన రన్‌రేట్ మరీ ఎక్కువ కావడంతో మొదటి నుంచే అవసరార్థం దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది…
ఒక్క ఇంగ్లండ్ ప్లేయరైనా మరీ న్యూజీలాండ్ ఫిన్ అలెన్ లాగా అసాధారణ ఇన్నింగ్స్ ఆడితే తప్ప ఇంగ్లండ్‌కు ఏమాత్రం చాన్స్ లేదని అనుకుంటున్నదే… కానీ ప్రతి మ్యాచులో అలాంటి ప్లే కష్టం కదా… బెథెల్ జోరుగా మెరుపులు మెరిపించినా సరే లాభం లేకుండా పోయింది…
వరుణ్ చక్రవర్తి కూడా తన ఫస్ట్ ఓవర్లోనే బట్లర్ వికెట్ తీశాడు… పవర్ ప్లే అయిపోయేసరికి 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్… అక్షర్ పటేల్ కూడా తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు… వరుసగా హార్దిక్, వరుణ్, బుమ్రా, అక్షర్… అందరూ తమ ఫస్ట్ ఓవర్లలోనే వికెట్లు తీయడం చిన్న విశేషం… కానీ ఇంగ్లండ్ ఫైట్ చేసిన తీరు మాత్రం సూపర్… ఒక దశలో ఇండియాకు చెమటలు పట్టించింది అంత స్కోర్ చేజింగు చేస్తూ..!
ప్రత్యేకించి బెథెల్- జాక్స్ పార్టనర్షిప్… ఏమాటకామాట బెథెల్ సూపర్ ఇన్నింగ్స్… ఒంటి చేత్తో ఇంగ్లండ్‌ను గెలిపిస్తాడా అన్నట్టుగా… చివరి ఓవర్లో రనవుట్ కావడంతో తన ఇన్నింగ్స్ ముగిసింది, మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వెళ్లిపోయింది… కానీ తను ఇండియన్ ఫ్యాన్స్‌ను మ్యాచ్ చివరి దాకా మునివేళ్లపై నిలబెట్టాడు టెన్షన్‌తో…
253 పరుగుల్ని ఛేజ్ చేసి, 246 పరుగులు చేయడం మామూలు విషయం కాదు… వావ్, ఇంగ్లండ్… ఇక ఫైనల్ న్యూజీలాండ్, ఇండియా నడుమ... మార్చి 8న... ఇండియా అభిమానుల్లో ఆశలు దీంతో బాగా పెరిగిపోయాయి... కెన్ సూర్య కుమార్ యాదవ్ అండ్ టీమ్..?!
Share this Article