…
అసెంబ్లీ మీడియా పాయింట్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు… ధాటిగా కేసీయార్ వ్యవహారశైలిని, జనానికి దూరంగా బతుకుతున్న ఆయన రాజకీయ అనైతికతను ప్రశ్నిస్తున్నాడు… బాగుంది, స్ట్రెయిటుగా… (తను బీఆర్ఎస్ ఒకప్పుడు (అప్పటి టీఆర్ఎస్), తను కేసీయార్‌ను ధాటిగా ప్రశ్నిస్తున్న తీరు ఆసక్తిగా అనిపించింది…)
‘‘నువ్వు ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతవు, అసెంబ్లీకి రావల్సిన బాధ్యత లేదా..? పార్లమెంటరీ వ్యవస్థను, అసెంబ్లీని, గవర్నర్‌ను, మొత్తంగా ఈ శాసనసభ వ్యవస్థను… తద్వారా తెలంగాణ సమాజాన్ని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తావా..? కొత్త గవర్నర్ వచ్చాడు, గౌరవపూర్వకంగా కలుద్దాం అనే ఇంగితం కూడా లేదా..? మళ్లీ అనర్హత వేటుపడకుండా జస్ట్ అటెండెన్స్ కోసం వస్తావు, 5 నిమిషాలు కూర్చుంటావు, పోతావు… ఇదేనా ఓ ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యత సమాజం పట్ల..?’’
Ads
ఇదీ స్థూలంగా సారాంశం… తన రాజకీయ నేపథ్యం గురించి కొంత ఐడియా ఉంది… చెరుకు సుధాకర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమ వేదిక స్థాపించి, ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడిన ప్రోగ్రెసివ్ పర్సనాలిటీగా గుర్తుంది… కాకపోతే టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో ఇమడలేకపోయాడు, ఇలాంటివాళ్లు అందులో ఎలాగూ ఉండలేరు… దాన్నుంచి కాంగ్రెస్, తరువాత బీజేపీ… ఓ ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా గెలవడం ఓ విశేషమే…
తనలాగే నిజామాబాద్ నుంచి యెండల లక్ష్మినారాయణ కూడా… పార్టీ గెలుపులు కావు అవి, వ్యక్తుల గెలుపులు… కానీ బీజేపీ ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది యెన్నం శ్రీనివాసరెడ్డిని… తనే కాదు, బీజేపీలో చేరిన పలువురు ‘వ్యక్తిగత బలం’ ఉన్న నేతలు ఆ పార్టీలో ఇమడలేకపోయారు… నాగం, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, రాథోడ్ బాపురావు… ఇలా చాలామంది… ఈటల కూడా సఫర్ అవుతున్న తీరు చూస్తున్నాం… యెండల అక్కడే ఎలాగోలా అడ్జస్టవుతున్నట్టుంది… (యెన్నం కాంగ్రెస్ లో చేరాక స్థిరంగా అందులో కంఫర్ట్‌గా ఫిట్టయిపోయాడు)…
సరే, బీజేపీ అంతర్గత విభేదాలను వదిలేస్తే… ఓ వీడియో కనిపించింది… సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఈ యెన్నం గురించి ఏదో మీటింగులో మాట్లాడుతూ… ‘‘కలాం ఓ పుస్తకం రాశాడు, ఇదుగో ఇలాంటి లీడర్ల గురించే రాశాడు… మేం మాత్రమే బాగుండాలి అనుకునేవాళ్లు లీడర్లు కాదు, మనతోపాటు చుట్టుపక్కల అందరూ బాగుండాలి అనుకునేవాళ్లే లీడర్లు…’’ అని ప్రశంసిస్తున్నాడు అందులో… విశేషమే…
ఎందుకబ్బా అని చూస్తే… మరో వీడియో… తన తండ్రి స్మారకార్థం, ఓ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశాడు తను… ఆ వివరాల వీడియో… గుడ్… ఐతే ఇదేనా..? ఇలాంటికి తన నియోజకవర్గంలో, తన జిల్లాలో ఇంకా ఏమేం ఇన్నొవేటివ్, యూజ్‌ఫుల్ యాక్టివిటీస్ చేశాడనే వివరాలు కనుక్కోవాలి… బట్, ఒకటి మాత్రం నిజం…
ఏ పార్టీలో ఎవరున్నారు..? ఎవరు వెళ్లిపోతున్నారు..? ఎవరు ఎందులో చేరుతున్నారు..? ఇవి గాకుండా… లీడర్లు తమ సొంత బలంతో, మాస్ లీడర్లుగా ఎదిగితే… వాళ్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి బలం… ఈ నిజం బీజేపీకి తెలియలేదు, బీఆర్ఎస్ అసలే సహించదు… కాంగ్రెస్ అక్కున చేర్చుకుంది… ఇదే ఆ వీడియోలు చూస్తే అర్థమైంది…!!
Share this Article