Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…

February 7, 2026 by M S R

.

కొందరు ఉంటారు… జర్నలిస్టులుగా మహా టెంపర్‌మెంట్ చూపించేవాళ్లు… ఏది ఎదురైనా ఢీకొంటారు… నిజాలు రాస్తారు… బెదిరింపులు ఎదురైతే ఎహెపోబే అంటారు…

పైగా ఒక అధికారి, ఒక నాయకుడు, ఒక సంస్థ అనబడే డొల్ల మార్మిక భాష వాడరు… పక్కాగా, సూటిగా, బట్టలిప్పి పేర్లు రాస్తారు… వో ఆనా, ఆనే దేవ్… ఏమొస్తుందో రానీ… జమీన్ రైతు అని నెల్లూరుకు చెందిన ఓ దశాబ్దాల చరిత్ర ఉన్న పత్రిక తీరూ అంతే… ఓనర్, డోలేంద్రప్రసాద్ నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు…

Ads

వర్తమాన జర్నలిజంలో… ప్రతీకార పోకడల్లో… నిజంపై నిటారుగా నిలబడటం చాలా పెద్ద టాస్క్… తెల్లారిలేస్తే చంద్రబాబుపై నిప్పులురిమే సాక్షిలో నిజానిజాల మాట దేవుడెరుగు, నాణ్యత లేని నాసిరకం కథనాలు… ఒక్క మిసైల్ పేలినట్టు కనిపించదు… క్రెడిబులిటీ లేనితనం, రఫ్ నేచర్… సరే, దానిది కూడా ఓ దశాబ్దాల విషాదం…

సరే, విషయానికొద్దాం… ఓ తాజా సంచిక… ముసలితనంలో చంద్రబాబు దురవస్థను పక్కాగా రాసేశాడు… ఎన్టీఆర్ చేతుల్లో నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన అల్లుడి కట్నంగా హైజాక్ చేసిన తీరు వేరు…

కానీ సాక్షాత్తూ చంద్రబాబు కొడుకు, లోకేషుడే పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా తన హస్తగతం చేసుకున్నాడు… మోదీతో భేటీ అయిపోయి, రేప్పొద్దున తెలుగుదేశం అంటే నేను, నేనంటేనే తెలుగుదేశం అన్నంత ఓ సర్టిఫికెట్ పొందాడు…

జమీన్ రైతు

ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ మిత్రులు జాన్తా నై… అన్నీ కాగితాల మీద… వాళ్లు కాడి కింద పడేసినా సరే… సొంతంగా తెలుగుదేశాన్ని తన భుజాల మీద మోయటానికి లోకేష్ రెడీ అయిపోయాడు… ప్రభుత్వంలో, పార్టీలో ఈరోజు చంద్రబాబు నథింగ్… లోకేష్ ఎవరీ థింగ్…

  • కంట్రాక్టులు, ఒప్పందాలు, చెల్లింపులు మన్నూమశానం అన్నీ లోకేషేనట… కాదు… ఎవరో కిలారు రాజేష్ అట… తన గ్యాంగ్ అట… వాళ్లే స్ట్రాటజీ టీమ్ అట… ఒకప్పటి చంద్రబాబు మార్క్ స్ట్రాటజీ టీమ్ గట్రా కాలగతిలో కలిసిపోయాయి… ఈరోజు ఏపీ వర్కింగ్ సీఎం కిలారు రాజేష్ అట… తను మగ శివగామి, తను చెప్పిందే శాసనం అట…

పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు… ఒకప్పుడు పప్పు అని వైసీపీ వెక్కిరించిన లోకేషుడు ఈరోజు సర్వంసహాధికారి… అంతటి వీర, భీకర, బీభత్స అరాచక పాలకుడు జగన్‌‌‌కు కూడా అంతుపట్టడం లేదట లోకేష్… అంతటి సినిమాటిక్ పర్సనాలిటీ పవన్ కల్యాణుడే కళ్లప్పగించి, చేష్టలుడిగి చూస్తున్న దృశ్యం…

  • తెలంగాణలోనూ అంతే కదా… కేసీయార్ కొడుకు కేటీయార్… తను చెప్పిందే శాసనం, తను గీసిందే గీత… మొన్నటిదాకా… ప్రభుత్వం, పార్టీ అన్నీ కేసీయార్ నుంచి హైజాక్… ‘‘నువ్వూ నీ అడ్డా ఫామ్ హౌజ్, అంతే’ అని బందీని చేసేశారు… కానీ తెలంగాణజనం కదా, ధైర్యంగా దెబ్బకొట్టి కుర్చీ నుంచి దింపేశారు… ఏపీజనం ఏతులెక్కువ, చేతలు తక్కువ కదా… చేతకాదు…

వర్తమాన కథనాల మేరకు… అయిపోయింది, చంద్రబాబు కథ ముగిసింది… ఇప్పుడు లోకేష్ గీసిందే గీత… చెప్పిందే ఉత్తర్వు… తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియా వ్యూహిస్టు, స్ట్రాటజిస్టు రాబిన్ శర్మ జస్ట్, నామమాత్రం… సోకాల్డ్ అస్మదీయ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా అంతే… సోకాల్డ్, కులసామ్రాజ్య నేతలు, సలహాదారులు, పెద్ద తలలు అందరూ నిమిత్తమాత్రులేనట…

  • సరే, జమీన్ రైతు డోలేంద్ర ప్రసాద్ పెట్టిన ‘తేడా చూడవద్దు, మేమూ గాడిదలమే’ అనే శీర్షిక నాకు అభ్యంతరకరం… నాటి ఎన్‌కౌంటర్ దశరథ్ రామ్ శర్మను ఆదర్శంగా తీసుకున్నాడేమో… కానీ హెడింగుల్లో గానీ, కథనరచనలో గానీ మరీ మర్యాదలు కాదు గానీ… ఇంకాస్త సాఫ్ట్ నేచర్ అవసరమేమో…

నో, నో, వీళ్లకు అలా కుదరదు… మళ్లీ వీళ్లే జగన్‌కు చేజేతులా 160 లేదా 170 సీట్లు ఇచ్చేట్టుగా వ్యవహరిస్తున్నారు అంటారా..? సరే, సరే… ఏపీకి వేరే దిక్కేముంది..? ఆల్టర్నేట్ ఏముంది..? సచ్చినట్టుగా అయితే ఎక్స్, లేదంటే వై… దొందూ దొందే… రూపాయికి ఎకరం చొప్పున ప్రభుత్వ భూముల్ని అమ్ముకునే ఈ ప్రభుత్వ పాలనలో… వీర, ధీర, శూర, అరివీర భయంకర చరిత్ర ఉన్న తెలుగు జనానికి వేరెవడు దిక్కున్నాడు..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…
  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
  • అసలు ప్రేక్షకులే చూడని సినిమాకు మూడు ప్రభుత్వ అవార్డులు..!
  • సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…
  • చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!
  • ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…
  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!
  • ఆరోగ్యానికి ‘లలితకళా’ రక్ష…! ప్రొటియోమిక్స్ అంటే ఏంటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions