.
సహజమే… అక్కినేని ఇంటికి కోడలిగా రాబోతున్నదంటే ఆమె ఎవరూ అనే సెర్చింగ్ సహజమే… తన కొడుకు అఖిల్‌తో జైనాబ్ రవ్జీకి (Zainab Ravdjee) ఎంగేజ్మెంట్ అయ్యిందని చెప్పాడు నాగార్జున…
అఖల్ కూడా రెండు మూడు ఫోటోలు ట్వీటాడు… ఆమె ఎవరు అనే వివరాలు నెట్‌లో కూడా పెద్దగా ఉండవు… తెలిసిన సమాచారం మేరకు ఆమె హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది…
Ads
నెట్‌లో ఆమె పేరుతో ఒక ప్రొఫైల్ ఉంటుంది… ఆమె అప్పుడెప్పుడో మీనాక్షి అనే సినిమా చేసింది… అదొక్కటే సినిమా… ఇక ఏ వివరాలూ ఉండవు… కానీ 2004లో సినిమా అంటే ఇప్పటికి 35 ఏళ్లపైనే కదా… కానీ ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనాబ్ బహుశా వేరే అమ్మాయి కావచ్చు… (అఖిల్ వయస్సు 30… Ofcourse తనకంటే ఎక్కువ వయస్సు ఉండకూడదని ఏమీ లేదు…)
కానీ కొన్ని వార్తల మేరకు అఖిల్ చేసుకోబోయే అమ్మాయి ఆర్టిస్టు… ఆమె తండ్రి జుల్ఫీ కూడా ఆర్టిస్ట్ కం బిజినెస్ మాన్… గతంలో ఈ ఫ్యామిలీకి ఓడియన్ థియేటర్ ఉండేది… హైదరాబాదులో కూడా గతంలో రిఫ్లెక్షన్స్ పేరిట కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో అప్పట్లో ఆమె ఓ పెయింట్ ఎగ్జిబిషన్ కూడా పెట్టింది… ఎక్కువగా మోడరన్, అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్స్ వేస్తుందని సమాచారం… ప్రియాంక గాంధీకి తన పొర్ట్రెయిట్ చిత్రించి బహూకరించినట్టు ఓ వార్త…
https://x.com/iamnagarjuna/status/1861374206338048318
ప్రస్తుతం ముంబైలో ఉంటుంది… చాలా లోప్రొఫైల్… ఎక్కువగా దుబాయ్, లండన్, ఇండియాల మధ్య సంచారం… అఖిల్‌తో ఎలా పరిచయమనేదీ గోప్యమే… తన గరల్ ఫ్రెండే… అప్పట్లో అంటే 2016లో ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనమరాలు శ్రియా భోపాల్‌తో నిశ్చితార్థం జరిగాక, పెళ్లి గాకముందే బ్రేకప్…
ఆ తరువాత ఈమె పరిచయం అయినట్టుంది… ఆరేళ్లుగా ఇద్దరి మధ్య ప్రణయం అట…ఇంతకుమించి ఆమె వివరాలు ఎవరికీ తెలియవు… అక్కినేని కుటుంబం కూడా ఆమె వివరాల వెల్లడికి విముఖంగా ఉన్నట్టుంది… (బహుశా ఆర్ట్ గ్యాలరీలతో పరిచయం ఉన్నవాళ్లకు ఆమె గురించి తెలిసి ఉంటుంది…)
అఖిల్ విషయానికి వస్తే, ఇండస్ట్రీలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా సరే, ఇప్పటికీ తన కెరీర్ గాడిలో లేదు… తను అమెరికాలో పుట్టాడు, ఇప్పటికీ అమెరికన్ పౌరసత్వమే తనది…
అఖిల్ సోదరుడు నాగచైతన్యకు మొదటి వివాహం సమంతతో… ఆమధ్య విడిపోయారు… రీసెంటుగా ధూళిపాళ శోబిత అనే సటితో తనకు ఎంగేజ్మెంట్ అయ్యింది, వచ్చే నెల నాలుగున పెళ్లి… ఈలోపు ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’కూ నిశ్చితార్థం జరిగిపోయిందని అక్కినేని కుటుంబం ప్రకటించింది…
అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్టుంది… అందుకే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు… కాబోయే భార్య లోప్రొఫైల్… అఖిల్ కూడా పెద్దగా వార్తల తెర మీదకు రాడు… సోషల్ మీడియాలో కూడా పెద్ద యాక్టివ్‌గా ఉండడు… అందుకే ఏ సినిమా మీడియా కూడా వాళ్ల ప్రేమ వ్యవహారాన్ని పట్టుకోలేకపోయింది…
ఒక మీడియా సంస్థ సమాచారం ఇది…
మరి నాగార్జున రేంజ్ కు తగిన మ్యాచ్ కదా…
Share this Article