1969… అంటే 53 ఏళ్ల క్రితం… ఈ భూతలం నుంచి ఒక జీవి మన ఉపగ్రహమైన చందమామ మీద కాలుమోపినట్టు ఒక ప్రకటన… అమెరికా వ్యోమగాములు ఆ చంద్రుడిపై నడిచి, జెండా పాతి, అక్కడి మట్టిని తీసుకుని తిరిగి వచ్చేశారని ప్రపంచమంతా చప్పట్లు కొట్టింది… అమెరికా ఖగోళ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానికి జేజేలు పలికింది… 1972 వరకు ఆరుసార్లు అలా అలా చంద్రుడి మీదకు వెళ్లి వచ్చినట్టు కూడా నాసా రాసుకుంది… ప్రపంచానికి చెప్పింది… ప్రపంచం నమ్మింది…
అమెరికాకు 53 ఏళ్ల క్రితం చేతనైన పని మరి మిగతా ప్రపంచానికి ఎందుకు చేతకాలేదు..? అమెరికాకు ప్రతి రంగంలోనూ దీటుగా నిలబడిన రష్యాకు ఎందుకు చేతకాలేదు..? మనిషిని పంపించడం సరే, కనీసం ల్యాండ్ రోవర్‌నైనా సరిగ్గా దింపలేకపోతున్నాం… చంద్రుడికి అటువైపు ఏముందో తెలుసుకోలేకపోతున్నాం… ఎందుకు..? రాకెట్లు, ఉపగ్రహాల్లో మేం తోపులం అని చెప్పుకుంటున్న ఇండియాకు కూడా చంద్రయానం తొలిదశలే అంతుపట్టడం లేదు, ఇక మానవసహిత చంద్రయానం సంగతి..?
యాభై ఏళ్ల క్రితం సరదాగా అలా చందమామ మీదకు వెళ్లొచ్చిన ఇదే అమెరికా, ఇదే నాసా… మళ్లీ ఎందుకు పోలేకపోయింది..? ఉత్తదే మట్టిదిబ్బ, పోయిరావడం వేస్ట్ అనుకుందా..? అలాగైతే మళ్లీ ఇప్పుడు ‘జీరో’ నుంచి ఎందుకు స్టార్ట్ చేసినట్టు..? అసలు యాభై ఏళ్ల క్రితం అడుగుమోపడం అనేది అబద్ధమేనా..? అబద్ధమే అని విశ్లేషిస్తూ టన్నుల కొద్దీ కథనాలు వెలువడ్డాయి… అదంతా స్టూడియో షూట్ చంద్రయానమే అని తేల్చేశారు… ఇప్పుడు మళ్లీ నాసా పాత క్లెయిమ్స్ అన్నీ అబద్ధాలే అనిపించేలా సంఘటనలు…
Ads
ఆర్టెమిస్ పేరిట నాసా ప్రయోగాలకు పూనుకుంది… గతంలోనే మానవసహిత ప్రయాణాలు చేసొచ్చిన నాసా ఇప్పుడు అలవోకగా వెళ్లి రావాలి కదా… ఎన్నాళ్లుగానో మన వాళ్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వస్తున్నారు కదా… మరి చంద్రుడి మీదకు వెళ్లి రావడానికి మూడు దశల ప్రయోగాలు దేనికి..? తొలి దశలో అంతరిక్ష నౌక వెళ్లి, చంద్రుడి కక్ష్యలో తిరుగుతుందట… వ్యోమగాములపై రేడియేషన్ స్థాయిని అంచనా వేస్తుందట… మానవసహిత అంతరిక్ష నౌకను పంపించడానికి అడ్డంకుల అధ్యయనం చేస్తుందట… అవన్నీ దాటేసి కాదా మీరు చంద్రుడి మీదకు ఆరుసార్లు వెళ్లొచ్చింది..?
ఆర్టెమిస్ తొలిదశ సక్సెస్ అయితే… దానికి ఉపయోగించిన ఎస్ఎల్ఎస్ రాకెట్, ఒరియన్ కేప్సూల్ చంద్రుడి మీదకు వెళ్లడానికి ఉపయోగపడతాయని నిర్ధారిస్తారట… (ఇవి ఇప్పటివరకూ ప్రయోగించిన అంతరిక్ష వాహనాల్లోకెల్లా మోస్ట్ పవర్‌ఫుల్ అని నాసా చెప్పుకుంటోంది…)… ఆర్టెమిస్ రెండో దశలో, అంటే 2024లో మానవసహిత కేప్సూల్ పంపిస్తారట… అంటే ఆస్ట్రోనాట్స్ వెళ్తారు… 2025లో మూడో దశ… మనిషి చంద్రుడి మీద నివాసం ఉండటానికి వీలైన పరిశోధనలు సాగిస్తారు…
కానీ ఏమైంది..? ఆర్టెమిస్ తొలి దశ వాయిదా పడుతూనే ఉంది… నిన్న ఇక ప్రయోగించడమే అనుకుంటున్న దశలో ఫ్యుయల్ లీకేజీ గుర్తించి ఆపేశారు… సాంకేతిక శాస్త్ర పరిశోధనల్లో ట్రయల్ అండ్ ఎర్రర్ కామనే… దాన్ని తప్పుపట్టలేం… కానీ ఒకప్పటి తోపుకి ఇప్పుడు ఎందుకిలా గుంజాటన..? ఆ పాత ‘‘అడుగు మోపిన’’ ప్రకటనలన్నీ బోగసేనా..? స్టిల్, ఆ చందమామ మీద మనిషి అడుగు పడలేదా..? ఇప్పటికీ అందని చందమామేనా..? అవీ సందేహాలు… అమెరికా ఎలాగూ సమాధానాలు చెప్పదు కదా…!!
Share this Article