ఏప్రిల్‌లో కావచ్చు బహుశా… జీవిత, రాజశేఖర్‌లపై 26 కోట్ల మోసం, ఒకే ఆస్తిని ఇద్దరికి అమ్మారనే ఆరోపణ, చెక్‌బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ అని వార్తలు వచ్చాయి… 2014లో కూడా ఓ చెక్‌బౌన్స్ కేసు… బతుకుజట్కా బండి టీవీ ప్రోగ్రాంకు సంబంధించి ఇంకేదో కేసు… జీవితకు వివాదాలు కొత్తేమీ కాదు… తాజాగా వైశ్యసమాజం ఆమెపై గుర్రుమంటోంది… హైదరాబాద్, చైతన్యపురి పోలీస్ట స్టేషన్‌లో వైశ్యసంఘాల ప్రతినిధులు ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు…
ఏదో టీవీ షోలో మాట్లాడుతూ ఆమె నోరుజారింది… ‘‘కోమటిదానిలెక్క’’ అని వ్యాఖ్యానించింది… అనకుండా ఉండాల్సింది… పరుషమైన వ్యాఖ్యే… దీంతో కులం పేరుతో అసభ్యంగా మాట్లాడినందుకు ఆమె మీద చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు దాఖలైంది…
Ads
తమ సంఘాలు కోపంగా ఉన్నాయని ఆమెకు సన్నిహితుడైన ఇంకెవరో వెంటనే ఆమెకు చెప్పినట్టున్నారు… వెంటనే ఆమె ఇంకెక్కడో మాట్లాడుతూ దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది… ‘‘కించపరచాలని, డౌన్ చేయాలని కాదు… ఏదో చిన్నప్పటి నుంచీ విన్న మాటను అనుకోకుండా ఫ్లోలో అనేశాను… నా మాటల వెనుక దురుద్దేశం కూడా ఏమీలేదు…’’ అని చెప్పింది…
ఒక నానుడిని చెప్పాను తప్ప, పైసాకు వైశ్యులు విలువ ఎలా ఇస్తారో చెప్పడానికి ప్రయత్నించాను తప్ప వాళ్లను డౌన్ చేయాలని కాదు, వాళ్లలోని ఒక గొప్ప క్వాలిటీని చెప్పాను అని వివరణ ఇచ్చుకుంది… సారీ చెప్పింది… ఎవరో యూట్యూబర్ ఏదో వాగించడానికి ప్రయత్నిస్తాడు, సెలబ్రిటీలు నాలుక మీద నియంత్రణ కోల్పోకుండా మాట్లాడాలి అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ…
Share this Article