Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… ఇప్పుడైతే ఆ పాట మీద పెద్ద గొడవ అయ్యేదేమో… అసలే మోహన్‌బాబు…

March 26, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు ఆడపడుచు వలె మల్లె పూల పందిరి లోకి నడిచిరావె సరిగమలా …. 1991 మార్చిలో , అంటే 35 సంవత్సరాల కింద ఇదే రోజుల్లో , వచ్చిన ఈ అసెంబ్లీ రౌడీ సినిమా అనగానే ముందుగా పాటల్లో గుర్తుకొచ్చే పాట ఇదే . చాలా శ్రావ్యమైన పాట . దర్శకుడు బి గోపాల్ చిత్రీకరణ కూడా బాగుంటుంది .

మోహన్ బాబు అదృష్టవంతుడు . ఈ సినిమా ఆయన స్వంత బేనర్లోనే వచ్చింది . అసెంబ్లీ రౌడీ అనే టైటిలుకు ఇప్పుడయితే బహుశా సెన్సార్ వారు సర్టిఫికెట్ కూడా ఇచ్చేవారు కాదేమో ! అప్పటికీ ఆరోజుల్లో అసెంబ్లీలో గట్టిగానే చర్చించబడిందని గుర్తు నాకు .

Ads

మరో అభ్యంతరం కూడా వచ్చేది ఇప్పుడయితే . పంతులూ పంతులూ పావు శేరు మెంతులు అంటూ ఓ బ్రాహ్మణ పురోహితుడిని ఆట పట్టించే పాట ఉంది . ఇప్పట్లో అయితే ఒక వేళ సెన్సార్ అయినా ఆ పాటను తీసేయక తప్పేది కాదేమో !!

సినిమా విజయానికి కారణం కధ , పరుచూరి బ్రదర్స్ డైలాగులు , మోహన్ బాబు డైలాగ్స్ డెలివరీ , దివ్యభారతి గ్లామర్ . కధ క్రెడిట్ తమిళ మాతృక అయిన సత్యరాజ్ , గౌతమి సినిమాకు దక్కుతుంది . మోహన్ బాబు ఇమేజికి తగ్గట్లు అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా వంటి పదునైన డైలాగులు ప్రేక్షకులకు బాగా ఎక్కాయి .

ఓ ఊళ్ళో బాషా అనే రౌడీ . ప్రతిఘటన సినిమాలో కాళీ గారులాగా . ఆ సినిమాలోలాగానే ఈ సినిమాలో కూడా హీరోయిన్ జాకెట్ కూడా తీసేస్తాడు విలన్ బాషా . ఆ దుష్టులను శిక్షించేందుకు పని కల్పించుకుంటాడు హీరో మోహన్ బాబు . రౌడీలతో జరిగిన ఘర్షణలో హత్యానేరం మోపబడి జైలుకు వెళ్ళవలసి వస్తుంది .

ఓ లాయర్ గారి ఐడియా ప్రకారం జైల్లో నుంచి అసెంబ్లీకి పోటీ చేయటం , ఓ వృధ్ధుడు ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి పోలింగ్ బూతుకు రావటం , శివాజీ నిర్దోషి అని ఓటుతో పాటు స్లిప్పులను వేయటం , శివాజీ ఎలక్షన్లలో గెలవటం తప్పకుండా వినూత్న ఆలోచనే . బహుశా ఈ సినిమాలోనే ఇలాంటి మలుపు ఉండటం .

మోహన్ బాబుతో పాటు సీనియర్ నటులయిన జగ్గయ్య , గొల్లపూడి మారుతీరావు , అన్నపూర్ణమ్మ , బ్రహ్మానందం , ఆహుతి ప్రసాద్ , ప్రసాద్ బాబు , నర్రా , పాకీజా , మాడా తదితరులు నటించారు . టివిలో వార్తలు చదివే పాత్రలో రోజారమణి తళుక్కుమంటుంది .

బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , చిత్రలు పాటల్ని శ్రావ్యంగా పాడారు . జాలాది వ్రాసిన తూరుపు కొండల అగ్గి పుట్టెరా దిక్కులన్నీ ఎరుపెక్కిపోయేరా ఎర్రగా ఉంటుంది . పేకల్లో జోకర్లా , తానాల గదిలోకి తారాజువ్వొచ్చింది పాటలు హుషారుగా ఉంటాయి .

తరచూ టివి చానళ్ళలో వస్తూ ఉంటుంది . సమకాలీన రాజకీయాల మీద , నాయకుల మీద చెణుకులు పుష్కలంగా ఉన్న ఈ సినిమా మోహన్ బాబుని కలెక్షన్ కింగుని కూడా చేసింది . సినిమా యూట్యూబులో లేదు . టివిలో వచ్చినప్పుడే చూడాలి . It’s an excellent entertainer filled with action, romance .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘రామాయణ’లో పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ? లేక కొత్త సౌందర్య దృక్పథమా?
  • ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!
  • స్మాల్ బడ్జెట్ – బిగ్ రెవిన్యూ ! కథాకథనాలు బాగుంటే కటౌట్లు దేనికోయ్ !!
  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!
  • దురంధర్ సినిమాలో చూపించింది ఈమెనే ! ఆ త్యాగానికి అశోకచక్ర !!
  • ‘‘భావి తరాలు రీల్స్‌ బందీలు – ‘రిథమ్’ తప్పిన అల్గా‘రిథమ్ బతుకులు’’
  • క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)
  • క్షుద్రోపాసన ! నెత్తురు, మద్యం, ఎముకలు, పుర్రెలు ! (మూడో భాగం)
  • దుష్టశక్తి కాష్మోరాలు !! అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? (రెండో భాగం)
  • హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions