Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లోకేష్ & పవన్.., అన్నమయ్యను తెలుగు ప్రతీకగా ప్రకటించండి…

November 29, 2026 by M S R

.

“బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే….” అన్నమయ్య అన్నది. ఆ అన్నమయ్య అన్నది స్విట్‌జర్‌లాండ్ దేశంలో జరిగిన Solesberg festivalలో జూన్ 29న అమేరిక దేశపు (Cappella Ensemble) Chanticleer బృందం Vineel Garisa Mahal ప్రధాన గాయకుడిగా గానించబడింది; అది విశ్వ వ్యాప్తంగా ధ్వనిస్తోంది; స్వనిస్తోంది. ఆ వీడియో ఈ నవంబర్ నెలలో విడుదలైంది. తొలిగా ఈ సంకీర్తన ఈ బృందం చేత 2025లో పాడబడింది.

Arrangement excellence ఈ ఖండిక. ముఖ్యంగా గాత్రాలతోనే Contrapuntals, harmony ఈ రెండిని పొదివిన తీరు చాల గొప్పగా ఉంది. అన్నమయ్య సంకీర్తనను ఇలా రూపొందించడం, ఇలా మలచడం చాల గొప్ప విషయం. ఒక తెలుగు సంకీర్తనను విశ్వస్థాయి సంగీత ఖండికగా ఎంత మాత్రమూ ఔచిత్యం చెడకుండా చాల ఉదాత్తంగా మలిచారు.

Ads

Emotion; emotion; emotion… భావం అన్న మౌలికమైన అంశాన్ని దాటిన emotive గానం చేశారు ప్రధాన గాయకుడు Vineel Garisa Mahal. చాల గొప్ప గాత్రం, గానం ఆయనవి. గాత్ర ధర్మం, గానం శైలి అంతర్జాతీయ స్థాయి. మహోన్నతంగా పాడారు మొత్తం బృందం.

Intonation, rounded even singing, rounded even voice, verve, spirit, animation, modulation, mood, స్వరసమం, tinge, balance, freely flowing vocal line వంటి సార్వకాలీన అంతర్జాతీయ గాన, గాత్ర విశేషాంశాలతో ఈ ఖండికను కడు ప్రతిభతో, బహు ప్రజ్ఞతో సమర్పించారు Chanticleer బృందం. మన తెలుగు సంకీర్తన ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయంగా నమోదు అవడం విశేషం.

వినండి:

“అన్నమయ్య ప్రపంచ స్థాయి మహోచ్చిష్ట కవి!” అనీ, “అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి” అనీ నేను కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్నాను. అన్నమయ్య ఎలా అంతర్జాతీయ స్థాయి కవో నేను ఆంధ్రజ్యోతిలో 2019లో ‘అన్నమయ్య అన్నది’ శీర్షికతో వారి కొన్ని సంకీర్తనలపై అవగాహననిస్తూ సోదాహరణంగా తెలియజేశాను.

అన్నమయ్య అంత గొప్ప కవి, వైవిధ్యమైన కవి మరెవరైనా ఉన్నారా? నేను చెప్పలేను.
శిల్ప ప్రమాణాల రీత్యా, వస్తు తత్త్వం రీత్యా, శైలీ వైశిష్ట్యం రీత్యా మన అన్నమయ్య మహోన్నతుడు; మహా మాన్యుడు. అన్నమయ్య సనాతన మూర్తిమత్వం; అన్నమయ్య భారతీయతా రూపం. తెలుగు భాష పుణ్యఫలం అన్నమయ్య; తెలుగుకు వరం అన్నమయ్య.

అన్నమయ్య కృతులు అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లోకి చొచ్చుకు వచ్చేశాయి. నిజమైన ప్రజాకవి అన్నమయ్య. (ప్రజాకవి అంటే తెలుగులో మాత్రమే ఉండే ఏ వికృతమో, ఏ వికృత వ్యక్తో కాదు) అన్నమయ్య ఒక అంతర్జాతీయ తెలుగు ప్రజాకవి! ‘అన్నమయ్య తెలుగు కవితా సౌభాగ్యాల అయ్య!!’

annamayya keerthana in switzerland

‘అన్నమయ్య తెలుగుభాష ప్రతీక’ అవాల్సిన అవసరం ఉంది. అన్నమయ్యను ఇకనైనా తెలుగు భాషకు చిహ్నం లేదా ప్రతీకగా ఆధికారికంగా ప్రకటించుకోవాలస్సిన అవసరం ఉంది. అన్నమయ్య మాట అంతర్జాతీయంగా మోగుతున్న ఈ తరుణంలో, అన్నమయ్య అన్నది విశ్వవ్యాప్త ప్రస్తుతమవుతున్న ఈ తరుణంలో ఆధికారికంగా ‘అన్నమయ్య తెలుగు ప్రతీక’ అవాలి.

ఎట్లా అయితే తమిళ్షులు తమ తమిళ్ష్ భాషకు మహాకవి సుబ్రమణియ బారదియార్ (సుబ్రహ్మణ్య భారతియార్)ను ప్రతీకగా చేసుకున్నారో ఆ తీరులో మహోన్నతమైన కవి-తాత్త్వికుడు అన్నమయ్యను తెలుగుభాషకు ప్రతీకగా మనం ప్రతిష్ఠించుకోవాలి.

ఆధికారికంగా అన్నమయ్యను తెలుగుకు ప్రతీకగా ప్రకటించాలని మాన్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవినయంగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వర్యులకు
ఈ విషయంగా నిర్ణయమూ, కార్యచరణా చెయ్యాలని సవినయ విజ్ఞప్తి; విజ్ఞప్తి; విజ్ఞప్తి.

రోచిష్మాన్
9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లోకేష్ & పవన్.., అన్నమయ్యను తెలుగు ప్రతీకగా ప్రకటించండి…
  • ఓ క్షుద్ర మోసం ! బిడ్డ మనసు మార్చడానికి ‘క్షుద్ర పూజలు’..!
  • కత్తులు లేవు… రక్తపాతం లేదు… అయినా గుండెను తాకే ‘ఓ అమ్మ కథ..!
  • డీలిమిటేషన్‌తో మారిపోనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం!!
  • ఓహో… జగన్ యలహంక ప్యాలెస్ అసలు లీగల్ కథ ఇదన్నమాట!!
  • రియల్ మాటల మాంత్రికుడు- గురూజీ ఈయనే… పేరు పింగళి !!
  • రాజకీయం వీథి నాటకమైతే…. కనిపించేవి ‘బావర్చి బిర్యానీ’ సీన్లే !!
  • హోప్‌లెస్ సీఎం విజయ్… హీరో గారి జ్ఞానశూన్యతపై ఇదీ చార్జ్‌షీట్…
  • దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలకు కేంద్రం పరిష్కారం చూపిందా?
  • ఉప్పూనిప్పూ కలయిక! హరీశ్ తదుపరి అడుగులపై మళ్లీ చర్చ!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions