పార్ధసారధి పోట్లూరి …….. చదువుకున్న శుంఠలకి ఈ పోస్ట్ అంకితం ! వందే భారత్ ఎక్స్ప్రెస్ గేదెలని గుద్దుకొని ముందు భాగం దెబ్బతిన్నది ! ఇదే కదా మీరు ఎగతాళిగా మాట్లాడుతున్నది ? మీ మట్టి బుర్రలకి అర్ధం కావడానికి ముందు కార్ల దగ్గర నుండి మొదలుపెడతాను.
కారులు, SUV లకి ముందు భాగంలో బంపర్లు లేదా బుల్ గార్డ్ లేదా ఇంపాక్ట్ బంపర్లు బిగిస్తారు కదా ? ప్రత్యేకంగా ఈ బుల్ గార్డ్ లేదా ఇంపాక్ట్ బంపర్లు ఎందుకు విడిగా కొని బిగిస్తున్నారు ? ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే కారు లేదా SUVలో ఉన్న మనుషులకి ఏమీ కాకుండా ఉండడానికా? లేకపోతే కారు దెబ్బ తినకుండా ఉండడానికా ?
నిజానికి మనం అనుకున్నట్లు ఈ గార్డ్ లేదా బంపర్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు , ఉండదు ! గత పదేళ్లుగా అన్ని కార్లకి మరియు SUV లకి ముందు వైపు మరియు వెనుక వైపు ఎయిర్ బాగ్స్ ఉంటున్నాయి. ఆఫ్ కోర్స్ ధర తక్కువగా ఉంటుంది అని అసలు ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ఉన్నవి కూడా కొనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతీ కారుకి తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్స్ ఉండాలనే నిబంధన అమలులోకి తెచ్చారు.
Ads
OK..! మళ్ళీ కార్ల ముందు ఉండే బంపర్ల విషయానికి వద్దాము! కార్లు లేదా SUV ల ముందు భాగంలో బుల్ గార్డ్ లేదా బంపర్లు బిగించడం చట్ట రీత్యా నేరం అని మీకు తెలుసా ? కార్లు లేదా SUV ల ముందు భాగంలో బుల్ గార్డ్ లేదా బంపర్లు బిగించడం మీద నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం అని తెలుసా మీకు ? బుల్ గార్డ్ లేదా బంపర్లని ఎందుకు నిషేధించాల్సి వచ్చింది ?
ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇంపాక్ట్ ని ముందు తీసుకునేది మనం రక్షణ కోసం బిగించిన బంపర్ లేదా బుల్ గార్డ్ మీదనే ! దీనివల్ల కారు లేదా SUV ముందు భాగంలో ఉండే ఎలెక్ట్రానిక్ సెన్సార్లు యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తాయి… ఎందుకంటే వత్తిడి బుల్ గార్డ్ మీద పడుతుంది కాబట్టి. దాంతో యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవింగ్ సీటులో కూర్చున్న వారితో పాటు పక్కనే కూర్చున్న వారి ముందు ఉండే ఎయిర్ బాగ్స్ ఆలస్యంగా తెరుచుకుంటాయి కాబట్టి… అప్పటికే యాక్సిడెంట్ వల్ల వాళ్ళ ప్రాణాలు పోయి ఉంటాయి.
అందుకనే కార్ల ముందు భాగంలో ఎలాంటి బంపర్ లేదా గార్డ్ లని బిగించవద్దు అనే నిషేధించారు. ఈ విషయాన్ని లాబరేటరీలో క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత బంపర్ల వల్ల ప్రాణాలు పోతున్నాయి అని నిర్ధారించారు. ఈ బంపర్ల వల్ల మరో నష్టం కూడా జరుగుతుంది. బంపర్లు నేరుగా కారు చాసిస్ లకి బిగిస్తారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఇంపాక్ట్ [వత్తిడి ] బంపర్ ద్వారా నేరుగా చాసిస్ మీద పడి కారు ఎందుకూ పనికిరాకుండా పోతుంది.
