మధ్యాహ్నభోజనం వేళ మాటీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది ఆ దిక్కుమాలిన సీరియల్… పేరు ‘మనసిచ్చి చూడు’… టీవీ మోగుతూనే ఉంటుంది కాబట్టి కళ్లల్లో ఒకటీరెండు సీన్లు లేదా డైలాగ్స్ బారిన పడక తప్పడం లేదు… మన కళ్లుపాడుగాను… హఠాత్తుగా ఓ పాత్ర వేసుకున్న డ్రెస్సు చాలా అసహజంగా ఉన్నట్టు కనిపించింది… మళ్లీ ఓసారి చూస్తే, కళ్లు నులుముకుని చూస్తే కూడా సేమ్… మొత్తం పిక్చర్ క్లియరే… కానీ కాస్త గులాబీ, కాస్త కాషాయం కలిగిసినట్టున్న ఆ డ్రెస్సు ఎలా అసహజంగా ఉందంటే…
పర్టిక్యులర్‌గా ఆ డ్రెస్సున్న భాగాన్నే ఎవరో బ్లర్ చేసినట్టు… కావాలనే మాస్క్ వేసినట్టు అనిపించింది… డ్రెస్సుకు ఏవో రంధ్రాలున్నట్టుగా కూడా ఓ భ్రమ… ఈలోపు ఇంకేదో సీన్ వచ్చింది, ఈ పాత్ర మాయమైపోయింది… ఇదీ సగటు తెలుగు సీరియల్‌లాగే అత్యంత పరమ చెత్త కేటగిరీ… ప్యూర్ మూసీ స్టాండర్డ్… ఐననూ తెల్లారి మళ్లీ చూడబడాల్సి వచ్చింది… కాస్త పరిశీలనగా చూస్తే, చూస్తే వెలిగింది… కావాలనే డ్రెస్సును కనిపించకుండా ఎడిటర్ ఎవరో నానా తిప్పలూ పడ్డాడు అని… కానీ ఎందుకలా..?
కానీ అక్కడక్కడా ఎడిటర్ ఫెయిలయ్యాడు, దొరికిపోయాడు… అది హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర… ఆమె వేసుకున్న డ్రెస్సు నిండా బుద్ధుడి మొహాలు గీసి ఉన్నాయి… జస్ట్, నల్లటి గీతలతో మొహాలు పెయింట్ చేసి ఉన్నాయి… అదుగో, అవి కనిపించకుండా సదరు ఎడిటర్ ఎవరో నానాతంటాలూ పడ్డాడు… ఎలాగైనా అవి కనిపించకూడదు అని…
Ads
నిజానికి డ్రెస్సు మీద బుద్ధుడి మొహాలు ఉంటే తప్పేమీ లేదు, అదేమీ బుద్ధుడిని అవమానించినట్టు కూడా కాదు… కొందరు ఓం బొమ్మ ఉన్నవి, మరికొందరు త్రిశూలం ముద్రించినవి, ఇంకొందరు క్రాస్ గుర్తులు ఉన్నవి కూడా ధరిస్తారు… అందులో అభిమానమే ఉంటుంది తప్ప అవమానం ఉండదు… కానీ ఆ సీరియల్ నిర్మాతకో, దర్శకుడికో లేక దీన్ని ప్రసారం చేయించే చానెల్ బాధ్యులకో… షూటింగ్, వాయిస్ ఓవర్, ఎడిటింగ్ గట్రా పూర్తయ్యాక… చివరలో ప్రసారానికి ముందు డౌట్ వచ్చినట్టుంది…
ఎవరైనా దీన్ని ఇష్యూ చేస్తారేమో అనుకున్నట్టున్నారు… అందుకే ప్రసారానికి ముందే చకచకా బుద్ధుడి బొమ్మలు కనిపించకుండా ఇలా తిప్పలు పడ్డారు… పోనీ, ఒకవేళ మనసులో ఆ డౌట్ ఉంటే… అసలే ఇది మనోభావాలు దెబ్బతినే సీజన్ కాబట్టి ఇబ్బంది క్రియేట్ అవుతుందేమో అని ఫీలయితే… షూటింగ్ సమయంలోనే డౌట్ ఎందుకు రాలేదు..? కాస్ట్యూమర్, కెమెరామన్, డైరెక్టర్, సదరు యాక్ట్రెస్, సెట్లో స్టాఫ్, తోటి నటులు ఎవరికీ అవాయిడ్ చేస్తే బెటర్ అనిపించలేదా..? ఒక డ్రెస్, ఒక సీన్, ఒక డైలాగ్… ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాలిగా… ఏదో మనం తీసేస్తున్నాం, పిచ్చి ప్రేక్షకులు చూసేస్తున్నారు అనే ధోరణిలో ఉంటారు కాబట్టి అలా మొదట్లో కేర్‌లెస్‌గా వదిలేశారా..?!
Share this Article