.
Subramanyam Dogiparthi …. రాష్ట్రాన్నయినా రాసిస్తా కానీ నా కూతుర్ని మాత్రం నీ కొడుక్కిచ్చి పెళ్ళి చేయను . అయ్యో అయ్యో అయ్యయ్యో !! ఈ రెండు డైలాగులు విపరీతంగా పేలాయి ఆ రోజుల్లో . సురేష్ ప్రొడక్షన్స్ సినిమాల ద్వారా అగ్రతారగా వెలిగిపోయిన వాణిశ్రీ సెకండ్ ఇన్నింగ్సులో అటవీశాఖ మంత్రిగా అదరగొట్టేసింది ఈ బొబ్బిలి రాజా సినిమాలో…
- 1990 రోజుల కుర్రకారుకు హీరోయిన్ దివ్యభారతి అందంగా కనిపించిందేమో కానీ మాలాంటి 1970s కుర్రాళ్ళకు ఈ సినిమాలో వాణిశ్రీయే అందంగా కనిపించింది . ఈ సినిమా టివిలో ఎప్పుడు చూసినా నాకు దివ్యభారతి కన్నా వాణిశ్రీయే అందంగా కనిపిస్తుంటుంది .
పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ముందు ఈ పాత్రకు శారద అనుకున్నారట . రామానాయుడు గారు వాణిశ్రీనే ప్రిఫర్ చేసారట . నాయుడు గారు నాయుడు గారే . జనం నాడి బాగా ఔపోసన పట్టినోడు . ఆయన లెక్కే కరెక్ట్ .
Ads
వెంకటేష్ కెరీర్లో ఈ బొబ్బిలి రాజా సినిమా అతని కెరీర్ చేంజర్ అని చెప్పవచ్చు . అతన్ని విక్టరీ వెంకటేషుని చేసి అప్పటికే బాగా సెటిల్ అయిన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జునల సరసన నిలుచోబెట్టింది .
Gods must be crazy ఇంగ్లీషు సినిమాలో సీన్ల స్ఫూర్తితో ఈ సినిమా కధను రామానాయుడు గారు , సురేష్ బాబు , దర్శకుడు బి గోపాల్ , రచయితలు పరుచూరి బ్రదర్స్ అద్భుతంగా నేసారు . Humour + romance + soft and smooth revenge + action = బ్లాక్ బస్టర్ బొబ్బిలి రాజా . పలు కేంద్రాల్లో వంద రోజులు అడటమే కాకుండా మూడు కేంద్రాల్లో సిల్వర్ జూబిలీ అడి , 200 రోజుల ఫంక్షన్ని వైభవంగా జరుపుకుంది . వెంకటేషుకి , ఇళయరాజాలకు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి .
ఈ సినిమా కధ అందరికీ తెలిసిందే . మంత్రి గారమ్మాయి అడవికి సరదాగా వెళ్లి మేన బావను కలవటం , ప్రేమలో పడటం , మంత్రి గారు ఒప్పుకోకపోవటం , హీరో తన హీరోయిజాన్ని చూపి అత్తను మెప్పించి మరదలిని పెళ్లి చేసుకోవడంతో సినిమా శుభాంతం అవుతుంది . మధ్యలో రకరకాల మలుపులు
గొప్ప వినోదాత్మక సినిమా .
- 19 ఏళ్ళకే చనిపోయిన దివ్యభారతి ఈ సినిమా ద్వారానే హీరోయిన్ అయింది . తక్కువ టైంలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటి కూడా అయింది . మన ప్రత్యూష మరణం లాగానే ఈమె మరణం మీద కూడా చాలా పుకార్లు ఉన్నాయి .
ఈ సినిమా అఖండ విజయానికి ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు , బేక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన పాత్ర వహించాయి . డైలాగులు వినిపించకుండా BGM ని బాది వదిలి పెడుతున్న సమకాలీన సంగీత దర్శకులు , సౌండ్ ఇంజనీర్లు , ఎడిటర్లు ఇలాంటి సినిమాల మ్యూజిక్కుని వినాలి .
బలపం పట్టి భామ ఒళ్ళో , కన్యాకుమారి కనపడదా దారి అంటూ సాగే రెండు డ్యూయెట్లు సూపర్ హిట్టయ్యాయి . బలపం పట్టి భామ ఒళ్ళో పాట సంగీత కచేరీలలో మారుమోగుతూ ఉంటుంది . ఆ తర్వాత వద్దంటె వినడె పోకిరి , చెమ్మ చెక్క జున్ను ముక్క అంటూ సాగే ఈ రెండు డ్యూయెట్లు కూడా చాలా బాగుంటాయి . హీరోయిన్ని , ఆమె స్నేహితులను టీజ్ చేసే అయ్యో అయ్యో అయ్యయ్యో కూడా హుషారు హుషారుగా ఉంటుంది .
తమిళనాడులోని పొల్లాచి వద్ద పురవిపాలెం , అన్నామలై అడవులలో , తలకోన అడవి ప్రాంతంలో అడవి షూటింగ్ జరిగింది . నంద్యాల- గిద్దలూరు ఘాట్ సెక్షన్లో గూడ్స్ బండి మీద ఫైటింగులు షూట్ చేయబడ్డాయి . అందమైన అడవుల నేపధ్యంలో సినిమా అందంగా నడుస్తుంది .
ప్రధాన పాత్రల్లో కోట శ్రీనివాసరావు , సత్యనారాయణ , విద్యాసాగర్ , బాబూ మోహన్ , ప్రదీప్ శక్తి , బ్రహ్మానందం , శివాజీ రాజా తదితరులు నటించారు . బహుశా ఈ సినిమా చూడనివారు ఉండరేమో ! ఒకరూ అరా ఉంటే వెంటనే వాచ్ లిస్టులో పెట్టుకోండి .
సినిమా యూట్యూబులో ఉంది . Undoubtedly an unmissable hillarious , action , romantic , entertainer . నేను పరిచయం చేస్తున్న 1241 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article