Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రైతు పోరాటాల సరికొత్త కాగడా కేసీయార్ సార్… మరి వీళ్ల గోస మాటేంటి..?

August 28, 2022 by M S R

వైఎస్ మరణానంతరం కేసీయార్ వేసిన ప్రతి అడుగూ సక్సెస్ అయ్యింది ఇన్నాళ్లు కాబట్టి, తన ఆలోచనల్లో అద్భుతమైన చాణక్యం ఉందని అనుకుంటున్నాం… కానీ నిజమేనా..? నిజమో, అబద్ధమో… సక్సెస్ అనేది మనం చేసిందే రైట్ అనిపించేలా చేస్తుంది… ఎందుకు చెప్పుకోవడం అంటే..? జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర అని గత లోకసభ ఎన్నికల ముందు నుంచీ చెబుతున్నాడు… ఈరోజుకూ ఊదు కాలలేదు, పీరు లేవలేదు…

అన్ని భాషల పత్రికల్లో ఫస్ట్ పేజీ జాకెట్ యాడ్స్ ఇస్తే చాలు, మస్తు పాపులారిటీ వస్తుందనే భ్రమలాగే… కేసీయార్ జాతీయ రైతుసంఘాల ఐక్యవేదిక ఏర్పాటు ఆలోచన కూడా అలాగే ఉంది… ఇక్కడున్నవాళ్లకు పరామర్శలు దిక్కుండదు, కానీ పంజాబ్‌లో పరిహారాలు ఇచ్చి వచ్చాడు… రాకేష్ టికాయత్ తోడుగా ఢిల్లీలో రైతుదీక్ష పెడితే ఒక్క రైతు సంఘం ప్రతినిధి రాలేదు, ఒక్క పార్టీ రాలేదు… ఇప్పుడు పలు రాష్ట్రాల నుంచి పోలోమని వచ్చేశారు కొందరు… వాళ్లందరూ జాతీయ రైతుసంఘాల ప్రతినిధులట… నమస్తే తెలంగాణ రాసింది…

ప్రభుత్వమే విమానాల్లో తెచ్చి, అన్నిరకాల ఏర్పాట్లు చేసి, అన్నీ చూపించాక… ఈ ప్రభుత్వం ఆహా అన్నారు, ఓహో అన్నారు, నువ్వు తప్ప ఈ దేశరైతుకు వేరే దిక్కులేదు అని కేసీయార్‌ను పొడిగారు, దండలేశారు, సేమ్, పత్రికల్లో ఇచ్చుకునే జాకెట్ యాడ్స్‌లాగే అనిపించింది… దీంతో వచ్చేదేముంది..? కానీ తలపెట్టింది కేసీయార్ కాబట్టి, దాని వెనుక అంతుచిక్కని రాజకీయ మర్మం ఉంటుంది అనుకోవాలి, అంతేనా..?

Ads

రైతుసంఘాల ఢిల్లీ ముట్టడి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ కమిటీని వేస్తే, వాళ్లు అనేక సంఘాలతో మాట్లాడారు, కేంద్రం ఆమధ్య తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు సరైనవే అన్నాయి మెజారిటీ సంఘాలు… ఖలిస్థానీ అనుకూల శక్తులు, కేజ్రీవాల్ సహకారం కలిసి ఢిల్లీ ముట్టడి క్రమేపీ బర్నింగ్ ఇష్యూ అయిపోయి, ఆ చట్టాల మీద నిష్పాక్షిక చర్చ జరగకుండా పోయింది… కేవలం పంజాబ్ రైతులకు మాత్రమే ఆ చట్టాలు నష్టదాయకమా..? పోనీ, వాటి మీద నిలబడి ఉన్నాడా మోడీ..? లేడు… ప్రజలకు క్షమాపణ చెప్పి, ఆ చట్టాల్ని రద్దు చేశాడు… బహుశా ఇలా వందల మెట్లు దిగిపోయి, ఏ ప్రధానీ ఇలా చేయలేదేమో ఫాఫం…

యోగేంద్ర యాదవ్‌లు, రాకేష్ టికాయిట్ తదితరులు కేవలం యాంటీ-మోడీ, యాంటీ-బీజేపీ కోణంలో రైతు ఆందోళనల్లో పెట్రోల్ పోస్తూ వెళ్లారు… ఇదే రాకేష్ హైదరాబాద్ వచ్చి, కేసీయార్‌ను రకరకాలుగా ఆక్షేపించి వెళ్లాడు… తరువాత ఇదే కేసీయార్‌తో వేదిక పంచుకుని, నువ్వు తోపువు అని అలుముకున్నాడు… దీన్నెలా అర్థం చేసుకోవాలి..? అరేంజ్డ్ రైతుసంఘాల ప్రతినిధుల రాకతో ఫాయిదా ఏమిటి..? కేసీయార్‌ను జాతీయ రాజకీయాల్లోకి బులెట్ ట్రెయిన్‌లో తీసుకెళ్తాయా అవి..? గత ఎన్నికల్లోనే కొన్ని రాష్ట్రాల్లో యాంటీ మోడీ, యాంటీ బీజేపీ పార్టీలకు కేసీయార్ డబ్బు సాయం చేశాడనీ, చంద్రబాబు కూడా అదే పనిచేశాడని మోడీ భావిస్తున్నాడు…

చంద్రబాబుకు ప్రజలే శాస్తి చేశారు, కిక్కుమనడం లేదు… డబ్బు బాగా పోగుబడిన కేసీయార్ వచ్చే ఎన్నికల్లో కూడా తమకు నష్టం చేకూరుస్తాడు అని మోడీషా భావన… అందుకే కేసీయార్ టార్గెట్ అయ్యాడు… ఈ స్థితిలో జాతీయ పార్టీల మద్దతుతో యాంటీ బీజేపీ వైఖరి తీసుకోవల్సి ఉండగా, అప్పుడే యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ పాలసీ అంటాడు… అప్పుడే మోడీని తిట్టిపోస్తుంటాడు… భావసారూప్యం ఉన్న పార్టీలతో సంప్రదింపులు గట్రా లేకుండా ఈ రైతుసంఘాల సన్మానాలతో ఒరిగేదేమిటి..?

ఈమాట అనుకోవడానికి ఓ కారణం ఉంది… దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టిన కాలేశ్వరం ఉపయోగం ఇప్పటికీ ఓ అంతుచిక్కని మర్మం… మొన్నటి వర్షాలకు పంపు హౌజులు మునిగిపోయి, బాహుబలి మోటార్లు కాలిపోయాయి… దాని గురించి ఈరోజుకూ ఏ ఆలోచన లేదు… అన్నింటికీ మించి ఈయన పదే పదే చెప్పే మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన బాధితులు మహారాష్ట్రలో ఆందోళనలు చేస్తున్నారు… సిరోంచా ఏరియాలో… జాతీయ స్థాయిలో రైతులకు న్యాయం, పోరాటాలు సరే, పాపం ఈ బాధితుల గోడు వినేదెవ్వరు..?

kcr

kcr

kcr

పంజాబ్ దాకా ఎందుకు..? వీళ్లూ మన దేశం రైతులే, మన ప్రాజెక్టు వల్ల భూముల్ని కోల్పోయినవాళ్లే… మనం ఆ పరిహారాల డబ్బు మహారాష్ట్రకు ఇచ్చామా..? ఆ ప్రభుత్వం ఏం చేసింది..? ఆలోచించాలి కదా..! కాలేశ్వరం బ్యాక్ వాటర్స్ కారణంగా వేల ఎకరాల్లో మూడేళ్లుగా పంటలు వేయలేని రైతులు కూడా ఉన్నారు… ఇవన్నీ ఆలోచించేవాళ్లు లేరు… వాళ్లు జాతీయ రైతుసంఘాల ప్రతినిధులట… వచ్చి కేసీయార్ జయహో అని ఆకాశానికి ఎత్తారట… దేశమంతా తెలంగాణ సాగు మోడల్ కావాలన్నారట… తెలంగాణకు ప్రత్యేకంగా ఓ సాగు మోడల్ ఉందా..? ఏమిటబ్బా అది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …
  • హరిహరా… ఓ వీరమల్లూ… నీ కథెప్పటిది..? ఆ చార్మినార్ ఎప్పటిది..?!
  • ఒకే గది… ఒకే రోజు… కథ అక్కడక్కడే తిరిగే ‘షో టైమ్’… రక్తికట్టింది…
  • ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 3 BHK… ప్రేక్షకులకు కావల్సింది T20 ….
  • వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions