.
Pardha Saradhi Potluri … చైనా తన ఎరువుల ఎగుమతుల మీద నిషేధం విధించింది!
ప్రపంచ ఎరువుల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానం లేదా రెండవ స్థానంలో ఉంటూ వస్తున్నది! ఒక సంవత్సరం మొదటి స్థానంలో ఉంటే రెండో సంవత్సరం రెండో స్థానంలో ఉంటుంది తప్పితే మూడో స్థానంలోకి వెళ్ళింది లేదు!
చైనా ఎందుకు ఎరువుల ఎగుమతి మీద నిషేధం విధించింది?
పైకి తన స్వంత అవసరాల కోసం అని చెప్తున్నా హార్మూజ్ జలసంధి దగ్గర క్రూడ్ ఆయిల్, CNG, LPG రవాణా ఆగిపోయిన తరుణంలో ప్రపంచ దేశాలు ఆర్ధికంగా దెబ్బ తింటున్నాయి అన్న సంగతి తెలిసిందే! ప్రపంచ దేశాలు అమెరికా మీద వత్తిడి తెచ్చి యుద్ధం ఆగిపోయేలా చేయడానికే!
Ads
అయితే ఇందులో ఇంకొక కోణం కూడా ఉండి ఉండవచ్చు! యుద్ధం ఆగిపోయినా ఇరాన్ లో ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందా లేక షా రెజా పహ్లావి అధికారంలోకి వస్తాడా అన్నది ప్రశ్నార్థకం! అమెరికా చెప్పినట్లుగా నడుచుకునే పహ్లావి చైనా కి ఆయిల్ సరఫరా చేయకపోవచ్చు ఇప్పటిలా డిస్కౌంట్ ధరతో!
So! చైనా ముందు జాగ్రత్తగా తన వనరులని కనీసం సంవత్సరం పాటు కాపాడుకునే ప్రయత్నంలో ఉండి ఉండవచ్చు!
ఎరువులు సరఫరా ఆగిపోతే ధరలు పెరుగుతాయి కాబట్టి ఒకందుకు అది కూడా లాభమే చైనాకి!
2024- 25 ఆర్ధిక సంవత్సరానికి $13.5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎరువులని ఎగుమతి చేసింది!
చైనా ఎరువులని దిగుమతి చేసుకునే దేశాలలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాలలో వియత్నాం, భారతదేశం ఉన్నాయి! బాంగ్లాదేశ్ కూడా తన ఎరువుల అవసరానికి చైనా మీదనే ఆధారపడ్డది! మలేషియా, ఇండోనేసియా దేశాలు పూర్తి స్థాయిలో చైనా నుండే దిగుమతి చేసుకుంటున్నాయి!
భారత్ పరిస్థితి ఏమిటీ?
చైనా నుండి భారత్ దిగుమతి చేసుకునే ఎరువుల పరిమాణం ఇలా ఉంది…
యూరియా, డై అమ్మోనియం ఫాస్పెట్ ( DAP ), NPK లని చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నది! ఇవి కాక కొన్ని స్పెషలైజ్ ఎరువులని కూడా చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నది! మొత్తంగా చూస్తే 80% ఎరువుల దిగుమతి చైనా నుండి భారత్ కి వస్తున్నాయి!
DAP – 5.11 లక్షల టన్నులు.
Mop ( Muriate of Potash ) – 28 వేల టన్నులు.
NPK – 9.61 లక్షల టన్నులు.
ప్రస్తుతానికి ఎరువుల కొరత లేకపోయినా ముందు ముందు ఆలస్యం కావొచ్చు!
ప్రత్యామ్నాయంగా రష్యాకి ఆర్డర్ పెట్టింది భారత ప్రభుత్వం. రష్యా మొదటి స్థానంలో ఉంటే చైనా రెండవ స్థానంలో ఉంటుంది ఒక్కోసారి! కెనడా మూడో స్థానంలో స్థిరంగా ఉంటున్నది ఎరువుల ఎగుమతులలో!
చైనా ఎగుమతుల మీద నిషేధం విధించగానే వెంటనే సింహ భాగం రష్యాకి మిగిలిన భాగం కెనడా, మోరాకో దేశాలకి ఆర్డర్ పెట్టింది భారత్!
ముందు ముందు ఇలాంటి అవాంతరాలు చాలానే చూడాల్సి వస్తుంది!
Share this Article