ఆమధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ను కలిశాడు… బేసిక్‌గా ఉండవల్లి తెలంగాణ వ్యతిరేకి… జాతీయ రాజకీయ పార్టీ స్థాపన కోసం ఉండవల్లి సలహాల కోసం కేసీయార్ ఆయన్ని రమ్మన్నాడు… జాతీయ రాజకీయాలకూ ఉండవల్లికీ లింకేమిటో, ఉండవల్లి అనుభవమేమిటో మనకు తెలియదు… కానీ ఉండవల్లి ఆ భేటీ తరువాత మస్తు మెచ్చుకున్నాడు… అసలు కేసీయార్ దేశానికి నాయకత్వం వహించే కెపాసిటీ ఉన్నవాడు అని ప్రశంసించాడు… సీన్ కట్ చేయండి…
ఉండవల్లి గానీ, అప్పట్లో కేసీయార్ వెంట నీడలా తిరిగిన ప్రకాష్‌రాజ్ అనబడే లౌకిక ప్రముఖుడు గానీ, కేసీయార్ దోస్త్ ప్రశాంత్ కిషోర్ గానీ మళ్లీ కేసీయార్ వెంట కనిపించలేదు… ప్రశాంత్ ఎప్పటి నుంచి కేసీయార్ దోస్త్ అయ్యాడో మాత్రం ఎవరూ అడక్కండి ప్లీజ్… వాళ్లూ వీళ్లూ కాదు, అసలు ప్రతిపాదిత జాతీయ రాజకీయాలు, జాతీయ పార్టీ అనేవే వెనక్కి వెళ్లిపోయాయి… ఇప్పుడంతా మునుగోడు… అసలు ఇవికాదు, అదే ఉండవల్లి కేసీయార్‌కు పరోక్షంగా ఓ చురక వేస్తున్నాడు…
మోడీతో ఫైట్ చేస్తానంటున్నావ్, రామోజీరావుకు భయపడటం దేనికి అనడుగుతున్నాడు… అదేసమయంలో జగన్ కరెక్టు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు అని అభినందిస్తున్నాడు… ఇప్పటికైనా కేసీయార్ స్పందించి రామోజీరావు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఉండవల్లి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడు… విషయం ఏమిటంటే..? మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు…
Ads
అప్పుడెప్పుడో 2006లో కావచ్చు బహుశా… రామోజీ అర్థికమూలాల్ని దెబ్బకొట్టడానికి వైఎస్ ఉండవల్లిని ప్రయోగించాడు… ఇప్పుడు ఆ వైఎస్ లేడు, జగన్‌కు ఆ కేసులపై ఆసక్తి లేదు… రామోజీతో పోరాటం పట్ల సీరియస్ దృష్టి లేదు… ఐనాసరే, ఉండవల్లి ఆ కేసులో కొట్లాడుతూనే ఉన్నాడు… ‘‘ఒకవైపు రెండు రాష్ట్రాల హైకోర్టులు విడిపోతుంటే హడావుడిగా రామోజీరావు కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది… కనీసం ఏపీ ప్రభుత్వానికి నోటీస్ కూడా ఇవ్వలేదు…
అవిభక్త హిందూ కుటుంబం (హెచ్‌యూఎఫ్) డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్వయంగా చెబుతోంది… మార్గదర్శి చిట్స్ వాళ్లు నామీద పరువునష్టం దావా వేశారు, వాళ్లే ఇంకోవైపు అది రామోజీదే అని కోర్టుల్లో అఫిడవిట్లు ఇస్తుంటారు… ఈ నేపథ్యంలో సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషిన్ వేశాం… లోకస్ స్టాండీ పేరిట కొట్టేయబోతున్నారని డౌటొచ్చింది… రెండేళ్లుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను అడుగుతూనే ఉన్నాను… చివరకు జగన్ ఓ నిర్ణయం తీసుకుని ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు… హమ్మయ్య, కేసు నిలబడింది… మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు నిర్ణయం తీసుకోదు..?’’……… ఇదీ ఉండవల్లి వాదన… (కేసు వచ్చే నెలకు వాయిదా పడింది… రసకందాయంలో పడింది)…
పదహారేళ్లుగా సాగుతున్న కేసు… అప్పట్లో ఏ ఉద్దేశం కోసం ఈ ఇష్యూను ఉండవల్లి తలకెత్తుకున్నాడనేది వదిలేస్తే… ఇప్పుడు తనకు 68 ఏళ్లు, ఇంకా లీగల్‌గా కొట్లాడుతూనే ఉన్నాడు… 1) మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు రామోజీకి సంబంధం లేదని డిఫేమేషన్ సూట్‌లో చెబుతారు… మరోవైపు అది కూడా నాదే అని రామోజీయే కోర్టుకు అఫిడవిట్ ఇచ్చాడు, ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమే… 2) ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం హెచ్‌యూఎఫ్ డిపాజిట్లను తీసుకోకూడదు… ఈ రెండు కేసుల్లో కొట్లాడుతూనే ఉంటాను అంటున్నాడు ఉండవల్లి… ఆసక్తికరమైన కేసే…!!
జగన్‌కు అసలైన ప్రత్యర్థి ఈనాడు కాదు… సాక్షే…!!
ఇది అప్పట్లో వైఎస్‌కు ఇష్టమైన కేసు కదా… లక్షాతొంభయ్యారు పథకాలకు వైఎస్ పేరు పెట్టి నడిపించే ప్రభుత్వమే కదా ఇప్పుడు… ఆ వైఎస్ కొడుకే కదా సీఎం… ఇప్పటికీ ఈనాడు వైఎస్ కుటుంబ వ్యతిరేకియే కదా… అప్పుడప్పుడూ జగన్ కూడా దుష్టచతుష్టయం అని తిట్టిపోస్తుంటాడు కదా, తన ప్రత్యర్థులు ఈ మీడియా సంస్థలే అంటుంటాడు కదా… మరి ఈ ఇంపార్టెంట్ కేసులో, తనే ఇంప్లీడ్ అయ్యాడు కదా… కానీ సాక్షి ఏం రాసింది..? పాఠకులు ఎక్కడ చదువుతారో అనే భయసందేహాలతో ఓ చిన్న సింగిల్ కాలమ్ వార్తను కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్టుగా రాసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది… జగన్‌కు ప్రత్యర్థులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కాదు… సాక్షి… సాక్షే…!! సాక్షి పెద్ద తలకాయలు ఒక్కసారి ఈరోజు ఈనాడు ఫస్ట్ పేజీ, లోపల ఫుల్ పేజీ లేపాక్షి భూములపై రాసిన స్టోరీ చదవాలి… నాలుగుసార్లు చదివినా ఆ కథనం అర్థం కావడంలేదు… పరమ పేలవమైన శైలి… 90 శాతం పాత విషయాలే… ఒకటే రెండు కొత్త పాయింట్లు… అదీ గత మే నెలలో జరిగిందే… పైగా అది NCLT నేతృత్వంలో సాగే లీగల్ వ్యవహారం… ఐనా సరే, జగన్ వందలు, వేల కోట్లను తినేస్తున్నాడు అనే కలరింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చారు…! మార్గదర్శి కేసు మొదటికి వచ్చిందనే ఆక్రోశంతో రాసినట్టుంది..!!
Share this Article