Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాయి పల్లవి…! వాట్ ఏ కెరీర్… 15 సినిమాలు- ఏడు ఫిలిమ్ ఫేర్లు…!!

February 26, 2026 by M S R

.

పదేళ్లు… 15 మాత్రమే సినిమాలు… 51 నామినేషన్లు, 32 అవార్డులు… అందులోనూ ఏడు ప్రతిష్టాత్మక ఫిలిమ్ ఫేర్ అవార్డులు… ఏడు బ్లాక్ లేడీ అవార్డులు… సాయి పల్లవి అవార్డుల చరిత్ర కూడా ఓ రికార్డే…. ఇదీ నిన్న కొన్ని వార్తల్లో కనిపించిన విశేషం…

గ్రేట్… నటనలో, పాత్రల ఎంపికలో తన మెరిట్ అందరికీ తెలిసిందే… దానికి తగినట్టు వస్తున్న అవార్డులు కూడా విశేషమే… చాన్నాళ్లుగా తెలుగులో కనిపించడం లేదు… బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది… అందులోనూ వేల కోట్ల ప్రిస్టేజియస్ రామాయణంలో సీత పాత్ర తనకు పే-ద్ద బూస్టప్… గుర్తింపు…

Ads

సాయిపల్లవి

ఆమధ్య గోహంతకుల మీద ఏదో వ్యాఖ్యానాలు చేసి, ఒక సెక్షన్ తెలుగు ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కున్నది గానీ… అప్పటిదాకా మొత్తం తెలుగు సమాజం తనను ఓ కుటుంబసభ్యురాలిగా ప్రేమించింది… సరే, దాన్నలా వదిలేస్తే…

saipallavi

సీత పాత్రతో పాటు రీసెంటుగా కల్కిలో దీపిక పడుకోన్ పోషించిన పాత్రకు సీక్వెల్‌లో ఆమెను ఎంపిక చేసుకున్నారు అనే వార్త… దానికితోడు తాజాగా మణిరత్నం తీయబోయే ఏదో లవ్ స్టోరీకి కూడా ఆమె ఎంపికైంది అనే వార్త… జాతీయ స్థాయిలో ఆమె అనూహ్యంగా, అసాధారణంగా ఎదుగుతున్న తీరును చెబుతోంది…

saipallavi

(ఆమె స్వస్థలం కోటగిరి… తమిళనాడు, కర్నాటక బోర్డర్… బడగ కమ్యూనిటీ)… భారతీయ చిత్ర పరిశ్రమలో గ్లామర్ కంటే నటనకే ప్రాధాన్యతనిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తారలు అత్యంత అరుదు… సాయి పల్లవి ఆ కోవలోనిదే…

సాయిపల్లవి

తాజాగా కేరళలోని కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ (2026) వేదికగా ఆమె ఒక అద్భుతమైన చరిత్రను సృష్టించింది… తక్కువ కాలంలోనే అత్యధిక ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నటిగా ఆమె రికార్డులకెక్కింది… అమరన్ చిత్రానికిగాను ఉత్తమ నటి (తమిళం) అవార్డును అందుకోవడంతో ఆమె ఖాతాలో మొత్తం 7 ఫిలిమ్‌ఫేర్ అవార్డులు చేరాయి…

saipallavi

కేవలం 10 ఏళ్ల సినీ ప్రయాణంలో, అది కూడా కేవలం 15- 20 సినిమాలు కూడా పూర్తి చేయకుండానే సాయి పల్లవి ఈ స్థాయికి చేరుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది… ప్రేమమ్ (మలయాళం) తన తొలి సినిమాతోనే
బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు దక్కించుకుంది… ఫిదా (తెలుగు) భానుమతి పాత్రలో తెలంగాణ భాషతో
మెప్పించి ఉత్తమ నటిగా తొలి తెలుగు ఫిల్మ్ ఫేర్…

సాయిపల్లవి

శ్యామ్ సింగ రాయ్ (తెలుగు)లో దేవదాసి పాత్రలో ఆమె పండించిన భావోద్వేగాలకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది… అలాగే నాగచైతన్యతో చేసిన లవ్ స్టోరీ (తెలుగు) సినిమాకు కూడా ఉత్తమ నటి పురస్కారం లభించింది…

saipallavi

ఇక విరాటపర్వం (తెలుగు) వెన్నెల పాత్రలో ఆమె అద్భుత నటనకు ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డు రాబట్టింది… గార్గి (తమిళం)లో తండ్రి కోసం పోరాడే కూతురిగా ఆమె నటనకు ఉత్తమ నటి (తమిళం) అవార్డు… అమరన్ (తమిళం)లో ఇందు రెబెకా వర్గీస్ పాత్రకుగాను తాజాగా 7వ ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది…

saipallavi

మూడు వేర్వేరు భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం) ఉత్తమ నటిగా అవార్డులు గెలవడమే కాకుండా, ప్రస్తుతం సాయి పల్లవి తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామాయణం, కల్కి-2, మణిరత్నం సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోనుంది… గ్రేటే..!!

saipallavi

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాయి పల్లవి…! వాట్ ఏ కెరీర్… 15 సినిమాలు- ఏడు ఫిలిమ్ ఫేర్లు…!!
  • ఫోన్‌బుక్..! ప్రతి నంబరూ ఆత్మీయం కాదు, అవసరమైతే పలకరించదు..!!
  • పరకాల ప్రభాకర్… కేంద్ర ఆర్థికమంత్రి భర్తకు ఎక్కడో ఏదో దెబ్బ తిన్నది…
  • కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..?
  • రాయల్ టైగర్‌కు ఓ మాంసం ముక్క… ఆడిట్ వాడు పట్టేసుకున్నాడు…
  • పాటలు, డాన్సులు, యాక్షన్, స్టయిల్… ఫక్తు చిరంజీవి మార్క్ మూవీ…
  • తాజ్ హోటళ్ల నడుమ స్కై బ్రిడ్జ్… ఆసక్తి కలిగించే ఓ వార్త కథ..!!
  • గణపతి సైతం..! మావోయిస్ట్ పార్టీ చివరి వికెట్ కూడా త్వరలోనే..!!
  • ఆట వస్తువుల ఓ చిన్న వ్యాపారి… ట్రంపును నేల మీదకు దించాడు…
  • పురస్కారాల పందేరం వద్దు… అవార్డుల వైపు అందరి చూపు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions