Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీలంక బాటలో పాకిస్తాన్… చైనా సాయం, సీపీఈసీ ఎఫెక్ట్…

May 12, 2022 by M S R

చైనా ఆర్థికసాయం అంటేనే ఓ విషకౌగిలి… నేపాల్‌కు అర్థమైంది… శ్రీలంకకు అర్థమయ్యేలోపు మునిగిపోయింది… బంగ్లాదేశ్ ముందుగానే జాగ్రత్తపడింది… ఇప్పుడు పాకిస్థాన్ చేతులు కాల్చుకుంటోంది… ఇండియా చుట్టూ అస్థిరత మంటలు చెలరేగడానికి కారణం చైనాయే… చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పాకిస్థాన్‌ను తెగ ఉద్దరించేస్తుందని మభ్యపెట్టి, ఆశపెట్టి, ఆ దేశాన్ని అప్పుల్లోకి నెట్టేసింది చైనా… ఈ కారిడార్ మీదే బెలూచిస్తాన్ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు… చైనా నిపుణులు కనిపిస్తే దాడులు చేస్తున్నారు… ఇప్పుడా సీపీఈసీ అసలు ప్రభావం స్టార్టయినట్టే కనిపిస్తోంది… మిత్రుడు పార్ధసారధి పోట్లూరి ఏమంటాడంటే..?

ఆసియాలో శ్రీలంక తరువాత పాకిస్థాన్ అదే బాటలో ఉన్నది ! తమకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ కేంద్రాలని నడపగలమని చేతులు ఎత్తేసిన చైనా సంస్థలు ! చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ లో[CPEC] భాగంగా చైనా నిర్మించిన ఇంకా నిర్మాణ దశలో ఉన్న విద్యుత్ కేంద్రాలు ప్రస్తుతం సంక్షోభ దిశగా నడుస్తున్నాయి. కోవిడ్ వల్ల దాదాపుగా అన్ని దేశాలు ఆర్ధికంగా గడ్డు పరిస్థితులని ఎదుర్కుంటున్నాయి. పాకిస్థాన్ కోవిడ్ లాక్‌డౌన్‌కి ముందు నుండి అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉంది.

తాజాగా పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వలన మాజీ ప్రధాని ఇమ్రాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది… పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితికి ఇమ్రాన్ మాత్రమే కారణం అని చూపించి సైన్యం తొలగించింది కానీ నిజానికి ఇమ్రాన్ పాత్ర ఏమీ లేదు అక్కడ ఏదన్నా చేయడానికి… తమ తప్పులని కప్పి పుచ్చుకోవడానికి సైన్యం తరుచూ ఇలా ప్రధానులని బలి పశువులని చేస్తూ ఉంటుంది.

Ads

పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ వార్తా సంస్థ డాన్ కధనం ప్రకారం చాలా కాలం నుండి పాకిస్థాన్ చైనాకి చెందిన ప్రైవేట్ విద్యుత్ సంస్థలకి చెల్లించాల్సిన డబ్బుని వాయిదా వేస్తూ వచ్చింది… దాంతో ఆయా చైనా విద్యుత్ సంస్థలు ఈ నెల లోపల పాత బకాయీలు చెల్లించకపోతే విద్యుత్ ప్లాంట్లని మూసివేయాల్సి వస్తుంది అంటూ హెచ్చరించాయి.

300 వందల బిలియన్ పాకిస్తానీ రూపాయాలని చైనాకి చెందిన దాదాపు 30 విద్యుత్ సంస్థలకి పాకిస్థాన్ ప్రభుత్వం బాకీ పడ్డది. గత కొంత కాలంగా తమ బాకీలు తీర్చమని సదరు విద్యుత్ సంస్థలు పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నా వాయిదాలు వేస్తూ వచ్చింది పాక్ ప్రభుత్వం. దాంతో గతి లేని స్థితిలో ఇక తాము విద్యుత్ కేంద్రాలని నడపలేమని ఈ నెలాఖరులోగా బకాయీలు చెల్లించకపోతే అన్ని విద్యుత్ కేంద్రాలని మూసివేయడం జరుగుతుంది అంటూ చివరి నోటీస్ ఇచ్చాయి చైనా విద్యుత్ సంస్థలు… ప్రస్తుతం CPEC ప్రాజెక్ట్ కింద థర్మల్, హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులు చైనాకి చెందిన ప్రైవేట్ సంస్థలు నిర్మించి ఆపరేట్ చేస్తున్నాయి.

మరో వైపు పాత బకాయీలు చెల్లించకుండా పాకిస్థాన్ అధికారులు విద్యుత్ ఉత్పాదన పెంచమని తమ మీద ఒత్తిడి తెస్తున్నారు అంటూ చైనా విద్యుత్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. తమకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పాదన పెంచమనడం ఒప్పందానికి విరుద్ధం అని వాదిస్తున్నాయి. ఇప్పటికే తమకి కాష్ లిక్విడిటి సమస్య ఏర్పడింది అని, తాము చైనా బాంకుల నుండి అప్పు తీసుకొని పాకిస్థాన్ లో విద్యుత్ కేంద్రాలు నిర్మించి ఆపరేట్ చేస్తున్నామనీ, కానీ పాకిస్థాన్ ప్రభుత్వం తమకి చెల్లింపులు జరపకుండా ఉండడం చేత చైనా బాంకులు తమ మీద ఒత్తిడి తెస్తున్నాయని వాపోతున్నాయి విద్యుత్ సంస్థలు.

మరోవైపు బొగ్గు దిగుమతి ధరలు ఇప్పటికే మూడు రెట్లు పెరిగిపోవడం వలన, తమ చేతిలో డబ్బు లేకపోవడం వలన బొగ్గు కొనలేకపోతున్నామని.., పాత బకాయీలు తీరిస్తేనే కానీ చైనా బాంకులు కొత్త అప్పు ఇవ్వడానికి సిద్ధంగా లేని పరిస్థితుల్లో… పాక్ ప్రభుత్వం తమ బకాయీలు తీర్చకుండా వేసవి డిమాండ్ ని తట్టుకోవడానికి విద్యుత్ ఉత్పాదన పెంచమని ఆడగడం దారుణం అంటున్నాయి… CPEC కింద విద్యుత్, రహదారులు, కమ్యూనికేషన్ రంగాలలో చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి కానీ వాటికి తిరిగి చెల్లింపులలో తీవ్ర జాప్యం జరుగుతూ రావడం చైనా కొత్త అప్పులు ఇస్తూ రావడం జరుగుతున్న నేపధ్యంలో ఇక చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఈ విషయంలో శ్రీలంకలో లాగా కలుగచేసుకోవడానికి ఇష్టపడట్లేదు.. దాంతో చైనా సంస్థలు నేరుగా పాక్ ప్రభుత్వానితో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ప్రస్తుతం CPEC కింద నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టుల వద్ద కేవలం రెండు రోజులకి సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నట్లు డాన్ వార్తా సంస్థ తెలిపింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions