Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాలమూరు, పోలవరంతో రేవంత్ లింకులు… ‘గురు బాబు’ ఉక్కిరిబిక్కిరి…

May 12, 2026 by M S R

.

తెలంగాణకు మస్తు పైసలిస్తా, ఉద్దరిస్తా అంటున్నాడు కదా మోదీ… ట్రిపుల్ ఆర్, మెట్రో-2 వంటి ప్రాజెక్టుల మాటెలా ఉన్నా తన చిత్తశుద్ధికి అసలైన పరీక్ష పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టు… నిన్న చంద్రబాబు వెళ్లాడు, అమిత్ షాను కలిశాడు, జలశక్తి మంత్రి పాటిల్‌ను కలిశాడు… బనకచర్ల అలియాస్ నల్లమలసాగర్‌కు అనుమతి ఇవ్వాలని అడిగాడు… తనెందుకు వదులుతాడు..? కళ్లెదుట కాసుల వర్షం కనిపిస్తుంటే..!!

అసలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దగ్గర నుంచే చంద్రబాబు సాగునీటి కాసుల మజా తెలుసు… తరువాత వైఎస్ జలయజ్ఞం చూసి కుళ్లుకున్నాడు… వేల కోట్ల తన సంపదే ఎటో వెళ్లిపోతున్నట్టు ఫీలయ్యాడు… తరువాత అన్నింటినీ మించిన అత్యంత అవినీతి, వేల కోట్ల అక్రమాల కాళేశ్వరం ప్రాజెక్టు కథ చూశాడు… అందుకే బనకచర్ల ప్లానింగు, తరువాత ఏమైందో నల్లమలసాగర్ అంటున్నాడు…

Ads

  • నిజానికి జగన్, కేసీయార్ కలిసి దుమ్ముగూడెం నుంచి గోదావరి- పెన్నా అనుసంధానం పేరిట ఓ అత్యంత భారీ ఏటీఎం ప్లాన్ చేశారు… సమయానికి జగన్‌ను ఎవరు హెచ్చరించారో గానీ, కేసీయార్‌తో డబ్బు యవ్వారాలు పెట్టుకుంటే మునిగిపోతానని గ్రహించి తప్పుకున్నాడు… తరువాత కాళేశ్వరంతో కేసీయార్ ఎక్కడికో వెళ్లిపోయాడు… మొత్తం బీజేపీయేతర పార్టీల ఎన్నికల ఖర్చు పెట్టుకుంటాను, నాకు ప్రధాని పదవి ఇవ్వండి అని కోరేదాకా… ప్రపంచంలోకెల్లా అత్యంత అవినీతి ప్రాజెక్టు…

మరి చంద్రబాబు ఊరుకుంటాడా..? అందుకే నల్లమలసాగర్…! మోదీకి పరీక్ష ఎందుకంటే..? చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఎన్డీయే ప్రభుత్వం మనుగడ కేంద్రంలో… ఒకవేళ నల్లమలసాగర్‌కు అనుమతిస్తే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం… (పైగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి రాబోయే అన్ని ఎన్నికల్లో కూటమిగా తెలంగాణలో నిలబడి, ఉద్దరిస్తారట…)

బనకచర్ల అలియాస్ నల్లమలసాగర్‌పై తెలంగాణ బీజేపీలో ఎవరికీ సోయి లేదు, తెలంగాణపై ప్రేమ లేదు, కన్సర్న్ లేదు… రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే దానికి రకరకాలుగా అడ్డుపడుతూ తెలంగాణ ప్రయోజనాలపై రాజీ లేదని స్పష్టంగా నిలబడ్డాడు… గురువు గురువే, పేకాట పేకాటే… పోలవరంతో లింక్ పెట్టి, కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి- కావేరిని అడ్డుపెట్టి… రకరకాలుగా కొర్రీలు పడేసింది రేవంత్ ప్రభుత్వం…

ఐనా చంద్రబాబు వదలడుగా… మళ్లీ మళ్లీ వెంటపడుతూనే ఉన్నాడు… భారీ ఏటీఎం కదా తన ప్లాన్… కానీ కేంద్రం ఇప్పటికైతే వంగడం లేదు… ‘‘ముందు ఇచ్చంపల్లి నుంచి కావేరి అనుసంధానం అనుకున్నాం, కానీ ఇప్పుడు సమ్మక్క- సారలమ్మ (కంతానపల్లి) నుంచి కావేరి అనుసంధానం అనుకుంటున్నాం… చత్తీస్‌గఢ్ తన వాటా మేరకు నీటిని వినియోగించుకోవడం లేదు, ఓ కొత్త ప్రాజెక్టు అనుకుంటున్నారు వాళ్లు, ఐనా ఇంకా నీళ్లున్నాయి… సో, ఈ ప్రాజెక్టుకు అందరూ అంగీకరిస్తే లక్షన్నర కోట్లు ఇస్తాం’’ అన్నాడు జలశక్తి మంత్రి పాటిల్…

  • అంతేకాదు… ‘‘మీరు పాలమూరు- రంగారెడ్డికి వోకే చెప్పండి… సమ్మక్క-సారలమ్మ నుంచి కావేరికి వోకే చెప్పండి… అప్పుడు తెలంగాణ కూడా మీ నల్లమలసాగర్‌కు వోకే చెబుతుంది’’ అని స్పష్టత ఇచ్చాడు… గుడ్… తెలంగాణ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయన్నమాట… తాజాగా తెలంగాణ పోలవరం-2 దశకూ కొర్రీలు పెట్టేసింది… ముంపు, పరిహారాల సర్వే లేకుండా ఈ దశపై ముందుకు వెళ్లొద్దు, అలాగే 36 వాగుల ప్రవాహంపైనా అద్యయనం జరగాలి’’ అని ప్రాజెక్టు అథారిటీకి ఓ ఘాటు లేఖ రాసింది… పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనులు కొనసాగిస్తే తరువాత మీకే ఇబ్బంది అని హెచ్చరించింది…

ఎస్, ఇక్కడ అసలు ప్రశ్న… మోదీ ఈ స్టాండ్ మీద నిలబడతాడా..? చంద్రబాబు ఒత్తిళ్లకు గురై లొంగిపోతాడా..? తెలంగాణ బీజేపీ ముఖ్యులకు ఎలాగూ సోయి లేదు… మాట్లాడరు, ఈ ప్రాజెక్టులపై కనీస జ్ఞానం కూడా ఉన్నట్టు లేదు… ‘‘కలిసి రండి, డెవలప్ చేద్దాం’’ అంటున్న మోదీ తన మంత్రి పాటిల్ చెబుతున్న వైఖరిపై స్థిరంగా నిలబడి ఉంటాడా..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాలమూరు, పోలవరంతో రేవంత్ లింకులు… ‘గురు బాబు’ ఉక్కిరిబిక్కిరి…
  • ఆటగాళ్లపై వలపువల..? సోషల్ పోస్టులపైనా కొత్త ఆంక్షలు..!!
  • బ్రాండెడ్ బతుకు కావాలి… భారీ భరణం ఇప్పించండి యువరానర్…
  • ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి… అనుకున్నా ఏదో నవ్వని…
  • తనికెళ్ల భరణి ‘ఆరాధన’ వెనుక అసలు మానసిక కారణం ఏమిటి..?!
  • సీఎం విజయ్ భార్య సంగీత గైర్హాజరు… సరైన నైతిక నిర్ణయం…
  • దేవుడి దగ్గర కూడా రాజస పోకడలే..! సుధారెడ్డి ఆడంబర ప్రదర్శన..!!
  • రెండుగా చీలనున్న రెండాకులు..! అన్నాడీఎంకేలో ముసలం..!!
  • ఎంత అంబానీ అయితేనేం..? అడ్డంగా చేతులెత్తేసిన ‘స్టార్ కలెక్షన్’..!
  • ‘అన్‌ఫాలో’ కంట్రవర్సీ..! అంబానీ జట్టుతో హార్దిక్ పాండ్యా కటీఫ్..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions