Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…

February 7, 2026 by M S R

.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రమ్మని బీజేపీ పెద్దలు ఇంటికివెళ్లి మరీ ప్రాధేయపడ్డారు కదా… తెలంగాణ బద్ధ వ్యతిరేకి, దిష్టి వ్యాఖ్యల జనసేనానితో కలిసి ప్రచారం చేస్తే, సగటు తెలంగాణ బీజేపీ కార్యకర్త మనసును గాయపరిచినట్టే అని ఎన్ని విశ్లేషణలు వచ్చినా పెద్ద తలకాయలు పట్టించుకోలేదు… కారణాలు ఏమిటో, తెలంగాణ వ్యతిరేకిని మోస్తూ తెలంగాణలో వోట్లు ఎలా అడగాలని అనుకున్నారో కూడా తెలియదు…

సగటు తెలంగాణ బీజేపీ అభిమాని మనోగతాన్ని కూడా ‘ముచ్చట’ ఇంతకుముందే చెప్పింది కూడా… ఇదీ లింకు… పాపం టీబీజేపీ… 

Ads

పోనీ, తన దిష్టి వ్యాఖ్యలకు సారీ చెప్పాడా..? లేదు… పైగా కొండగట్టుకు వచ్చి, బీజేపీతో సంబంధం లేకుండా ఓ పొలిటికల్ షో కూడా నిర్వహించాడు… ఏపీలో పొత్తు, కూటమి వేరు… కానీ తెలంగాణలో సొంతంగా ఎదిగే ప్రయత్నాల్లో ఉండి, ప్రస్తుతం ఉత్తర తెలంగాణ మున్సిపాలిటీల్లో మంచి రిజల్ట్స్ కూడా సాధించే దిశలో కనిపిస్తున్న బీజేపీ… నాలుగు సినిమాటిక్ ప్రసంగాల పవన్ కల్యాణ్‌కు ఆ గెలుపు క్రెడిట్లను ధారాదత్తం చేయాలని అనుకుందా..? ఇదొక విషాదం…

టీబీజేపీ

జనసేన సొంతంగా 330 వరకూ సీట్లలో పోటీచేస్తున్నదట… ఇక్కడ వినిపించే వింత సమాచారం ఏమిటంటే..? ఉత్తర తెలంగాణలో బీజేపీ టికెట్లకు బాగా డిమాండ్ ఉంది… పార్టీ టికెట్లు దొరకనివాళ్లలో కొందరికి, అంటే రెబల్స్‌కు జనసేన టికెట్లు ఇచ్చారట… అంతా గందరగోళం… అసలు ఓ పార్టీ నిర్మాణం, వ్యవస్థ ఏమీ లేని జనసేనతో బీజేపీ అంటకాగడమే ఓ పొలిటికల్ బ్లండర్, పైగా ఇదొక తలనొప్పి…

చివరకు దిగువ కేడర్ నుంచి కూడా పవన్ కల్యాణ్ దగ్గర తెలంగాణ బీజేపీ పెద్ద తలలు ప్రాధేయపడుతున్న తీరుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది… ఒకరిద్దరు ఎంపీలయితే సీరియస్‌గా బీజేపీ పెద్దలకు వార్నింగులు ఇచ్చారట… కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కల్యాణ్ పాత మాటల్ని, తెలంగాణ వ్యతిరేక ధోరణులను బహుళ ప్రచారంలోకి పెడుతూ, బీజేపీ అవకాశాలకు గండి కొట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు… దాంతో పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుల కళ్లు తెరుచుకున్నాయట… దాంతో పవన్ కల్యాణ్ ప్రచార పర్యటనలకు ఫుల్ స్టాప్ పడిందట…

ఇక్కడ మరో ప్రశ్న… పర్యటనలు రద్దు చేసుకున్నాడు సరే, రద్దయినవి బీజేపీ కోసం జరిగేవి… మరి తెలంగాణ కొత్త ఉద్దారకుడిగా తెలంగాణ రాజకీయాల్లో షో చేయాలని అనుకున్నప్పుడు, సొంతంగా వందల సీట్లలో నిల్చున్నప్పుడు వాళ్ల కోసం ప్రచారం చేయాలి కదా మరి..? వాళ్లను పవనాలకు (గాలికి) వదిలేసినట్టేనా..? మీకు చాయ్ గ్లాసు టికెట్లు ఇవ్వడమే ఎక్కువపోర భయ్ అని చెప్పినట్టేనా..?

తెలంగాణ నా కర్మ భూమి అనో, ఖర్మ భూమి అనో … నేనుండేది హైదరాబాదులోనే, నేనూ తెలంగాణ స్థానికుడినే అనో… నా దిష్టి వ్యాఖ్యల అసలు మర్మం తెలుసా అనో, మళ్లీ ఏవో కమలం పూలు పెట్టాలి కదా తెలంగాణజనం చెవుల్లో… తెలంగాణ పట్ల జనసేన రాజకీయ ధోరణి ఏమిటో, ఆ సిద్ధాంతరాద్ధాంతాలు ఏమిటో చెప్పాలి కదా… మేనిఫెస్టోల దాకా ఎందుకులే గానీ, అసలు జనసేన ఫిలాసఫీ ఏమిటో సూచనప్రాయంగానైనా జనానికి తెలియాలి కదా… మరెందుకు పర్యటనలు రద్దు చేసుకున్నట్టు..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
  • అసలు ప్రేక్షకులే చూడని సినిమాకు మూడు ప్రభుత్వ అవార్డులు..!
  • సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…
  • చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!
  • ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…
  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!
  • ఆరోగ్యానికి ‘లలితకళా’ రక్ష…! ప్రొటియోమిక్స్ అంటే ఏంటి..?
  • గుణశేఖర్ గుణాత్మక పంథా… సామాజిక ఇతివృత్తాల వైపు… కానీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions