Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!

March 1, 2026 by M S R

.

నిజం… విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన పెళ్లి ఫోటోలు నెట్‌లో ఫుల్ వైరల్… లైకుల్లో కొత్త రికార్డులు… నిజంగానే బాగున్నాయి అవి… నటనో, కృ‌త్రిమత్వమో గాకుండా వాళ్లిద్దరి నడుమ ప్రేమ కనిపించేట్టు సహజంగా… మరీ ప్రత్యేకించి కొడగు సంప్రదాయ ఆభరణాలు, పెళ్లి బట్టల్లో మెరిసిపోయారు…

నిజానికి దానికన్నా వాళ్లిద్దరూ కలిసి నటించబోయే రణబాలి సినిమా గ్లింప్స్ ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది… 18, 19వ శతాబ్దపు రాయలసీమ దంపతుల్లా..! మేకప్, లుక్కు భలే కుదిరాయి… రాహుల్ సాంకృత్యాయన్ ఓ పీరియాడికల్ స్టోరీ చేస్తున్నాను అంటున్నాడు కదా… అసలు ఎవరు ఈ రణబాలి..?

Ads



రణబాలి: ఇండియన్ దారుణ మారణహోమం

నేపథ్యం (The Setting)… 1876, రాయలసీమ… ఆకాశం మేఘాల్ని మరిచిపోయింది, భూమి నెర్రెలు తీసింది…. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) ఒక భయంకరమైన ప్లాన్ అమలు చేస్తాడు… అదే ‘ఆర్టిఫిషియల్ ఫామైన్’ (సృష్టించబడిన కరువు)… ధాన్యమంతా లండన్‌కు తరలిపోతుంది, సీమ జనం ఆకలితో అస్థిపంజరాలుగా మారుతుంటారు…

పాత్రల పరిచయం … రణబాలి (విజయ్ దేవరకొండ)…: తలపాగా, కళ్లలో నిప్పులు, ఒంటిపై బ్రిటిష్ బందీఖానా ముద్రలు…. అతను ఒకప్పుడు ఒక చిన్న సంస్థానానికి వారసుడు, కానీ ఇప్పుడు బ్రిటిష్ వారి దృష్టిలో ఒక ‘అడవి మనిషి’ (Savage)… ప్రజల పాలిట మాత్రం అతను ‘రణబాలి’— యుద్ధానికి ప్రాణాలను బలిచ్చే వీరుడు…

  • జయమ్మ (రశ్మిక మందన్న)…: ఊరిలో కరువు వల్ల తన వాళ్ళని కోల్పోయినా, ధైర్యం కోల్పోని గడుసు పిల్ల…. రణబాలికి నీడలా, అతని తిరుగుబాటులో ఒక భాగస్వామిలా కనిపిస్తుంది… వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆ ‘రణబాలి ఏందయ్య’ పాటలో చూసినట్లే చాలా రా అండ్ రస్టిక్ గా ఉంటుంది…


కథా గమనం (The Conflict)

బ్రిటిష్ గిడ్డంగుల్లో లక్షల టన్నుల బియ్యం కుళ్లిపోతున్నా, బయట జనం ఆకలితో చనిపోతుంటారు… రణబాలి తన గెరిల్లా ముఠాతో కలిసి ఆ గిడ్డంగులను కొల్లగొట్టడం మొదలుపెడతాడు… కేవలం అన్నం పెట్టడమే కాదు, బ్రిటీష్ వారు మన దేశం నుండి తరలిస్తున్న $45 ట్రిలియన్ల సంపద (బంగారం, వజ్రాలు) కాన్వాయ్‌లను దారి మళ్లించి, ఆ సొమ్ముతో మళ్ళీ సీమ గడ్డపై చెరువులు తవ్వించడం, ఆయుధాలు కొనడం ప్రారంభిస్తాడు…

రణబాలి

ప్రధాన ఘర్షణ (The Face-off)

సర్ థియోడర్ హెక్టర్ ఒక అనౌన్స్‌మెంట్ చేస్తాడు… “ఎవరైతే రణబాలి తల తెస్తారో, వారికి వెయ్యి ఎకరాల భూమి ఇస్తాం”… అప్పుడు మొదలవుతుంది అసలైన వేట…

  • ఒకవైపు బ్రిటిష్ తుపాకులు, మరోవైపు రణబాలి వేటకొడవళ్ళు…

  • 10 కోట్ల మంది భారతీయుల మరణాల వెనుక ఉన్న కుట్రను రణబాలి ప్రపంచానికి ఎలా చాటి చెప్పాడు?

  • తను ప్రేమిస్తున్న జయమ్మను, తన ఊరిని ఆ ‘మృత్యు కరువు’ నుండి ఎలా కాపాడాడు? అన్నదే క్లైమాక్స్…


ముగింపు (The Impact)

సినిమా చివర్లో, రణబాలి చనిపోయాడని బ్రిటిష్ రికార్డులు రాసుకుంటాయి… కానీ రాయలసీమ మట్టిలో ఆయన ఒక చరిత్ర పురుషుడిగా (Legend) మిగిలిపోతాడు…

“చరిత్ర మనల్ని చచ్చిన వాళ్ళ కింద లెక్కగట్టింది…. కానీ మేము పుడమి పుత్రులం, మళ్ళీ మళ్ళీ పుడతాం!” అనే డైలాగ్‌తో సినిమా ముగుస్తుంది… (సినిమా కథ ఇలాగే ఉండాలని ఏమీ లేదు… బోలెడంత క్రియేటివ్ ఫ్రీడమ్ మనవాళ్ల సొంతం కదా…)


ఇక్కడ ఓ చిన్న సంశయం, 10 కోట్ల మంది కరువు బారిన పడ్డారు అనే సంఖ్య… తెలుసు, ఇటు రాయలసీమ జిల్లాల్లోనే కాదు, బెంగాల్‌లోనైతే ఎక్కడ పడితే అక్కడ శవాల గుట్టలు, కరువు విలయతాండవం… చరిత్రలో లిఖించబడిందే… కానీ అప్పట్లో ఇండియా జనాభాయే 25 కోట్లు లేదు, అందులో 10 కోట్ల మంది మరణం అనేది అతిశయోక్తి అనిపిస్తుంది… ఏమోలెండి, క్రియేటివ్ ఫ్రీడమ్ కదా… ఆరేడు కోట్లు అటూఇటూ…!!

  • ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాదు, పాన్-వరల్డ్ స్థాయిలో భారీగా విడుదల కాబోతోంది…
  • కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా కంపోజర్…
  • ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo)… మీరు ‘ది మమ్మీ’ (The Mummy) సినిమా చూసుంటే, అందులో ‘ఇమ్హోటెప్’ పాత్రలో నటించిన ఆర్నాల్డ్ వోస్లూ మీకు బాగా గుర్తుంటాడు… ఇందులో ‘సర్ థియోడర్ హెక్టర్’ అనే బ్రిటిష్ అధికారి పాత్రను పోషిస్తున్నాడు… ఇక్కడ జనాన్ని కరువు కోరలకు బలిచేస్తూ, ఇండియాలోని సంపదను పక్కా ప్లాన్‌తో ఎలా తరలించాలో స్కెచ్ వేసే ఒక ‘మాస్టర్ మైండ్’ విలన్ గా ఆయన కనిపిస్తాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”
  • తండ్రి గ్యాస్ సిలిండర్లు మోసే ఓ కూలీ…! మరి ఇప్పుడు రింకూ సింగ్..?!
  • క్లీన్ కవిత..! అసలే మూలిగే బీఆర్ఎస్ మీద పే-ద్ధ తాటిపండు పడ్డట్టు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions