సాధారణంగా సినిమా జర్నలిస్టుల ప్రశ్నలు ఎలాంటి పేడపోకడలు… సారీ, పెడపోకడలు పోతున్నాయో చూస్తున్నాం, చదువుతున్నాం, మనమూ పలుసార్లు చెప్పుకున్నాం… కానీ నిన్న ఓ జర్నలిస్టు హీరో నాగశౌర్యకు వేసిన ప్రశ్న సెన్సిబుల్‌గా ఉంది… సినిమా రిపోర్టర్ కాబట్టి, హీరోకు, అక్కడ నిర్మాతకు కోపం రాకుండా ఉండేందుకు బాగా కవర్ చేయడానికి ప్రయత్నించాడు… కానీ ప్రశ్న స్పిరిట్ మాత్రం ఆలోచించదగిందే… అలాంటి ప్రశ్నలు పడాల్సినవే…
నిజానికి నాగశౌర్య ఏమీ రూడ్‌గా ప్రతిస్పందించలేదు… తను కూడా కూల్‌గా, మర్యాద తప్పకుండా సమాధానమిచ్చే ప్రయత్నం చేశాడు… గుడ్… అయితే కన్విన్సింగు జవాబు చెప్పలేక చేతులెత్తేశాడు… నిజానికి ఆ ప్రశ్నకు జవాబు చాలా క్లిష్టం కాబట్టి…! అసలు ఆ దర్శకుడిని అడిగి ఉంటే ఇంకా బాగుండేది… ఎందుకంటే, ఒక హీరో కేరక్టరైజేషన్, బాడీ లాంగ్వేజీ, లాంగ్వేజీలకు బాధ్యుడు తనే కాబట్టి…!!
సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఏమిటంటే..? ‘‘సినిమాలో బ్రాహ్మణ పాత్ర కోసం అవసరాల శ్రీనివాస్ దగ్గర బ్రాహ్మణ భాషను అభ్యాసం చేశానని చెబుతున్నారు కదా… బ్రాహ్మణుల భాష వేరే ఉంటుందా..? నేనూ బ్రాహ్మడినే, నా భాషకూ మీ భాషకూ ఏమైనా తేడా ఉందా..? అసలు కులాల్ని బట్టి భాష ఉంటుందా..? రెడ్డి భాష, చౌదరి భాష కూడా వేర్వేరు ఉండదు కదా…’’ ఇదీ తన ప్రశ్న సారాంశం… ఎస్, కాస్త థింకాల్సిన ప్రశ్నే…
Ads
తెలుగు సినిమాల్లో హీరో బ్రాహ్మణ పాత్ర పోషిస్తే చాలు, ఓ చిత్రమైన భాష పెట్టేస్తున్నారు వాళ్లకు… అదేమంటే అదుర్స్‌లో ఎన్టీయార్‌ను చూపిస్తున్నారు… ఆ సినిమాలో రెండు భిన్నమైన రోల్స్ నడుమ కంట్రాస్టును బాగా ఎలివేట్ చేయడానికి, ఎన్టీయార్ పోషించిన ఒక పాత్రను అగ్రహారం, పురోహితుడి పాత్రగా కావాలని చెక్కారు… కానీ మొన్నామధ్య వచ్చిన నాని సినిమా ‘‘అంటే సుందరానికి..?’’లో ఓ కృత్రిమ భాషను పెట్టారు తనకు… ఆమధ్య ఏదో సినిమాలో మంచు విష్ణు భాష మరీ చిత్రంగా ఉంటుంది…
నిజానికి ఇవ్వాళారేపు బ్రాహ్మణుల్ని సపరేటుగా మనం గుర్తించగలమా..? అందరిలాగే బ్రాహ్మలు… అందరిలో బ్రాహ్మలు…, వేషభాషల్లో ఆ సపరేట్ ఐడెంటిటీని ఎవరు కోరుకుంటున్నారు ఇప్పుడు..? చదువు, కొలువు, అలవాట్లు, సర్కిల్… అన్నీ సేమ్ కదా… మాటతీరు కూడా ఏ తేడా ఉండదు… అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓ భాషలో మాట్లాడింపజేయడం అవసరమా..? అక్కరలేదు కదా… మరీ కథరీత్యా, ఆ పాత్రరీత్యా అవసరమైతే తప్ప… ఆ జస్టిఫికేషన్ కూడా నాగశౌర్య ఇవ్వలేకపోయాడు… నిజానికి తన దగ్గర సరైన జవాబు లేదు… అసలు బ్రాహ్మణ భాషగా విడిగా పలికిస్తేనే… వాళ్లను విడదీసి వివక్ష చూపినట్టు కదా..!!
అలా ఉంటే బాగుంటుందని సినిమా టీం అనుకుంది అనే సమాధానం చెబితే సరిపోయేది… కథారచయిత, దర్శకుడి క్రియేటివ్ థింక్ అది… దాన్ని ఎవరూ అభ్యంతరపెట్టరు… కానీ పొంతనలేని జవాబులతో ఇరుక్కోవద్దు… చెప్పలేనప్పుడు మౌనాన్ని ఆశ్రయించాలి… కాసేపు ప్రాంతాల వారీ యాసను ప్రస్తావిస్తూ కవర్ చేయడానికి ప్రయత్నించాడు, పొసగలేదు, అది కుదరదు కూడా… రీజియన్లు, డయలెక్టులు వేరు… కేస్టును బట్టి సపరేట్ లాంగ్వేజీని చూపడం వేరు… సో, వీలైనంతవరకూ సినిమాల ప్రమోషన్ ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లలో స్కిప్పింగ్ మెళకువలు నేర్చుకోవాలి నాగశౌర్య… ఇంటర్వ్యూలు అయితే, కన్విన్సింగ్ కారణాలు చెప్పలేకపోతే కట్ చేయాలని అడగవచ్చు, కానీ మీడియా మీట్లలో దానికి చాన్స్ ఉండదు కదా..!!
Share this Article