Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న కార్పొరేషన్ పగ్గాలు… ఎవరీమె..?

February 7, 2026 by M S R

.

రీతు తావ్డే..! ఒక్కసారిగా ఈమె పేరు జాతీయ వార్తల తెర మీదకు వచ్చింది… ఎవరామె..? ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న మున్సిపల్ బాడీ… ముంబై కార్పొరేషన్ మేయర్ కాబోతోంది… దాదాపు 75 వేల కోట్ల బడ్జెట్ ఉండే ఆ ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్ మేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించనుంది…

ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకం అంటే..? 25 ఏళ్లుగా ముంబై అంటేనే శివసేన… ఇది శివసేన అడ్డా… గతంలో కూడా బాల్ ఠాక్రే చెప్పిందే శాసనం అక్కడ… కానీ ఠాక్రే సిద్ధాంతాల్ని అరేబియా సముద్రంలో నిమజ్జనం చేసిన ఘనవారసుడు ఉద్దవ్ ఠాక్రే చివరకు ముంబైని కూడీ బీజేపీకి పువ్వుల్లో పెట్టి మరీ అప్పగించాడు…

Ads

మొత్తం 227 కార్పొరేటర్లు ఉండే బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 89 సీట్లు సాధించింది… తోడుగా షిండే శివసేన 29 సీట్లు… దాంతో 118 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించింది…

ఉద్దవ్ ఠాక్రే 65 సీట్లతో చతికిలపడిపోగా… మరాఠీ విద్వేషాస్త్రాలతో పోరాడిన ఎంఎన్ఎస్ కేవలం 6 సీట్లతో ఘోర ఓటమి పొందింది… అజిత్ పవార్ ఎన్సీపీ అయితే మరీ మూడు సీట్లు మాత్రమే… సంస్థాగత బలం ఉన్న కాంగ్రెస్ 24 సీట్లు… రాష్ట్రంలో అది తన జాడల్ని తనే చెరుపుకుంటోంది…

కాలం మారింది… బీజేపీ రాజకీయాల ముందు మరాఠీ ప్రాంత ద్వేష రాజకీయం ఓడిపోయింది… ఎన్నికల ఫలితాలు రాగానే షిండే ముంబై మీద తన పట్టు కోసం తమకే మేయర్ పదవి కావాలంటూ ఏవో కథలు, ఏవో వేషాలు వేసినా బీజేపీ లొంగిరాలేదు…

ముంబై అంటేనే అది భారత దేశ ఆర్థిక రాజధాని… దాన్ని వదులుకోవడం బీజేపీకి ఇష్టం లేదు… పైగా షిండేకు వచ్చిన సీట్లు కూడా తక్కువే… అందుకే పట్టు సడలించలేదు… ఇప్పుడు తన మేయర్ అభ్యర్థిగా రితూ తావ్డేను ప్రకటించింది… కూటమి భాగస్వామికి షిండే వర్గానికి డిప్యూటీ మేయర్ పదవిని ఇస్తోంది…

bmc

ఈమె గురించిన వివరాల్లోకి వెళ్దాం… మొదట్లో ఆమె కాంగ్రెస్… భర్త రాజేష్ మధుకర్ తావ్డే ఓ చిన్న వ్యాపారి, నగరంలో ఘట్‌కోపర్ ఏరియా… 2012 మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరారు… అప్పటి నుంచి ప్రస్తుత ఎన్నిక వరకు ఆమె మూడోసారి ఎన్నిక…

బీఎంసీ ఎడ్యుకేషన్ కమిటీ ఛైర్ పర్సన్… పేరుకు ఎప్పుడూ తెరపైకి వచ్చి వీరంగం చేసే ఫైర్ బ్రాండ్ కాదు, ఆమె ఫైల్ బ్రాండ్… ముంబై నగర పాలనకు సంబంధించిన లోతుపాతులన్నీ తెలుసు ఆమెకు… సైలెంట్ వర్కర్… ఇప్పుడు బీజేపీకి ఆమే కావాలి… ఎందుకు..?

మహిళ… నగర పాలన మీద అవగాహన ఉంది… మరాఠీ నేపథ్యం… క్లీన్ ఇమేజ్ ఉంది… వివాదరహిత రాజకీయ కెరీర్… బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో మంచి సంయమనం ఉంది… అంతేకాదు, బీజేపీ ముంబైలో ఉద్దవ్ ఠాక్రే శివసేనను ఇంకా ఇంకా డిస్టర్బ్ చేయబోతోంది… దానికి రాజకీయ మెళకువలు తెలిసిన సీనియర్ కావాలి… అందుకే ఆమె ఎంపిక… ఆమెకు ముంబై నగర వ్యవస్థ మొత్తం తెలుసు…

ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన స్థిరచరాస్తుల విలువ కోటిలోపే… పైగా 15 లక్షల దాకా అప్పులు… ముంబై మాది అని విర్రవీగే ఠాక్రే శివసేన పెత్తనం పగిలిపోయింది… ఇంకా చెల్లాచెదురు కాబోతోంది… రాష్ట్ర బీజేపీకి అది అవసరం… ఉద్ధవ్ ఠాక్రేను మరింత దెబ్బ తీయాలి… ఆల్రెడీ ఎన్సీపీ, కాంగ్రెస్ సోదిలోకి లేకుండా పోయాయి…

ఆమే ఎందుకు..? ఆమె వెనుక పెద్ద రాజకీయ వంశం లేదు… అంటే—తిరుగుబాటు లేదు, స్వతంత్ర అజెండా లేదు… పార్టీ చెప్పిందే పాలసీ… మహిళా మేయర్‌గిా ఇమేజ్ గేమ్ కూడా… ముంబై లాంటి నగరంలో BJP “హార్డ్ హిందుత్వ” ఇమేజ్‌కు ఒక మృదువైన కవర్ కావాలి…

అర్బన్ మిడిల్ క్లాస్‌కు సేఫ్ సిగ్నల్, మీడియాకు సాఫ్ట్ స్టోరీ, రాజకీయంగా ఎలాంటి రిస్క్ లేదు, ఇది ఎమోషన్ కాదు — ఇమేజ్ మేనేజ్‌మెంట్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోల్ మిథేన్..! వాడుకోగలిగితే సింగరేణికి సూపర్ ఛాన్స్… కానీ..?
  • అవును, కాబోయే ఈ టీఎంసీ ఎంపీ హైదరాబాదీ… అసలు ఎవరీమె..?
  • మహాజనానికి మరదలు పిల్ల..! భలే టైటిల్… తగినట్టే కథాకథనాలు..!!
  • … మీరింకా అవే అడవుల్లో, అవే హోదాల్లో లేరు మాజీ కామ్రేడ్స్..!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • పాడ్ టాక్సీ..! గ్లోబల్ సిటీ దిశలో మరింత ఆధునిక రవాణా వ్యవస్థ..!!
  • పరుగుల బాబా…! వెధవ దొరికిపోయాడు..! ఇప్పుడు పరారీ పరుగులు..!!
  • ‘‘నేనెందుకు ఏడ్చానో నాకే అర్థం కాలేదు… ఈ ఎమోషన్ అర్థమేమిటి..?’’
  • నాకు తెలిసిన సౌందర రాజన్… గొప్ప మనీషి, ఆధ్యాత్మిక చైతన్యశీలి…
  • విజయ్‌తో విడాకులు కోరిన భార్య- మళ్లీ తమిళ వార్తల తెరపైకి త్రిష..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions