Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దురంధర్-3 కాదు…! ఆదిత్య ధర్ దృష్టి మరో పే-ద్ద ప్రాజెక్టు మీద..!!

March 26, 2026 by M S R

.

దురంధర్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు… ఆల్రెడీ ఏడెనిమిది రోజుల్లో దాదాపు 1000 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా థియేటర్ రన్ పూర్తయ్యేసరికి బాలీవుడ్ ఆల్‌టైమ్ వసూళ్ల రికార్డు క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు… సరే, సినిమాతో ఇండియా, పాకిస్తాన్ దేశాల్లో రేగుతున్న ఎమోషనల్ కలకలం అల్టిమేట్…

ఇక్కడ ఓ ప్రశ్న… దురంధర్-3 ఎప్పుడు..? దురంధర్-1 తరువాత దురంధర్-2 కంప్లీట్ చేసి, జనంలోకి వదలడానికి దర్శకుడు ఆదిత్య థర్ పెద్దగా టైమ్ తీసుకోలేదు… నిడివి ఎక్కువైనా ‘ఎడిట్ కత్తెర’ల జోలికి పోకుండా అలాగే 4 గంటల కథను వదిలాడు… ఇక్కడ రెండు అంశాలు…

Ads

ప్రతిసారీ ఇంత నిడివిని ప్రేక్షకులు చూస్తారని అనుకోవడం రిస్క్… నిడివి ఎక్కువైనా పర్లేదు, వీలైనంత మసాలా, కంటెంటు కూరుదామని ఇతర దర్శకులూ ప్రయత్నిస్తారేమో… తమంతటతామే తప్పులో కాలేయడం అది… (యానిమల్ 3 గంటల 21 నిమిషాలు కాగా, దురంధర్-2 దాన్ని దాటి 3 గంటల 45 నిమిషాలు… కల్కి 3 గంటలు…) అసాధారణమైన స్క్రీన్‌ప్లే, కంటెంట్, ప్రజెంటేషన్ ఉంటే తప్ప జనం అంతసేపు థియేటర్లలో కూర్చోలేరు…)

రెండో అంశం… దురంధర్-2 సెన్సేషన్ తరువాత రాబోయే థర్డ్ పార్ట్ మీద విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి… హైప్ పెరుగుతోంది… ఎంత ఖర్చయినా సరే రెడీ అంటోంది జియో హాట్‌స్టార్… కానీ హై అంచనాలు ఉంటే, సెకండ్ పార్ట్‌తో పోలికలు పెరుగుతాయి… ఏమాత్రం తేడా వచ్చినా కుదేలే… పైగా సేమ్ ‘రా గూఢచర్యం’ (పచ్చి) కథలో ఇంకా కొత్తదనం తీసుకురావడం కష్టం… (ఆదిత్య థర్ సినిమాలన్నీ పాట్రియాటిక్ కంటెంటే…) థర్డ్ పార్ట్ తీసి సక్సెసైన ఉదాహరణలు… థూమ్, క్రిష్, గోల్‌మాల్… రాజమౌళి కూడా పాత రెండు భాగాలూ కలిపి కుట్టి మళ్లీ సొమ్ము చేసుకున్నాడు తప్ప బాహుబలి-3 సాహసం చేయలేదు…

ఈ అతి అంచనాలతో థర్డ్ పార్ట్ తీస్తే రిస్క్ ఏమిటో ఆదిత్యకు అర్థమైంది… అందుకే చెప్పాలనుకున్నది రెండు భాగాల్లో 8 గంటల కథను చెప్పేశాను, ప్రస్తుతానికి కొత్తగా ఏమీ లేదు అంటూ దురంధర్-3 మీద ఊహాగానాలకు తెరవేశాడు… ఐనా స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని జియో స్టూడియోస్ ఒత్తిడి చేస్తోందని వార్తలు వస్తూనే ఉన్నాయి…

నిజానికి ఇక్కడ మరో విషయం… అవతార్ సీరీస్ టెక్నికల్‌గా అద్భుతం… అలాంటిది కథలో కొత్తదనం తీసుకురాలేక అవతార్-3 ఆశించినంత సక్సెస్ చేయలేకపోయారు… దురంధర్-3 కూ ఆ రిస్క్ అధికం… గతంలో మగధీర బంపర్ హిట్ తరువాత రాజమౌళి నేల మీదకు దిగిరావడానికి, ప్రేక్షకుల హైప్‌ను తగ్గించడానికి మర్యాద రామన్న వంటి ఓ చిన్న సరదా కథను వదిలాడు… హైప్ చల్లారాక మళ్లీ ఈగ, బాహుబలి తీసి ఎక్కడికో వెళ్లిపోయాడు, అదొక స్ట్రాటజీ… ఆదిత్యథర్‌కు బహుశా ఇదే మేలైన మార్గమేమో…

aditya

కాదు, తనెలా చేయడు, మూలనపడిన తన చిరకాల వాంఛ ‘ది ఎమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడని ప్రచారం సాగుతోంది… అప్పుడెప్పుడో విక్కీ కౌశల్‌తో ప్లాన్ చేశాడు ఇది… గ్లింప్స్ గట్రా రిలీజయ్యాయి… అశ్వత్థామ చిరంజీవి కదా, బరిలోకి మళ్లీ దిగి, తను వర్తమాన ప్రపంచ సవాళ్లతో కొత్త టెక్నాలజీ సాయంతో ఎలా పోరాడతాడనేది కాన్సెప్టు…

కాస్త మైథాలజీ, కాస్త ఫాంటసీ, కాస్త సైన్స్, కాస్త థ్రిల్లర్… ఓ కొత్త జానర్… 500 కోట్ల ఖర్చవుతుందని, హైస్టాండర్డ్ (అవతార్ బాపతు) వీఎఫ్ఎక్స్ ప్లాన్ చేశాడు గానీ, అంత ఖర్చుకు ఎవరూ ముందుకు రాలేద… అప్పటికి ఆదిత్య మీద అంతగా నిర్మాణ సంస్థలకు నమ్మకం కుదరలేదు…

కానీ ఇప్పుడు..? అందరికీ తన మీద గురి… (ఇప్పుడు ఎఫీషియంట్ దర్శకుడిగా వచ్చిన పేరు తరువాత సినిమాతో నిలుపుకోవడం కూడా పెద్ద టాస్కే)…  ఈసారి అదే రణవీర్‌ సింగ్‌తోనే ఆ అశ్వత్థామ సినిమా చేస్తే ఆ రేంజ్ వేరే ఉంటుందని అనుకుంటున్నాడట… మొదట అల్లు అర్జున్‌కు ఈ కథ వినిపించాడనీ, వర్కవుట్ కాలేదనీ అంటారు… తరువాత చాలా పేర్లు షారూక్, రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్ తదితరుల పేర్లూ వినిపించాయి… కానీ ఆ ప్రాజెక్టు మాత్రం అటక దిగలేదు… ఇప్పుడు అందరి చర్చలూ దానిపైనే… కానీ..?

ఆల్రెడీ అశ్వత్థామ అనే కాన్సెప్టును, సిమిలర్ లైన్స్‌లోనే కల్కిలో తీసుకున్నారు, అమితాబ్ పాత్ర అదే… మరిక ఆదిత్య కొత్తగా ఏం చెబుతాడు..? అదీ అసలు టాస్క్… అందుకని అశ్వత్థామ ప్రాజెక్టులోపే ఏదైనా మరో పాట్రియాటిక్ సబ్జెక్టుతో ఓ చిన్న సినిమా జనంలోకి వదులుతాడనే చర్చ కూడా ఉంది… నిర్మాణంలో వేగం, పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంటాయి కదా ఆదిత్య సినిమాలో… ఏమో… అదే చేస్తాడేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అప్పట్లోనే రాఘవేంద్రరావు కంట్రాక్టు పెళ్లిని చూపించాడు !!
  • వెకిలి రాఖీ యాడ్‌ను నగల కంపెనీ తీసేసింది ! ఎవరి పరువు పోయింది ?!
  • మతం మా విశ్వాసం – ఓనం మా సంస్కృతి – కేరళ కొత్త తరం అభిమతం !!
  • ఏమండోయ్ ఇది విన్నారా..? ష్, ఆ చెవి ఇటు పడేయండి ఓసారి..!!
  • Very Toxic – పక్కా విషస్వభావి – Not for Grown-Ups also !!
  • అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు…
  • గవర్నర్‌పై ఐదు బుల్లెట్లు… ఆ 21 ఏళ్ల యువతి ఎవరు?
  • అసలే ఖర్చు తడిసిమోపెడు- పైగా ఇన్ని సుమోలు ఎందుకురా బుజ్జా..!
  • SLBC – ప్రకృతి కోపంతో దారిమూస్తే – మరో దారి తవ్వి గెలుస్తున్నాం !!
  • చిరంజీవి గ్లామర్ చీర నుంచి అన్నమయ్య చీర తత్వం దాకా..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions