Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాటలతోనే కథనం… ‘సింగ్ గీతం’ మరో ప్రయోగం… డీఎస్పీకి పరీక్ష…

May 2, 2026 by M S R

.

ఖచ్చితంగా మెచ్చుకోవాలి… సింగీతం శ్రీనివాసరావు వయస్సు 94 ఏళ్లు… ఆరోగ్యాన్నే కాదు, తనలోని దర్శకుడిని అదే జోష్‌తో, అదే చురుకుదనంతో కాపాడుకుంటూ… ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకుని, మరో సినిమాకు సిద్దపడిపోయాడు… మరో ప్రయోగం కూడా… దీన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై  నాగ్ అశ్విన్ నిర్మిస్తుండటం మరో విశేషం, సింగీతంకు సమర్పించే గౌరవం కూడా…

సింగీతం అంటేనే నిత్య విద్యార్థి, నిత్య ప్రయోగశీలి… తనకు వయస్సు జస్ట్, ఒక అంకె మాత్రమే… ఈ సినిమా పేరు సింగ్ గీతం… అదేలెండి, ఆయన పేరునే కాస్త విడగొట్టి భావస్పోరకంగా, తన కొత్త ప్రయోగానికి అన్వయిస్తూ క్రియేటివ్ టైటిల్ ఖరారు చేశాడు… మాటల్లేని ‘పుష్పక విమానం’ ఎక్కించినా, ‘ఆదిత్య 369’తో కాలం వెనక్కి తీసుకెళ్లినా అది ఆయనకే చెల్లింది కదా… ఇప్పుడు మరోసారి తన సృజనాత్మకతకు పదును పెడుతున్నాడు ఈ సినిమాలో… (ఈ చిత్రం జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…)

Ads

భారతదేశపు మొట్టమొదటి ‘మ్యూజికల్ ఫాంటసీ’గా ప్రచారం పొందుతున్న ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి… ఇది ఒక రహస్యమైన గ్రామం నేపథ్యంలో సాగే మ్యాజికల్ రియలిజం కథ…

  • ప్రతాప్ (ఆయాన్)…: తన లక్ష్యాల కోసం పోరాడే ఒక సామాన్య యువకుడు… అనుకోకుండా అతను ఒక వింత ప్రపంచంలోకి అడుగుపెడతాడు… అక్కడ కనిపించేవన్నీ నిజం కావు…. వినేవన్నీ అబద్ధం కావు… అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసానికి, ప్రకృతి పరిరక్షణకు మధ్య జరిగే పోరాటంలో ప్రతాప్ పాత్ర ఏంటి? ఆ మ్యాజికల్ గ్రామం అతనికి నేర్పిన పాఠం ఏంటి? అన్నదే ఈ సినిమా అసలు సిసలు కథ…

దేవి శ్రీ ప్రసాద్ (DSP) తన మ్యూజిక్‌తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడమనే పరీక్షకు సిద్ధమయ్యాడు… ఎందుకంటే..? ‘మ్యూజికల్ ఫాంటసీ’… సాధారణంగా సినిమాల్లో కథ మధ్యలో పాటలు వస్తాయి, కానీ ఈ ‘సింగ్ గీతం’లో ఎక్కువ శాతం కథా గమనాన్ని, పాత్రల భావోద్వేగాలను పాటల రూపంలోనే నడిపిస్తారని టాక్…

మన దగ్గర ఇలాంటి పూర్తి స్థాయి మ్యూజికల్స్ తక్కువ. హాలీవుడ్‌లో ‘లా లా ల్యాండ్’ లేదా డిస్నీ సినిమాల్లో ఉండే మ్యాజిక్‌ను మన నేటివిటీకి తగ్గట్టుగా సింగీతం ఎలా మలిచాడో చూడాలి… దేవి శ్రీ ప్రసాద్ కేవలం ఐటెం సాంగ్స్ లేదా మాస్ బీట్స్ మాత్రమే కాదు, కథను పూర్తిగా పాటలుగా నడిపించే ఈ ‘మాయా బజార్’ను ఎలా సక్సెస్ చేస్తాడో చూడాలిక… నిజంగానే సీన్లన్నీ పాటలతోనే సాగితే, థియేటర్లో ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా విభిన్నంగా ఉంటుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాటలతోనే కథనం… ‘సింగ్ గీతం’ మరో ప్రయోగం… డీఎస్పీకి పరీక్ష…
  • ఆప్ సీఎం ఎప్పుడూ ‘ఆన్’లోనే… ఇండియా ఇజ్జత్ తీసిన ఓ నిర్వాకం తెలుసా…
  • అందరికీ అచ్చొచ్చింది… ఐరన్‌ లెగ్స్ కాస్తా గోల్డెన్ అయిపోయాయి…
  • ఓ రష్యన్ మహిళ వీసా పొడిగింపు… రూల్స్‌పై ఇంట్రస్టింగ్ జడ్జిమెంట్…
  • ఓ కామ ప్రకోపి… ఆ మొగుడి సూసైడ్… కానీ ఆ పిల్లల గతి..? చిక్కు ప్రశ్న..!!
  • ఒకే ఒక్కడు… టెన్త్ పాసయ్యాడు… టీచర్లు దీపావళి జరుపుకున్నారు…
  • సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…
  • అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…
  • వీరప్పన్ ఫోటోలకూ ఫోరెన్సిక్ పరీక్షలు… చివరకు తేలిందేమిటంటే…!
  • అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions