.
ప్రస్తుతం వినవస్తున్న వార్తల ప్రకారం రేపు బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ రాజ్యసభకు నామినేషన్ వేస్తాడు… తనను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని, ముఖ్యమంత్రి పదవిని బీజేపీకి అప్పగిస్తారు… నితిశ్ కొడుకు ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు… ఇప్పుడు తను పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తాడు, ఏ బాధ్యత అప్పగిస్తారో తెలియదు…
మొన్నటి ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి రెండూరెండున్నరేళ్లు నితిశ్ సీఎం, తరువాత బీజేపీకి అప్పగించాలని…! నితిశ్ కొడుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్… పేరు నిశాంత్ కుమార్… ఇన్నాళ్లూ నితిశ్ వారసత్వ రాజకీయాలకు నేను దూరం అంటుండేవాడు…. కానీ చివరకు తను సైతం..? (ఏపీలో కూడా చంద్రబాబు నుంచి లోకేష్‌కు వారసత్వం అప్పగించే ఆలోచనలు సాగుతున్నాయని వార్తలు వింటున్నాం కదా…)
Ads
మరి నితిశ్ స్థానంలో ఎవరు బీజేపీ సీఎం అవుతారు..? ఇదీ ప్రశ్న… ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రి కమ్ హోం మంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరికే దక్కుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి… ఎవరు ఆయన అనే వివరాలకన్నా ముందు తన రాజకీయ నేపథ్యం పరిశీలిస్తే… ఓ విశేషం ఉంది…
తను సంఘ్ నుంచి ఎమర్జయిన లీడర్ కాదు… ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ కూడా లేదు… 56 ఏళ్ల సామ్రాట్ 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు… అదీ విశేషం కాగా, బీజేపీ ప్రబల ప్రత్యర్థిగా భావించే ఆర్జేడీ నుంచి తన పొలిటికల్ జర్నీ ప్రారంభించడం మరో విశేషం…
- ప్రారంభం…: 1990లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు…
- మంత్రిగా తొలి అవకాశం…: 1999లో రబ్రీ దేవి ప్రభుత్వంలో అతి చిన్న వయస్సులోనే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు…
- ఎమ్మెల్యేగా…: 2000, 2010లో పర్బత్తా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు…
- పార్టీ మార్పులు…: 2014లో జేడీయూ (JDU)లో చేరి జితన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు… 2017లో బీజేపీలో చేరాడు… అంటే కాషాయ శిబిరంలో చేరి తొమ్మిదేళ్లు… అంతే…
- బీజేపీలో ఎదుగుదల…: బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా (2023- 2024), శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు….
- ప్రస్తుత హోదా…: 2024 జనవరి నుండి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, నవంబర్ 2025 నుండి హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు…
కుటుంబ నేపథ్యం…: ఈయన రాజకీయ కుటుంబం నుండి వచ్చాడు… ఆయన తండ్రి శకుని చౌదరి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ ఎంపీగా పనిచేశాడు… తల్లి పార్వతి దేవి కూడా గతంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించింది…
బీహార్‌లో వెనుకబడిన తరగతుల (OBC) కులమైన ‘కోయిరి’ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది… అయితే తనను సీఎం చేస్తారనే అధికారిక ప్రకటన ఏమీ లేదు… ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే… అసలే ఆయన నితిశ్, నిత్య చంచలుడు… రేపటికల్లా స్టాండ్ మారొచ్చు కూడా..!!
Share this Article