.
‘మావోడు చేసింది తప్పే, కానీ ఈ చిన్న తప్పుతో నా పెంపకాన్ని తక్కువ చేయకండి, పద్దతిగా పెంచాను, బాధపడిన వారికి నా క్షమాపణలు, ఆ సినిమాను మాత్రం ఆదరించండి’ అని ఈటీవీ ప్రభాకర్ ఏదో తెలివిగా తన కొడుకు, రోత స్టార్, వెగటు స్టార్, సోకాల్డ్ బూతు యాటిట్యూడ్ స్టార్ తప్పును కవర్ చేశాను అనుకున్నాడు పాపం…
ఇంత జరిగాక కూడా… ఇంకా పద్దతిగా పెంచాను అంటాడేమిటి..? బాధపడితే క్షమించండి అనడం ఏమిటి..? అసలు సినిమా ఎవడూ చూడకపోవడమే వాడికి సరైన శిక్ష కదా అనుకున్నారు ప్రేక్షకులు… చంద్రహాస్ భాషలోనే గుంజీ గుంజీ… డ్యాష్ డ్యాష్… సరే, గూబ పగులగొట్టారు… ఆ రోత ధోరణికి అదే సరైన శిక్ష అని తేల్చేశారు… వెరసి, నిర్మాతలు మునిగిపోయారు…
Ads
చంద్రహాస్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా, ఏమైందో తెలియదు… ఇలాంటివి రెండు రోజుల్లో వార్తల్లో ఉంటాయి, తరువాత ఎవరూ పట్టించుకోరు సాధారణంగా… ఇదీ అంతేనేమో… మరి ప్రేక్షకులు విధించిన శిక్ష ఏమిటో వివరాల్లోకి వెళ్తే… ఆ సినిమా పేరు బరాబర్ ప్రేమిస్తా… ప్రేక్షకుడు మాత్రం బరాబర్ శిక్షిస్తా అన్నాడు… చేశాడు.,.

4 కోట్ల దాకా ఖర్చు అని చెప్పారట మొదట్లో… నిజానికి 2 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు ఫిలిమ్ సర్కిళ్లలో ప్రచారం… పబ్లిసిటీ, ఈవెంట్లు మన్నూమశానం అన్నీ కలిసినా 3 కోట్లయితే దాటలేదు… నిజానికి ఈ గుంజీ గుంజీ పాట వివాదం లేకపోతే ఓ మోస్తరుగానైనా ఆడి, గట్టెక్కాల్సిన సినిమా… కానీ ఆ యాటిట్యూడ్ స్టార్ అతి కారణంగా అట్టర్ డిజాస్టర్ అయిపోయింది…
ఈ వివాదం కూడా ఓరకం పబ్లిసిటీ అవుతుందని అనుకున్నారేమో బహుశా నిర్మాతలు, కానీ ప్రేక్షకులు వేరేరకంగా తలిచారు… మొత్తం వచ్చిన వసూళ్లు 82 లక్షలు… వరల్డ్ వైడ్… ఇండియాలో 70 లక్షలు… డిస్ట్రిబ్యూటర్ల వాటాలు ఎట్సెట్రా మొత్తం కోతలు పోను మహా అయితే 30 – 40 లక్షలు కూడా వచ్చి ఉండవు నిర్మాతలకు… కాలిపోయింది…
పోనీ, ఓటీటీతో కొంత కవరవుతుందీ అనుకుంటే ఆ డీల్ కూడా కుదరలేదట… ఇక ఎవడైనా దిక్కుమాలిన శాటిలైట్ టీవీవాడు తీసుకుంటే కొంత చిల్లర ఖర్చులకు పనికొస్తాయి… సినిమా ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో పిచ్చి కూతలు, రోత పాటలు, ఓవరాక్షన్, ఇతరత్రా వివాదాలను ప్రేక్షకులు ఎలా తిప్పికొడతారో చెప్పడానికి ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా వివాదం ఓ మంచి ఉదాహరణ…!!
Share this Article