కొన్నిసార్లు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాటతీరు చూస్తే విస్మయం కలుగుతుంది… కడుపులో ఉన్నది ఏదైనా సందర్భం చూసుకుని మొత్తం కక్కేస్తాడు… ఎదుటోడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు, దానికి రియాక్షన్ ఏమిటనేది అస్సలు పట్టించుకోడు… ఇదీ అంతే… నమస్తే తెలంగాణ పత్రిక మీద తను చేసిన వ్యాఖ్యల్ని ఎలా ఖండించాలో, అసలు ఖండించాలో లేదో తెలియని అయోమయావస్థలోకి నెట్టేశాడు ఆ పత్రికను… నిజంగా ఆ పత్రిక స్పందన చూడాలని ఉంది రేపు పత్రికలో…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీయార్ బిడ్డ కవిత ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో… ప్రతిపక్షాలు నిరాధారంగా తన పేరును బదనాం చేస్తున్న తీరు మీద ఆమె కోర్టుకు కూడా వెళ్లింది… ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆమెతో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించాడు… అప్పుడప్పుడూ కేసీయార్, రాధాకృష్ణ ఒకరి మీద ఒకరు అలుగుతారు… మళ్లీ కలిసిపోతుంటారు… టెంపరరీగా డిష్యూం డిష్యూం…
ఈమధ్య కేసీయార్ మీద రాధాకృష్ణ ప్రేమగా లేడు… ఐనా కేసీయార్ కుటుంబంతో రాధాకృష్ణకు మంచి సాన్నిహిత్యమే ఉంది… రాధాకృష్ణను అంకుల్ అని పిలుస్తూ కవిత గానీ, కేటీయార్ గానీ అభిమానంతోనే ఉంటారు… సుదీర్ఘంగా సాగిన ఆ ఇంటర్వ్యూ అంశాల జోలికి, ఆర్కేకు కవిత చెప్పిన జర్నలిజం పాఠాల జోలికి ఇక్కడ వెళ్లడం లేదు గానీ… నమస్తే తెలంగాణ పత్రిక ప్రస్తావన వచ్చినప్పుడు ఇద్దరి నడుమ కాస్త ఆసక్తికరంగా సంభాషణ సాగింది… ఆ పత్రికను రాధాకృష్ణ ‘మక్కీచూజ్’ తరహాలో తీసిపడేశాడు… అఫ్‌కోర్స్, రాధాకృష్ణ ఒక్క ఈనాడును తప్ప ప్రపంచంలోని ప్రతి పత్రికను, ప్రతి టీవీని తిట్టగలడు, అది వేరే సంగతి…
Ads
ఫాఫం, కవిత గట్టిగా సమర్థించుకోలేక, అలాగని ఊరుకోలేక ఇబ్బందిపడి, చివరకు వదిలేసింది… సేమ్, రేపు నమస్తేకు కూడా అదే స్థితి… అదేమో తమ బాస్ బిడ్డ కవితతో జరిగిన ఇంటర్వ్యూ… అందులోని అంశాలను తీవ్రాతితీవ్రంగా ఖండించలేరు… అలాగని ఊరుకోలేరు… గతంలో చాలాసార్లు ఆంధ్రజ్యోతిలో వచ్చిన నెగెటివ్ స్టోరీలను నమస్తే ఖండించేది, సుదీర్ఘ వివరణలు పబ్లిష్ చేసేది… అప్పుడప్పుడూ ఆంధ్రజ్యోతి కూడా స్పందించేది… కాకపోతే సాక్షితో జరిగే కీచులాటలతో పోలిస్తే నమస్తే, ఆంధ్రజ్యోతివి ఉత్తుత్తి చిల్లర గొడవలే… సాక్షితో ఆంధ్రజ్యోతికి పుట్టుమచ్చల పంచాయితీలు కదా… అనగా కులాలు, పార్టీలు, పుట్టుకలు ఎట్సెట్రా…
ఏవో వార్తలకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు… ఇంకా రాయాలి కదా అనడిగింది కవిత… పాజిటివ్ కవరేజీ గురించి… మరీ నమస్తే తెలంగాణలా నేనే రాసుకుని, నేనే చదువుకోలేను కదా అని రియాక్టయ్యాడు ఆర్కే… నో, నో, నమస్తే ఇప్పుడు మీకు ఫుల్ కాంపిటీషన్ అని బదులిచ్చింది కవిత (నవ్వుతూ)… ఇప్పుడు పెద్ద పేపర్ అది, ఆంధ్రజ్యోతిని మించిపోయింది సర్క్యులేషన్‌లో అని పొడిగించింది…
ఎక్కడుంది సర్క్యులేషన్? కేసీయార్ ఇంట్లోనా..? దాన్నసలు కేసీయారే చదవడు, పుట్టింటి గొప్పతనం మేనమామ దగ్గర చెబితే ఎలా..? అని రిటార్ట్ వేశాడు ఆర్కే… ఇక కవిత దాంతో ఆ సబ్జెక్టు వదిలేసింది… నిజమే, నమస్తే మీద చర్చ అక్కడ అసందర్భం, పైగా ఇంకా పొడిగిస్తే RK చాలా సెటైర్లు వేస్తూ మరింత చికాకు పెట్టగలడు… నిజంగా నమస్తే దీనిమీద రేప్పొద్దున తన పత్రికలో ఏమైనా రియాక్టయ్యే చాన్స్ ఉందా..?!
Share this Article