.
విరోష్… రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి వార్తలు అందరూ రాస్తున్నారు… ఆ ఫోటోలు అందరూ షేర్ చేస్తున్నారు… ఆమె మీద ప్రేమ, ఆ మొగుడి మీద ప్రేమ… ప్రేక్షకులకు ఈ పెళ్లి ఓ ఆనందకర సందర్భమే…
నిజానికి చాన్నాళ్లుగా సహజీవనంలోనే ఉన్నారు… పెళ్లి జస్ట్, ఓ తంతు… పెళ్లయిన తారల మీద ఇండస్ట్రీ శీతకన్ను వేస్తుందనీ, అవకాశాల మీద ప్రభావం ఉంటుందని ఆమెకూ తెలుసు… కానీ ధైర్యం చేసింది… పెళ్లి చేసేసుకుంది… ఐతే ఇక్కడ ఆమె పెళ్లి గురించి అనేక విశేషాలు…
Ads
ఆమె చిన్న చెల్లెలి గురించే గాకుండా… ఆమె కుల సంప్రదాయం ప్రకారం సపరేట్ పెళ్లి తంతు దాకా బోలెడు వార్తలు… కానీ ఆసక్తిని కలిగించింది… కన్నడ ఇండస్ట్రీలోని ఓ శెట్టి గ్యాంగ్ ఈరోజుకూ తనను వేధిస్తున్న తీరు ఓసారి చెప్పుకోవాలి… సొంత ఇండస్ట్రీలో ఆ గ్యాంగ్‌ను తట్టుకుని, నిలబడి, ఇతర ఇండస్ట్రీల్లోకి మళ్లి, ఏకంగా నేషనల్ క్రష్‌గా మారి… వేల కోట్ల వసూళ్ల హీరోయిన్‌గా ఎదిగి… చివరికి తెలంగాణ కోడలిగా మారింది…

ఆమెకు రక్షిత్ శెట్టితో పెళ్లి సంబంధం ఖాయమై… ఎంగేజ్‌మెంట్ జరిగేనాటికి ఆమెకూ, తనకూ 13 ఏళ్ల తేడా వయస్సులో… ఎక్కడో తేడా కొట్టింది, చెడిపోయింది, పెళ్లిదాకా పోలేదు… రద్దయింది… ఇక అక్కడి నుంచీ మొదలు పెట్టింది ఈ శెట్టి గ్యాంగ్ వేధింపుల్ని… పలు సందర్భాల్లో ఆమె నటించిన సినిమాల్ని నిషేధించాలని డిమాండ్లు చేసేదాకా…

ఎహె, పోరా, మీరెంత అన్నట్టుగా ఆమె ధిక్కరించింది… నిలిచింది… ఇప్పుడు కూడా ఆమె పెళ్లి మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తూ తమ రోత ధోరణిని ప్రదర్శిస్తోంది ఆ శెట్టి గ్యాంగ్… ఆ గ్యాంగులో ఉన్నది పురుషాహంకార రక్షిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, ప్రమోద్ శెట్టి, రిషబ్ శెట్టి ఎట్సెట్రా…

ఆమెతో పెళ్లి రద్దయిన రక్షిత్ శెట్టికి అత్యంత సన్నిహితుడైన ప్రమోద్ శెట్టి రీసెంటుగా ఏమన్నాడంటే..? ‘‘“ఆమె పెళ్లికి మాకు ఆహ్వానం అందలేదు… ఒకవేళ అందితే వెళ్తాం… కానీ ఆమె మమ్మల్ని పిలవదని మాకు తెలుసు, ఇందులో వింతేమీ లేదు… రక్షిత్ శెట్టి విషయానికొస్తే… జరిగిపోయిన దాని గురించి గదిలో కూర్చుని బాధపడటానికి అతనేమీ చాక్లెట్ తినే చిన్న పిల్లాడు కాదు…” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు…

ఇదొక రోత తత్వం… శుభమా అని ఆమె పెళ్లి చేసుకుంటుంటే ఈ చిల్లర వ్యాఖ్యలు దేనికిరా నాయనా..? కుసంస్కారం… రక్షిత్ శెట్టికీ ఆమెకు శృతి కుదరలేదు, పెళ్లి రద్దయింది, అది జరిగి కూడా ఏళ్లు గడిచాయి, ఐనా ఈరోజుకూ ఆమె మీద ఈ కోపం ఏమిటి..? వాళ్ల సంకుచిత ఆలోచనధోరణులను దాటేసి, ఆమె ఎన్నో రెట్లు ఎదిగిపోయిందనే అక్కసు…

నెటిజన్ల ఫైర్: “ఆమెను వదిలేయండి!”
ప్రమోద్ శెట్టి వ్యాఖ్యలపై రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు… “ఏ అమ్మాయి అయినా తన నిశ్చితార్థం రద్దైన పాత బాయ్‌ఫ్రెండ్‌ను లేదా తనను నిరంతరం ట్రోల్ చేసే వారిని పెళ్లికి ఎందుకు పిలుస్తుందిర భయ్?” అని ప్రశ్నిస్తున్నారు…

రష్మికను మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే..? ఈ శెట్టి గ్యాంగును బేఖాతరు చేయడం, ధైర్యంగా నిలబడటం… తన పని తను చేసుకుపోతూ, విజయాలు సాధిస్తూ… వాళ్ల అహాల మీద దెబ్బకొడుతోంది… సొంత ఇండస్ట్రీలో ఆమెకు ఎన్నిరకాల వేధింపులను తీసుకొస్తున్నా సరే, హూ కేర్స్ అని తలెగరేసి మరీ ధిక్కరిస్తోంది…

రష్మికా... ఆ శెట్టి గ్యాంగును అలాగే వదిలెయ్... కుళ్లుకోనీ... వాడెవడు నిన్ను వెలివేయడానికి..? అసలే మీది మిలిటరీ కులం, తలెగరేసి బతికే జాతి... ఎస్, అలాగే ఉండు కొడగు పిల్లా... అన్నట్టు... హేపీ మేరీడ్ లైఫ్ రష్మికా..!!

ఈ పెళ్లి తెలంగాణ, కొడగు సంప్రదాయాల్లో వేర్వేరుగా జరిగింది… ప్రత్యేకించి వధూవరులిద్దరూ ధరించిన బంగారు ఆభరణాలు భిన్నంగా, విశేషంగా కనిపిస్తున్నాయి… ఈ లింకులో చూడండి, వాటి వివరణ…
https://www.facebook.com/reel/2744400032595598
చాన్నాళ్లుగా లవ్వులోనే ఉన్నారు, ఒకరికొకరు బాగానే అర్థం చేసుకున్నారు, ఆమెకు గతంలో ఓ చేదు అనుభవం ఉంది… విజయ్ సంగతి తెలియదు… ఆ ఫోటోలు చూస్తుంటే ఏమాత్రం కృతిమత్వం కనిపించకుండా ముచ్చటేస్తోంది… సో, రీసెంట్ సెలబ్రిటీల పలు పెళ్లిళ్లలాగా నాలుగు రోజులకే మొహం మొత్తకుండా… కలిసి ఇలాగే బతికేయండి…

Share this Article