.
Pardha Saradhi Upadrasta …. ఇండియాకు “Golden Horizon” మిస్సైల్ టెక్నాలజీ ఆఫర్ చేసిన ఇజ్రాయెల్
భారత్‌కు ఇజ్రాయెల్ నుంచి “Golden Horizon” అనే Air-Launched Ballistic Missile (ALBM) ఆఫర్ వచ్చింది. ఇది సాధారణ క్రూయిజ్ మిస్సైల్స్ కంటే పూర్తిగా భిన్నమైన టెక్నాలజీతో రూపొందించబడింది. బ్రహ్మోస్ కంటే వేగం ఎక్కువ .
Ads
Golden Horizon మిస్సైల్ అంటే ఏమిటి?
ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ మిస్సైల్ ఇది. ప్రయోగించిన తరువాత ఇది భారీ ఎత్తుకు చేరి, అక్కడి నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చి లక్ష్యాన్ని తాకుతుంది. ఈ ఫ్లైట్ ప్యాటర్న్ వల్ల ట్రాకింగ్ చేయడం , అడ్డుకోవడం చాలా కష్టం అవుతుంది.
వేగం, రేంజ్ & ప్రత్యేకతలు
ఈ మిస్సైల్ Mach-5 కంటే ఎక్కువ హైపర్ సోనిక్ స్పీడ్‌తో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. సుమారు 1,000–2,000 కిలోమీటర్ల వరకు దాడి చేసే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. బ్రహ్మోస్ వంటి క్రూయిజ్ మిస్సైల్ కంటే వేగంగా లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది.
భారత వాయుసేనలో ఎలా ఉపయోగపడుతుంది?
ఈ మిస్సైల్‌ను Su-30MKI ఫైటర్ జెట్లపై అమర్చవచ్చు. ఇలా చేస్తే శత్రు దేశ గగనతలం లోపలికి ప్రవేశించకుండానే దీర్ఘ దూర లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం భారత వాయుసేనకు వస్తుంది. విమానం ఎక్కడి నుంచి ప్రయోగిస్తుందో అనుసరించి వివిధ దిశల నుంచి దాడి చేసే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది.
స్ట్రాటజిక్ ప్రాముఖ్యత
భూగర్భ బంకర్లు, హార్డెన్ కమాండ్ సెంటర్లు, భారీ రక్షణ ఉన్న టార్గెట్లను ధ్వంసం చేయడానికి ఈ మిస్సైల్ ఉపయోగపడేలా డిజైన్ అయ్యింది. ఇది భారత్‌కు లాంగ్- రేంజ్ ప్రిసిషన్ స్ట్రైక్ సామర్థ్యాన్ని పెంచి, ప్రాంతీయ డిటరెన్స్‌ను బలోపేతం చేయగలదు. ఇరాన్ – ఇశ్రాయేల్ యుద్ధంలో ఇరాన్ ఒక్క భూగర్భ బ్యాంకర్ లను చేధించి మరీ చాలా నష్టం కలుగ చేసిన మిస్సైల్ గా దీనికి పేరు.
ఎందుకు ఇది కీలకం?
ప్రపంచంలో చాలా తక్కువ దేశాలే Air-Launched Ballistic Missiles ను ఉపయోగిస్తున్నాయి. భారత్ ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రైక్ డాక్ట్రిన్‌లో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది
ప్రస్తుతం స్థితి
ఇప్పటివరకు భారత్ లేదా ఇజ్రాయెల్ ప్రభుత్వాల నుంచి అధికారిక ధృవీకరణ లేదు. చర్చలు కొనసాగుతున్నాయని మాత్రమే సమాచారం. కాకపోతే భారత్ ప్రధాని మోదీ తదుపరి ఇజ్రాయేల్ పర్యటనలో ఈ చర్చలు పురోగతి సాగించి వివిధ రక్షణ ఒప్పందాల మీద సంతకాలు జరిగే అవకాశం ఉంది.
ఈ మిస్సైల్స్ ను makeinindia ప్రోగ్రామ్ ద్వారా భారత్ లో తయారు చేసే అవకాశాన్ని కూడా ఇరు దేశాలు పరిశీలిస్తున్నాయి. తద్వారా మేం తయారు చేస్తాం, ప్రపంచం కోసం తయారు చేస్తాం అనే పాలసీని భారత్ ముందుకు తీసుకెళ్తుంది.
తద్వారా ముందు ముందు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా తరువాత వెర్షన్లను మనమే తయారు చేసి మన రక్షణ వ్యవస్థలోకి నేరుగా వాడుకోవచ్చు. ఇజ్రాయేల్ తో మనకున్న గట్టి మిత్ర బంధం వల్ల టెక్నాలజీ పూర్తి ట్రాన్సఫర్ కు ఆ దేశానికీ అభ్యంతరం లేదు. — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #IndiaIsrael #GoldenHorizon #IndianAirForce #DefenceUpdate #Hypersonic #MilitaryNews #StrategicStrike
Share this Article