అదే బంపర్ లేకుండా ఉంటే ? యాక్సిడెంట్ వల్ల కలిగే ఇంపాక్ట్ కారు మీద సమానంగా పడుతుంది. ఎయిర్ బాగ్స్ సకాలంలో తెరుచుకొని ప్రాణ హాని లేకుండా ఉంటుంది. అలాగే కారు ముందు భాగం మాత్రమే దెబ్బతింటుంది కానీ పూర్తిగా పనికిరాకుండా పోదు. ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కారుకి ఇన్స్యూరెన్స్ రావాలి అంటే ఆ కారుకి బంపర్ లేదా బుల్ గార్డ్ లు ఉండకూడదు. బుల్ గార్డ్ లేదా బంపర్లు ఉంటే ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీ కూడా మీకు నష్టపరిహారం చెల్లించదు.
ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కారుకి బంపర్ కానీ గార్డ్ కానీ లేకుండా ఉంటే జంతువులు లేదా మనుషులకి తీవ్ర గాయాలు అయ్యే అవకాశం తక్కువగా ఉంటాయి. అదే బంపర్ లేదా గార్డ్ ఉన్నట్లయితే అవి ఐరన్ తో చేసినవి ఉంటాయి కాబట్టి వాటి ఇంపాక్ట్ మనుషుల మీద లేదా జంతువుల మీద తీవ్రంగా ఉంటుంది.
***************
ఇప్పుడు ట్రైన్స్ విషయానికి వద్దామ్ ! గతంలో రైలు ఇంజిన్ కి ముందు కౌ కాచర్స్ అని ఉండేవి. రైలు వేగంగా వెళుతున్నప్పుడు ఇనుప జాలీ లాంటిది ఇంజిన్ ముందు భాగంలో ఉంటుంది. వీటిని కౌ కాచర్స్ అని అంటారు. ఈ కౌ కాచర్స్ ఆవులు కానీ గేదెలు కానీ అడ్డువచ్చినప్పుడు వాటికి పెద్దగా హాని కలగకుండా చేయడానికి ఏర్పాటు చేశారు.
అన్ని ఇంజిన్స్ కి కౌ కాచర్స్ ఉంటాయా ? దాదాపుగా అన్ని ఇంజిన్స్ కి ముందు భాగంలో కౌ కాచర్స్ ఉంటాయి కానీ ఎక్కువగా ఏ మార్గంలో తరుచూ జంతువులు రైళ్లకి అడ్డంగా వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయో ఆ రూట్లలోనే కౌ కాచర్స్ ఉన్న ఇంజిన్లని ఉపయోగిస్తుంది భారతీయ రైల్వే. అయితే ఆయా జంతువులు గాయపడతాయా లేక మరణి స్తాయా అన్నది రైలు వేగాన్ని బట్టి అలాగే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసిన విధానం మీద ఆధారపడి ఉంటుoది.
ఒక్కోసారి అది ప్రయాణీకుల రైలు అయినట్లయితే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడం వలన బోగీలు పట్టాలు తప్పే అవకాశం ఉంది అని లోకో పైలట్ భావిస్తే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడు. లోకో పైలట్ కి తాను నడుపుతున్న రైలు దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల భద్రత మొదటి ధర్మంగా భావిస్తాడు. అంతే కానీ ఆవులు, గేదెల ప్రాణాలు కాదు.
***********************
ఇక వందే భారత్ రైలు విషయానికి వద్దామ్ ! వందే భారత్ రైలు ప్రయాణీకులని తీసుకెళ్తుంది అని మనకి తెలిసిందే ! కాబట్టి గేదెలు అడ్డువచ్చిన సమయంలో ఆ ట్రైన్ ఎంత వేగంతో ఉందో తెలియదు కానీ బ్రేకులు వేశాడు లోకో పైలట్.
***********************
ఇప్పుడు టీవి చానెల్ లో కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది శుంఠలు వాగేది ఏమిటంటే ఆర్రే ! ఇంజిన్ ముందు భాగం అలా అయిపోయింది ఏమిటీ ? అది స్కూటీనా ? లేక ట్రైన్ ఇంజినా ? ఇలా జోకులు వేస్తున్నారు కానీ ఈ శుంఠలకి తెలియంది ఏమిటంటే ఒక ప్రత్యేకమయిన మెటీరీయల్ తో తయారుచేసిన ముందు భాగం జంతువులకి తగలాగానే వేటికవే విడిపోయే విధంగా అమర్చారు అని… వందే భారత్ డిజైన్ కౌ కాచర్స్ కోసం కూడా చేశారు. దానిలో భాగంగానే ముందు భాగం లైట్ మెటీరీయల్ తో తయారుచేసి అమర్చారు.
