Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవును, మేమిద్దరమూ ఒకటే… విజయ్- త్రిష బంధం ఇక బహిరంగమే…

March 6, 2026 by M S R

.

నిన్నా మొన్నా విజయ్ దేవరకొండ, రష్మిక మంధన్నా రిసెప్షన్, పెళ్లి వేడుక… భట్టి విక్రమార్క కొడుకు పెళ్లి వేడుక… సెలబ్రిటీల హడావుడి, వార్తలు, ఫోటోలు, హంగామా… కానీ చెన్నైలో జరిగిన ఓ రిసెప్షన్ మాత్రం బాగా కలకలాన్ని క్రియేట్ చేసింది…

తమిళ సినీ నిర్మాత కల్పతి సురేష్ కొడుకు పెళ్ళి రిసెప్షన్ కి విజయ్, త్రిషతో జంటగా హాజరు కావడమే ఆ విశేషం… తమిళ, తెలుగు సోషల్ మీడియా ఊగిపోయింది ఆ ఫోటోలు, ఆ వీడియో బిట్స్, ఆ పోస్టులతో… ఎందుకు అంటే..? దానికి ఓ రాజకీయ విశేషం కూడా ఉంది కాబట్టి…

Ads

కాస్త వివరంగా చెప్పుకుందాం… చాన్నాళ్లుగా విజయ్‌కు, సినిమా నటి త్రిషకూ నడుమ వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం సాగుతోంది… దీనికి తగినట్టు రీసెంటుగా విజయ్ భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది… కారణాల్లో విజయ్‌కు ఓ సినిమా నటితో ఉన్న అక్రమ సంబంధం అని పేర్కొంది… దీనికి ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ‘‘ముందు త్రిష ఇంటి నుంచి బయటికిరా, నీకు నిజమైన ప్రజాసమస్యలు తెలుస్తాయి’’ అని వ్యాఖ్యానించాడు…

మరీ చిల్లర విమర్శలు అనే ట్రోలింగ్ సాగడంతో తను క్షమాపణ చెప్పాడు… త్రిష కూడా తనను అనవసరంగా లాగుతున్నారని విమర్శించింది… కానీ ఎప్పుడైతే విజయ్ భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుందో, ఇక విజయ్ తెగించి త్రిషతో కలిసి  బహిరంగంగానే ప్రోగ్రామ్స్‌కు రావడం స్టార్ట్ చేశాడు… ఈ రిసెప్షన్‌కు హాజరు ఇలాంటిదే…

త్రిష

ఇప్పుడేమీ చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుంది వీళ్ళ ధోరణి… ఈ తమిళ నిర్మాత కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు కలిసే వచ్చారు, కలిసే వెళ్లిపోయారు… (అంతకుముందు ఏదో వీడియో బిట్‌లో నేనే కాబోయే సీఎం తెలుసా అని త్రిష సరదాగా చెబుతున్న సీన్ కూడా వైరల్ అయ్యింది…)

అప్పట్లో జయలలిత, ఇప్పుడిక త్రిష అని బోలెడు మీమ్స్, పోస్టులు వైరలయ్యాయి… (ఇద్దరూ బ్రాహ్మలే)… నిజానికి కాంగ్రెస్ విజయ్ టీవీకేతో పొత్తుకు ప్రయత్నించింది… (అఫ్‌కోర్స్, స్టాలిన్ మీద ప్రెజర్ కోసం)… కానీ ఎట్టకేలకు కాంగ్రెస్- డీఎంకే నడుమ పొత్తు మళ్లీ కుదిరింది… బీజేపీ కూడా విజయ్‌తో పొత్తుకు ట్రై చేసింది కానీ వర్కవుట్ కాలేదు…

ఈ స్థితిలో విజయ్ సాధించబోయే వోట్లు ఎవరి కొంప ముంచుతాయనేది ఆసక్తికరంగా మారింది… అన్నింటికీ మించి ఈ త్రిషతో వివాహేతర సంబంధం బహిరంగం కావడం, వాళ్లే బహిరంగం చేయడం కూడా ఆస్తక్తికరంగా మారింది… అబ్బే, ఈ అక్రమ బంధాలకూ, రాజకీయాలకు సంబంధం ఏమిటి అంటారా..?

భలేవారే… ఎంజీఆర్ జయలలిత బంధం ఏమిటి మరి..? తమిళనాట సినిమాలు, రాజకీయాల నడుమ కూడా ఇవే అక్రమ బంధాలు కదా… తమిళ రాజకీయాలను సినిమాలు, ఇలాంటి బంధాలు ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి… విజయ్- త్రిష అతీతులు ఏమీ కాదు కదా..!! అన్నట్టు ఇదేదో సెటిల్ చేసేయడమే బెటర్ అనుకున్న విజయ్ తన భార్య సంగీతకు ఏకంగా 250 కోట్లు ఇవ్వడానికి సిద్దపడ్డాడని వార్తలొస్తున్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • IPL … అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు… ఇండియన్ పైసా లీగ్…
  • దురంధర్-3 కాదు…! ఆదిత్య ధర్ దృష్టి మరో పే-ద్ద ప్రాజెక్టు మీద..!!
  • సిద్దిపేట మాత్రమే కాదు..! సిరిసిల్ల, గజ్వెల్ కూడా *అన్ బ్రేకబుల్* కావు..!!
  • ఒక హైజాకర్… ఒక గ్యాంగ్‌స్టర్… వేర్వేరు కథలు… ఒకటే అంతిమతీర్పు…
  • క్షమాపణకు ‘దురంధర్ స్టార్’ రెడీ… ఇక్కడితో ముగించాలని వేడికోలు…
  • … ఇప్పుడైతే ఆ పాట మీద పెద్ద గొడవ అయ్యేదేమో… అసలే మోహన్‌బాబు…
  • మల్టీ నేషనల్ కంపెనీలకన్నా మనవాళ్లు తక్కువేమీ కాదు… చదవండి…
  • ఓహ్… స్టార్‌టీవీ Vs జీటీవీ… ఇంత కథ ఉందా..? స్టార్ ఫుల్‌ఫామ్ తెలుసా..?!
  • ఏడుపుగొట్టు కేరక్టర్లను వదిలేయండి… దురంధర్ సక్సెస్ ఏంటో తెలుసా..?!
  • వావ్, షేన్ వార్న్..! సంపద సృష్టించడం అంటే, ఇదుగో ఇదీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions