.
తెలంగాణ ఫుడ్ ప్రైడ్ సకినాలు… ఎస్, దానికితోడుగా సర్వపిండి… వేరే ప్రదేశాల్లోె ఎలా వండుతారో, ఏం పేర్లో నాకు తెలియదు గానీ… సరిగ్గా వండితే సర్వపిండి అంటేనే అదొక యూనిక్‌నెస్… (కొన్నిచోట్ల తపాలాచెక్క…)
కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక భ్రష్టుపట్టిన తెలంగాణ ప్రైడ్ అంశాల్లో ఈ సర్వపిండి కూడా..! చివరకు తెలంగాణ ఫుడ్ కల్చర్‌కు గరిమనాభి అని పేర్కొనే సిద్ధిపేటలో కూడా దీన్ని భ్రష్టుపట్టించారు… హైదరాబాదులోనైతే దీన్ని పాతాళానికి తీసుకుపోయారు…
Ads
అసలు సర్వపిండి అంటేనే కాల్చే రొట్టె… అదీ సర్వ… అంటే ఓ గిన్నెలో పదిలంగా, జాగ్రత్తగా వరిపిండిని ఇతర వంటసామగ్రితో కలిపి చుట్టూ ఒత్తి, జాగ్రత్తగా కాల్చే వంటకం… అత్యంత తక్కువ నూనె… కానీ ఇప్పుడు ఏం చేశారు..?
మీరు ఎక్కడైనా …. చివరకు తెలంగాణ స్వగృహ ఫుడ్స్ దగ్గర చూసినా సరే… (ఆంధ్రా స్వగృహాల సంగతి చెప్పక్కర్లేదు)… అక్షరాలా నూనె నిండుగా పోసి, ఆ పాన్‌లో గోలిస్తున్నారు… అంటే దాదాపు డీప్ ఫ్రై… మరి అలాంటప్పుడు అప్పాలకు, గారెలకు దీనికి తేడా ఏమున్నట్టు..?
సరే, మొత్తానికి సర్వపిండిని సర్వభ్రష్టుపట్టించారు సరే… ఏదో చెక్ చేస్తుంటే ఓ పోస్టు కమ్ ఫోటో కనిపించింది… వైరల్లీ అట… అదేదో పిజ్జాగా చేస్తున్నట్టు ఫోటో… అవునా..? సర్వపిండి అంటే తెలంగాణ పిజ్జానా అని ఆశ్చర్యమేసింది… ఈ ఫోటో చూడండి… ( ఆ సైట్ ఆంధ్రాయా, తెలంగాణాయా తెలియదు, గానీ ఈ వంటకం మాత్రం చిత్రంగా ఉంది, దాన్నే సర్వపిండి అంటారా..? ఏమో, తెలంగాణవాదుల ఇష్టం…)

ఫస్ట్, సర్వాపిండి అనే టైటిలే దరిద్రం… రైస్ పిండి కాదుర భయ్, వరిపిండి… సరే, రెండు కప్పులు, వోకే… శెనిగెపప్పు సగం కప్పు… తెలంగాణ సర్వపిండిలో ఆ రేంజులో శెనిగెపప్పు వేస్తారా..? ఏమో, వేస్తారేమోలే… తరువాత…?
నువ్వులు, పన్నీర్… వోకే… పన్నీర్ అంటే మోడరన్ టచ్, అయినా వోకే… న్యూట్రిషియస్… కానీ బేసిక్‌గా సర్వపిండి బేసిక్సే వదిలేస్తే ఎలా… అల్లం, వెల్లుల్లి వోకే… పచ్చి మిరపకాయలు..? సరే, అదీ వోకే… ఉప్పు, నూనె, నీళ్లు… లీవిట్…
అంతా వోకే… నిజమేనా..? ఫోటోలో చూపినట్టు… ఓ బర్గర్, ఓ పిజ్జా తరహాలో వస్తుందా..? నెవ్వర్… సర్వపిండిని పీడించి సన్నగా పాన్‌లో పెట్టాలట… నీకో దండంరా బాబూ… రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యేలా వేయండి అట….. అవునా..? సర్వపిండిని రెండు వైపులా వేయాలా..? ఎవడ్రా నువ్వు..!!
సర్వ లేదా పాన్‌కు ఒత్తిన పిండిలో పలుచోట్ల పొక్కలు, అనగా రంధ్రాలు పెట్టకపోతే అది సర్వపిండి ఎలా అవుతుందిరా నాయనా..?
నెట్‌లో సర్వపిండి రెసిపీ వీడియోలు చాలా ఉన్నయ్ గానీ… అందులో అధికశాతం సర్వపిండి బేసిక్స్ వదిలేసినవే… పైన చెప్పిన లింక్ కాస్త బెటర్… ఇందులో సర్వపిండి కేరక్టర్ చెడిపోలేదు… మరీ దాన్ని పిజ్జాలాగా, గోలించిన అప్పాల్లాగా చూపించడమే…. ట్రూ తెలంగాణ ద్రోహం..!! ఒరేయ్, మా వంటలనైనా కాస్త అలాగే ఉండనివ్వండర్రా..!!

అన్నట్టు సర్వ వేరు, మూకుడు వేరు… సరే, ఇప్పటి భాషల్లో మూకుడు వేరు… అది పెనం కాదు, మూకుడు కాదు, హైబ్రీడ్… కానీ సర్వ అంటే మూతి సన్నగా ఉండే గిన్నె..!!
Share this Article