ప్రపంచంలో ఏం జరిగినా అమెరికాను నిందించడమే వామపక్షం పని… అదేదో కమ్యూనిజం మీద చైనాకు మాత్రమే గుత్తాధిపత్య హక్కులు ఉన్నట్టుగా, చైనా ఏం చేసినా వెనకేసుకుని రావడం… ఇప్పుడూ అంతే శ్రీలంక మునిగిపోవడానికి, భ్రష్టుపట్టిపోవడానికి చైనాయే కారణమని రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉంటే… నో, నో, అమెరికాయే కారణం, మా చైనా శుద్దపూస, దాన్ని ఏమైనా ఉంటే బాగుండదు సుమా అన్నట్టుగా మన లెఫ్ట్ మేధావులు, పత్రికలు తెగ రాసేస్తున్నాయి… అయ్యో, అయ్యో, మా చైనా మీద ఈగ వాలుతున్నదే అని తెగ బాధపడిపోతున్నాయి…
ప్రజాశక్తి సీపీఎం పత్రికే కదా… సీపీఎం అంటే చైనా పెంచి పోషించే పార్టీయే కదా… అందుకని తనూ ఫాఫం, చైనా తప్పేమీ లేదు అని చెప్పడానికి నానాపాట్లూ పడుతోంది… ఈరోజు పబ్లిష్ చేసిన ‘శ్రీలంక సంక్షోభం వెనుక…’ అనే ఓ ఎడిటోరియల్ వ్యాసం అదే… రకరకాల అంకెలు పేర్చి, మొత్తానికి శ్రీలంక సంక్షోభానికి కారణం అమెరికాయే… కాదు, కాదు, అమెరికన్లే అని తేల్చేశారు… అమెరికన్లు ఏం పాపం చేశారయ్యా అంటే…
Ads
శ్రీలంక అధికశాతం రుణాలు తీసుకున్న ఆర్థికసంస్థలు, ప్రపంచబ్యాంకు అమెరికావే కాబట్టి… వాటిల్లో మదుపు చేసింది అమెరికన్లే కాబట్టి… అసలు శ్రీలంక సంక్షోభానికి సగటు అమెరికన్ కారణమైపోయాడు అన్నమాట… ఇదేం వితండవాదం అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు… లెఫ్ట్ ధోరణి అంతే…
చైనాలో గ్లోబల్ టైమ్స్ వంటి సర్కారీ మీడియా యాక్టివ్‌గా ఉంటుంది… చైనా మీద ఈగ, దోమ ఏది వాలినా ఊరుకోదు… ప్రస్తుతం ఆ మీడియా సంస్థలకన్నా ఇండియాలోని లెఫ్ట్ ఓరియెంటెడ్ మీడియా ఈవిషయంలో చాలా యాక్టివ్… చైనా తోపు, చైనా సూపర్, చైనా తప్పుచేయదు, చైనా ఏం చేసినా ఈ ప్రపంచం కోసమే, చైనాను ఎవరైనా ఏమైనా అంటే పుట్టగతులుండవు, చైనాయే సుప్రీం… ఈ ఫీలింగుల్లో ఉండిపోతారు వీళ్లంతా… అదే వల్లెవేస్తారు… అదే జనాన్ని కూడా నమ్మేయాలంటారు…
చివరకు అప్పులిచ్చి చైనా హంబంతోట పోర్టును హస్తగతం చేసుకోవడాన్ని కూడా సమర్థించింది… సగం వ్యాసానికి అదేదో అట్లాంటిక్ పత్రికలో వచ్చిన వివరాలు నిదర్శనమట… చైనాకు వ్యతిరేకంగా బయటికి వచ్చే వివరాలన్నీ అమెరికన్, పాశ్చాత్య మీడియా కుట్ర అట… సదరు వ్యాసం నిండా అంకెలే కనిపిస్తున్నాయి… వామపక్ష శ్రేణులకైనా అది అర్థం అవుతుందో లేదో తెలియదు… మరి ఇలాంటి వ్యాసకథనాలతో ఒరిగేది ఏముంటుంది..? ఎవరు చదువుతారు అంటారా..? విధేయత… చైనా అధికార పార్టీ పట్ల, చైనా ప్రభుత్వం పట్ల విధేయత… అంతే..!!
Share this Article