నాన్న పులి కథ.. నేటికీ కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న మారుమూల అటవీ ప్రాంతాల పట్ల ప్రభుత్వాల దృక్కోణంపై ఓ సెటైర్ Sherdil: The Pilibhit Saga. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సుమారు 17 మంది పులుల బారిన పడి చనిపోయిన 2017 నాటి ఘటన… శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన Sherdil: The Pilibhit Saga కు మెయిన్ మోటో! వాస్తవానికి ఓ డాక్యుమెంటరీని పోలినట్టుగా సినిమా కథాగమనం కనిపించినా…అదే సమయంలో వాస్తవికతకు దర్పణం పట్టే చిత్రీకరణతో ఆసాంతం ఫారెస్ట్ ఆంబియెన్స్ తో అలరిస్తుంది.
ఎంచుకున్న కథ.. దాన్ని ప్రభుత్వాలపై వ్యంగ్యాస్త్రంగా ఎక్కుపెట్టిన తీరుతో పాటు… అందుకు తగ్గ న్యాయం చేసిన పంకజ్ త్రిపాఠీ, నీరజ్ కబీ, సాయానీగుప్త క్యారెక్టరైజేషన్స్ ఇంప్రెస్ చేస్తాయి. సినిమాను ఏమాత్రం డామినేట్ చేయకుండా.. ప్రేక్షకులను అడవిబాట పట్టించే బీజీఎం.. సందర్భోచితంగా అటవీ నేపథ్యంలో వచ్చే ఫోక్ సాంగ్స్ కు పూర్తి కాంట్రాస్టుగా ఆ పాటలకందించిన వెస్ట్రన్ ఎలక్ట్రిక్ గిటార్ మ్యూజికల్ స్వరకూర్పు..
ఇలా ప్రతీది ఓ మారుమూల అటవీ ప్రాంతంలో జరిగే కథను కొత్త పుంతలు తొక్కేవిధంగా నడిపిస్తాయి. నేటితరం సంగీత దర్శకుల్లో.. సంగీతంతో సినిమాను డామినేట్ చేయకుండా.. సినిమా టేకింగ్ కు ఏమాత్రం సంగీతం తక్కువ కాకుండా.. కథనానికనుగుణంగా.. వినూత్న తరహా వీనులవిందైన మ్యూజికల్ మ్యాజిక్ చేసే సంగీత దర్శకుల్లో శాంతాను మోయిత్రా ఒకడు కాగా… ఆయన శైలి ఈ సినిమాలోనూ మరోసారి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
Ads
ఓ గ్రామసర్పంచ్.. తమ గ్రామాభివృద్ధి కోసం ఏంచేశాడనేది సినిమా. అయితే సినిమాకు.. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో నాడు జరిగిన ఉదంతానికి ఏంటీ సంబంధం..? రచయిత, దర్శకుడు.. తమ చిత్రానికి ఈ సబ్జెక్ట్ ను ఎంచుకుని ఎలా తమకనుకూలంగా మౌల్డ్ చేసుకున్నారన్నది ఆకట్టుకుంటుంది. అటవీ గ్రామాలపై ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని పట్టిచూపిస్తూ వదిలిన ప్యూర్లీ సెటైర్ ఈ సినిమా!
పులికి ఆహారం కావాలనుకున్న సర్పంచ్ గంగారాం (పంకజ్ త్రిపాఠీ) .. అనూహ్యంగా మీడియా, సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ సేవ్ గంగారాం.. హ్యాష్ ట్యాగ్ సేవ్ జుండావో పేరుతో ఎంత పాప్యులర్ అవుతాడు.. ఆ తర్వాత పిలిభిత్ గ్రామం.. సర్పంచ్ గంగారాం తిరిగిన ప్రాంతాలూ ఎలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయనేది.. సినిమా మెయిన్ థీమ్ ఇంటెన్సిటీని పెంచే నాటకీయతలో భాగమవుతాయి.
తన గ్రామాభివృద్ధి కోసం ఓ సర్పంచ్ పడే పాట్లు.. లీడర్ గా తనను తాను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ లక్ష్యం వైపు కదలడం.. అడవిలో ఓ గ్రేట్ పోయెట్ ను తలపించే రీతిలో కనిపించే వేటగాడి పాత్ర.. ఆ జిమ్ అహ్మద్ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన నీరజ్ కబీకి.. సర్పంచ్ గంగారాంకు మధ్య లైఫ్ గురించి జరిగే డిస్కషన్స్.. ఇలా మొత్తంగా ఓవైపు ఫిలాసఫికల్ గా… మరోవైపు అటవీ గ్రామాల ప్రజల బతుకు చిత్రం గురించి చర్చిస్తుంది Sherdil: The Pilibhit Saga.
మన బ్యూరోక్రసీ.. అధికారుల వ్యవహార శైలి.. టైగర్ కు ఆహారమై తన బలిదానంతో ఊరి స్థితిగతులను మారుద్దామనుకుని.. తిరిగి హీరో అయిన సర్పంచ్ విషయంలో అంతా బాగుందనుకున్న సమయంలో.. మరి నాన్న పులి కథ ఎందుకైందన్న థ్రిల్.. Sherdll: The Pilibhit Saga సినిమాలో చూడాల్సిందే! Netflix: worth watch.👍👌 రివ్యూయర్ :: రమణ కొంటికర్ల
Share this Article