పద్నాలుగేళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది… నిజాయితీగా చెబుతున్నాను… అప్పటికి పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియదు నాకు… మాటిమాటికీ ఏడుపొచ్చేది పెళ్లయ్యాక… ఎందుకంటే..? అమ్మానాన్నతో దూరంగా ఉండాల్సి రావడం… చిన్న పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇది సహజమే కదా… నా భర్తతో కూడా చనువుగా, ఎక్కువగా మాట్లాడకపోయేదాన్ని…
ఇంట్లో పని ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని… అందులో నన్ను నేను బిజీగా ఉంచుకునేదాన్ని… నా భర్తకు అర్థమైనట్టుంది ఎవరికైనా చదువు ఎంత ముఖ్యమో… అప్పట్లో భార్యల చదువును భర్తలు పెద్దగా పట్టించుకోని రోజుల్లో కూడా ఆయన అలా ఫీలయ్యారు… ప్చ్, మా అమ్మ ప్రిన్సిపాల్ కదా, నాకు ఎప్పుడూ చదువు మీద ఆసక్తి ఉండేది… దాంతో నాకు జ్ఞానం కోరుకున్నాను…
నా అత్తామామలకు మాత్రం నా చదువు అంటే అనాసక్తి… చదువుకుని ఏం చేస్తావ్ అనడిగేవారు సూటిగా… అడిగాను, అడిగాను… ఎప్పటికైనా లాయర్ కావాలనేది నా కోరిక… ఎలాగైతేనేం, నా పన్నెండో తరగతి కంప్లీట్ చేశాను… ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను… ఎవరెవరు మనస్సుల్లో ఏం ఫీల్ అవుతున్నారో పట్టించుకోలేదు నేను… నా కోరికలో అన్యాయం ఏముందని..?
Ads
సరిగ్గా పరీక్షలకు ముందే నాకు రెండో కొడుకు పుట్టాడు… నో కంప్రమైజ్… వాడిని నా భర్తకు అప్పగించేసి పేపర్-1 రాయడానికి వెళ్లిపోయాను… లా స్కూల్ చదువు స్టార్ట్ చేశాను… వీలు చేసుకునేదాన్ని… అటు పిల్లలు, ఇటు ఇంటి పని… చదువు దేనికనే ప్రశ్నల నడుమ నా పట్టుదల మరింత పెరిగింది… మెల్లిగా ఇరుగుపొరుగు కూడా సపోర్ట్ చేయసాగారు… నా చదివే సామర్థ్యాన్ని ఎవరూ శంకించలేదు, ప్రశ్నించలేదు… కొందరుంటారు, ఇప్పటికీ సూటిపోటి మాటలు అంటుంటారు… నేను అసలు వాళ్లను పట్టించుకుంటే కదా…
నా ఫిలాసఫీ ఒక్కటే… అవాంతరాలు, భగ్నాలు పట్టించుకోకుండా గోల్ మీద ఫోకస్ పెట్టడం… లా ఫైనల్ ఇయర్‌లో ఉండగా నాకు బిడ్డ పుట్టింది… తప్పదు కదా, ఇంటి పని, పిల్లల పెంపకం… ఒత్తిడి పెరుగుతోంది… దేహం కూడా అలిసిపోతోంది… రాత్రిళ్లు చదువుకునేదాన్ని… అదీ బర్డెనే అవుతోంది… నా సంకల్పమే నన్ను నడిపిస్తోంది… పిల్లల్ని స్కూల్‌లో దింపివచ్చాక, నా పనులు చేసుకునేదాన్ని… వాళ్లకు డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ‘‘నా వాదనల్ని’’ రాసుకునేదాన్ని… కొన్ని రాత్రిళ్లు అసలు నాకు నిద్రే ఉండేది కాదు… ఐనాసరే, నా గోల్ కళ్లముందు కదలాడుతుండేది… అనుభవించేవాళ్లకు తెలుస్తుంది ఈ అవస్థ…
నా శ్రమ ఫలించింది… రామ్‌గఢ్‌లో మొదటి ఫిమేల్ అడ్వొకేట్ అయ్యాను… అందరూ ఇప్పుడు హేపీ… ఒక మహిళ తన చుట్టూ బలంగా నిలబడ్డ ఆంక్షలు, వివక్షల అద్దాల్ని బద్దలు కొట్టినందుకు… ఇప్పుడు నా వయస్సు 60… నేను బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిని… చాలామంది యువతులు నన్ను ఓ స్పూర్తిగా తీసుకున్నామని చెప్పినప్పుడు ఎనలేని ఆనందం… వాళ్లకు ఓ మహిళ కష్టపడి చదివి ఏదైనా సాధించిందంటే ఆనందం… ఆ ఆనందం నేనే… నేను తీసుకున్న కేసుల్లో అధికం మహిళలవే… వాళ్ల కోసం కొట్లాడేదాన్ని… చట్టాలను చెప్పేదాన్ని.. వాళ్ల కోసం కోర్టుల్లో కొట్లాడుతుంటాను… నాకు తెలిసి… నేను సరైన పోరాటాలే చేస్తున్నాను..!!
Share this Article