Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తండ్రి గ్యాస్ సిలిండర్లు మోసే ఓ కూలీ…! మరి ఇప్పుడు రింకూ సింగ్..?!

February 28, 2026 by M S R

.

‘భూమిని 70 శాతం నీరు కవర్ చేస్తే మిగతా ముప్పైశాతం రింకూ కవర్ చేస్తాడని ఫీల్డింగ్లో పేరు…’ సరదాగా చెప్పుకున్నా నిజంగానే తను మంచి ఫీల్డర్… ప్రత్యేకించి ఫీల్డింగ్ ప్రమాణాలు దయనీయంగా ఉండే ఇండియా జట్టులో ఈ కోణంలో రింకూ సింగ్ మంచి విలువైన ప్లేయర్…

తన తండ్రి ఖన్ చంద్ సింగ్ లివర్ కేన్సర్‌తో శుక్రవారం మరణించాడు… అంత్యక్రియల కోసం అలీగఢ్ వెళ్లిన రింకూ… ఆ బాధ నుంచి తేరుకోకుండానే, జట్టు అవసరాల రీత్యా వెస్టిండీస్‌తో కోల్‌కతాలో (ఈ ఆదివారం, మార్చి 1) జరగనున్న కీలక మ్యాచుకు ఆడనున్నాడు… ఇందులో జట్టుకు గెలుపు అవసరం, దానికి రింకూ సింగ్ అవసరం…

Ads

రింకూ సింగ్‌ది ఓ విభిన్నమైన సక్సెస్ స్టోరీ… తండ్రి అలీగడ్‌లో ఇంటింటికీ గాస్ సిలెండర్లు సప్లై చేసేవాడు… సిలిండర్ కంపెనీ యజమాని ఇచ్చిన రెండు గదుల ఇంట్లో తల్లీ, తండ్రీ, ఐదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండేవారు… కొడుకులందరికీ క్రికెట్ అంటే ఆసక్తి… కానీ తండ్రికి దాని మీద గౌరవం లేదు…

ఆయిదుగురిలో మధ్యవాడైన రింకూ సింగ్‌ని తండ్రి, చదివించే స్తోమత లేక తొమ్మిదో తరగతిలోనే చదువు మానిపించేశాడు… అప్పటి నుంచి ఆ కుర్రాడు సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడుతుండే వాడు… అతనిలో ప్రతిభ అందరూ గమనించేవారు కానీ, అలీగడ్‌ నుంచి బి.సి.సి.ఐ కి దారి ఎవ్వరికీ తెలిసేది కాదు…

జీషాన్ అనే కోచ్ అతడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినా, అతని ప్రస్థానం అంత సులభం ఏమీ కాలేదు… ఒకానొక దశలో కుటుంబానికి సాయం చేయడానికి కోచ్‌తో కలిసి ఊడ్చే పని (Sweeping) చేయడానికి కూడా రింకూ సిద్ధపడ్డాడు, కానీ మనసు మాత్రం క్రికెట్ మీదే ఉండేది…

ఆ ఐదు సిక్సర్ల మ్యాజిక్ (2023) …. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన మలుపు తనకు…

  • చివరి ఓవర్‌లో యష్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి, అసాధ్యం అనుకున్న విజయాన్ని కేకేఆర్ (KKR) కి అందించాడు…

  • ఆ రాత్రి తర్వాత రింకూ సింగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది… షారుఖ్ ఖాన్ స్వయంగా ఆయనను “బచ్చా” అని పిలుస్తూ తన కుటుంబ సభ్యుడిలా అక్కున చేర్చుకున్నాడు…

జాతీయ జట్టులో స్థానం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఆయన భారత జట్టులోకి (Team India) ఎంట్రీ ఇచ్చాడు… ముఖ్యంగా “ఫినిషర్” పాత్రలో ధోనీ తర్వాత అంతటి నమ్మకాన్ని కలిగించిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు… ఇదీ తన క్రికెట్ ప్రస్థానం…

కేన్సర్ తన ప్రాణాల్ని కబళిస్తుందని తెలిసన తండ్రికి రింకూ సింగ్ పెళ్లి చూశాకే మరణించాలని కోరిక… సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో పెళ్లి ఖాయమైంది… నిశ్చితార్థం జూన్ 8, 2025న లక్నోలో ఘనంగా జరిగింది… వివాహం 2026 జూన్‌లో జరగాల్సి ఉంది, కానీ తండ్రి మరణంతో వాయిదా పడొచ్చునేమో… ఏమో, వాళ్ల కుల సంప్రదాయం బట్టి ఉంటుంది…

ప్రియా సరోజ్

ఆమె ఎవరు..? యువ ఎంపీ…: ప్రియా సరోజ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ (Machhlishahr) నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ (SP) తరపున పోటీ చేసి విజయం సాధించింది… ఆమె భారతదేశపు అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీలలో ఒకరు…

ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా సీనియర్ రాజకీయ నాయకుడు… ఆయన మూడుసార్లు ఎంపీ… ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యే… రాజకీయాల్లోకి రాకముందు ఆమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసింది… ఎక్కడి గ్యాస్ సిలిండర్ కూలీ కుటుంబం… ఎక్కడ ఓ పేద్ద రాజకీయ కుటుంబంతో వియ్యం… అదే విధి కరుణ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”
  • తండ్రి గ్యాస్ సిలిండర్లు మోసే ఓ కూలీ…! మరి ఇప్పుడు రింకూ సింగ్..?!
  • క్లీన్ కవిత..! అసలే మూలిగే బీఆర్ఎస్ మీద పే-ద్ధ తాటిపండు పడ్డట్టు..!!
  • ఆమె జేఆర్‌డి టాటాకు నేరుగా ఓ పోస్ట్ కార్డు రాసింది… ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ…
  • ఒక్కతే… 2 లక్షల కిలోమీటర్లు… మోటార్ బైక్‌పై… అనేక దేశాల్లో…
  • కోల్ మిథేన్..! వాడుకోగలిగితే సింగరేణికి సూపర్ ఛాన్స్… కానీ..?
  • అవును, కాబోయే ఈ టీఎంసీ ఎంపీ హైదరాబాదీ… అసలు ఎవరీమె..?
  • మహాజనానికి మరదలు పిల్ల..! భలే టైటిల్… తగినట్టే కథాకథనాలు..!!
  • … మీరింకా అవే అడవుల్లో, అవే హోదాల్లో లేరు మాజీ కామ్రేడ్స్..!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions