….. By….. పార్ధసారధి పోట్లూరి …… ఆయుధ పోటీ అగ్ర రాజ్యాల మధ్య చిచ్చు పెట్టింది! తాజాగా ఎన్నడూ లేనిది ఫ్రాన్స్ తమ రాయబారులని వెనక్కి పిలిపించింది అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుండి! ఇది చాలా తీవ్రమయిన చర్య అనే చెప్పుకోవాలి. ఫ్రాన్స్ లాంటి దేశం అందులోనూ నాటో [North Atlantic Treaty Organization] కి మూలస్థంభం. అలాంటిది ఫ్రాన్స్ అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో దౌత్య సంబంధాలు తెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మంచిది కాదు మూడు దేశాలకి కూడా… కానీ ఫ్రాన్స్ ఇంత తీవ్రమయిన చర్య తీసుకోవడానికి కారణం ఏమిటి ? 2016 లో ఆస్ట్రేలియా తమ నేవీ కోసం 65 బిలియన్ డాలర్ల విలువ చేసే సాంప్రదాయ జలాంతర్గాములని కొనడానికి ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం చేసుకుంది. గత నాలుగేళ్లుగా ఫ్రాన్స్ ఆస్ట్రేలియాకి ఇవ్వవలిసిన జలాంతర్గాముల నిర్మాణ పనుల్లో నిమగ్నం అయ్యింది. ఒప్పందం ప్రకారం 2024 కల్లా వాటిని ఆస్ట్రేలియాకి డెలివరీ చేయాల్సి ఉంటుంది…
పసిఫిక్ మహా సముద్రం మీద చైనా ఆధిపత్యంని ఎదుర్కోవడానికి ట్రంఫ్ హయాంలో నాలుగు దేశాలతో కూడిన Quad ని ఏర్పాటు చేసింది అమెరికా… ఇందులో భారత్, ఆస్ట్రేలియా, జపాన్ లతో పాటు అమెరికా కూడా ఉంది… ఇప్పటికే పలు మార్లు నాలుగు దేశాధినేతలు సమావేశం అయి పలు ఒప్పందాలు చేసుకున్నారు. వీటిలో ముఖ్యమయినది నాలుగు దేశాలు కలిసి సముద్రంలో సంయుక్త విన్యాసాలు చేయడం, నాలుగు దేశాలకి సంబంధించి యుద్ధ నౌకలు ఎక్కడయినా ఇంధనం నింపుకోవచ్చు, అలాగే రిపేర్లు చేసుకోవచ్చు. అవసరం అయితే ఆయుధాలని ఒక దేశం నుండి ఇంకో దేశంలోకి తరలించి, నిల్వ చేయవచ్చు. ఇదంతా దక్షిణ చైనా సముద్రంలో చైనాని ఎదుర్కోవడానికే !
Ads
AUKUS-ఆస్టేలియా, బ్రిటన్, అమెరికా ఈ మూడు దేశాల మొదటి అక్షరాలతో ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసింది అమెరికా. ఇది క్వాడ్ గ్రూపు కాకుండా ఇంకో గ్రూపు అన్నమాట. జో బిడెన్, బోరిస్ జాన్సన్, స్కాట్ మోరిసన్ లు కలిసి చర్చలు చేసి తీసుకున్న నిర్ణయంతో AUKUS ఏర్పడింది. అయితే క్వాడ్ గ్రూపుకి సమాంతరంగా ఇంకో గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు ముందుగానే ఇండియాకు తెలియచేశాయి మూడు దేశాలు. AUKUS కూడా చైనాని ఎదుర్కోవడానికే ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి మూడు దేశాలు కూడా… అయితే చైనాని దీటుగా ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా దగ్గర ఆటమిక్ ఎటాక్ సబ్ మెరైన్లు లేవు కాబట్టి వెంటనే అమెరికా ఆస్ట్రేలియాకి ఆటమిక్ ఎటాక్ సబ్మెరైన్లు అమ్మడానికి పూనుకుంది. ఆస్ట్రేలియా కూడా అమెరికా నుండి అణు జలాంతర్గాములు కొనడానికి ఒప్పుకుంది. వెంటనే ఒప్పందం మీద సంతకాలు చేసేసింది ఆస్ట్రేలియా అమెరికాతో… ఫ్రాన్స్ తో 2016 లో కన్వెన్షనల్ సబ్ మెరైన్లు కొనడానికి చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇదంతా చాలా రహస్యంగా జరిగిపోయింది గత బుధవారం రోజున…
దాంతో మండిపడ్డ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుండి తమ రాయబారులని వెనక్కి రప్పించింది ప్రతీకారంగా… ఆస్ట్రేలియా తమతో చేసుకున్న ఒప్పందం ఎలాంటి ముందస్తు మాట లేకుండా ఏక పక్షంగా రద్దు చేయడాన్ని ఫ్రాన్స్ తీవ్రంగా పరిగణించింది. ఇక ముందు ఆస్ట్రేలియాతో ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందం చేసుకునేది లేదని ఫ్రాన్స్ అన్నది… ఆస్ట్రేలియా నమ్మకాన్ని పొగొట్టుకున్నది. అసలు ఈ AUKUS అనేది కేవలం అమెరికా అణు జలాంతర్గాములు అమ్ముకోవడానికి వేసిన ప్లాన్ కాకపోతే ఏమిటీ ? క్వాడ్ గ్రూపులో ఇంగ్లాండ్ తప్ప అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఏర్పాటు చేసిన AUKUS లో అదనంగా ఉన్నది ఒక్క ఇంగ్లాండ్ మాత్రమే ! అంటే క్వాడ్ గ్రూపులోకి ఇంగ్లాండ్ ని చేరిస్తే సరిపోయే దానికి AUKUS పేరుతో ఇంకో గ్రూపు పెట్టి దానిలో ఇంగ్లాండ్ ని చేర్చడం అనేది కుట్ర కాకపోతే ఇంకెమిటి ? అసలు క్వాడ్ గ్రూపులో ఆస్ట్రేలియా ఉన్నప్పుడు ఆ అణు జలాంతర్గాములు లీజుకి ఇచ్చి, వాటినే చైనా మీద వాడమని చెప్పవచ్చు లేదా అమెరికా దగ్గర ఎటాక్ అణు జలాంతర్గాములు చాలానే ఉన్నాయి కాబట్టి వాటినే పసిఫిక్ మహా సముద్రంలో మోహరించవచ్చు కదా ? అలా చేస్తే అమెరికన్ ఆయుధ పరిశ్రమ నష్టపోతుంది కాబట్టి ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న డీల్ కాన్సిల్ చేయించి, చైనాని బూచిగా చూపించి, అమెరికా ఆడుతున్న నాటకం ఇది. అసలు జో బిడెన్ అధ్యక్షుడుగా ఉన్నంత కాలం చైనాతో యుద్ధం చేస్తుందా ? బహుశా అలా జరగకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జో బిడెన్ చైనా చేతిలో కీలుబొమ్మ. చైనాని బూచిగా చూపించి ఆయుధాలు అమ్ముకోవడం తప్పితే అక్కడ యుద్ధం జరిగే దృశ్యం ఉండదు…!!
Share this Article