***********************
మీకు ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. రైల్వే సేఫ్టీ విభాగంలో పనిచేసే ఇంజినీర్లు నిరంతరం పరిశోధన చేస్తూనే ఉంటారు భద్రత కోసం. వందే భారత్ కోచ్ ల రూపకల్పన విషయం చాలా విషయాలు ఆలోచించే డిజైన్ చేశారు. పాత ఇంజిన్ల ముందు ఉండే కౌ కాచర్స్ ఈ ట్రైన్ కి వాడితే అందం పోతుంది, కానీ అదే సమయంలో కౌ కాచర్ కి బదులుగా లైట్ మెటీరీయల్ ని వాడారు. ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆ ముందు భాగం మాత్రమే దెబ్బతిన్నది కానీ ఎక్కడా రక్తపు మరకలు లేవన్నది గమనించారా ?
*************************
ఒక మిత్రుడు రైల్వే సేఫ్టీ విభాగంలో పని చేస్తున్నాడు. అతని చెప్తున్నది ఏమిటంటే… మనం ట్రైన్ ఎక్కగానే కాసేపటికి నిద్ర పోవాలని అనిపిస్తుంది ఎందుకో తెలుసా ? రైలు పట్టాల మధ్య ఉండే గ్యాప్ వల్ల బోగీ చక్రాలు ‘టకా టక్ ‘ శబ్దం చేస్తాయి మీరు వినే ఉంటారు. ఆ శబ్ధం ని నియంత్రించడానికి ప్రత్యేక సస్పెన్షన్ వాడుతున్నది రైల్వే కోచ్ ఫాక్టరీ విభాగం. ఆ శబ్దం యొక్క పౌనఃపున్యం [ఫ్రీక్వెన్సీ ] మనకి నిద్ర వచ్చేలా చేసే విధంగా బోగీ సస్పెన్షన్ ని డిజైన్ చేశారు. చెప్పాలంటే రైల్వే గురించి చెప్పుకోవాల్సింది రెండు పుస్తకాలంత ఉంటుంది.
ఒక ఇంజిన్ కానీ లేదా కోచ్ గానీ డిజైన్ చేసేటప్పుడు అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని మరీ డిజైన్ చేస్తారు. ఇలాంటి విభాగం మన దేశంలోనే ప్రత్యేకంగా ఉంది. విదేశాలలో రైలు పట్టాల మీదకి పశువులు రావు.
మనం ప్రయాణించే ట్రైన్ అది ఏది అయినా సరే దానికి రూపాయి ఖర్చు అవుతుంటే టికెట్ రూపంలో రైల్వే చార్జ్ చేసేది 60 పైసలు మాత్రమే. అంటే ప్రయాణీకుల రైళ్ల మీద భారత రైల్వేస్ కి 40% నష్టం వస్తున్నది. దీనిని గూడ్స్ రైళ్లు నడిపి ఆ నష్టాన్ని పూడ్చుకుంటున్నది. మా బండిని ఆపేసి గూడ్స్ ట్రైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని వాపోయే వాళ్ళకి ఈ విషయం తెలియాలని చెప్తున్నాను.
ప్లాట్ ఫామ్ టికెట్ అంత ఖరీదా ? ఇద్దరిని ట్రైన్ ఎక్కించడానికి తంబలు తంబలుగా తరలి వస్తారు స్టేషన్ కి… వచ్చిన వాళ్ళు క్రమ శిక్షణతో ఉంటారా ? బోగీలోకి ఎక్కే చోట అడ్డంగా నిలబడి మాట్లాడుతుంటారు కానీ తొందరలో ట్రైన్ ఎక్కే వాళ్ళకి స్థలం ఇవ్వరు. లగేజీ తో వచ్చే ప్రయాణీకులకి ప్లాట్ ఫారం మీద అడ్డంగా నిలబడి ఉంటారు. So..! ప్లాట్ ఫారం టికెట్ రేట్ ఎంత పెంచినా తప్పులేదు దీనివల్ల 10 మంది వచ్చే వాళ్ళు ఇద్దరే వస్తారు వీడ్కోలు చెప్పడానికి. అదే బస్టాండ్ కి వెళతారా ఈ తంబలు ? వెళ్లరు ! అక్కడ ఫ్లాట్ ఫారం టికెట్ ఉండదు కదా ?
Share this Article