Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… సమంతకు జోడు దొరికేసినట్టే..? టీషర్ట్ క్యాప్షన్ చెబుతున్న మర్మమిదే..?

October 12, 2022 by M S R

ఓహో… సమంత టీషర్ట్ మీద రాసి ఉన్న కేప్షన్ వెనుక అంత కథ ఉందా..? అనేది చర్చ… కాస్త సంక్లిష్టంగానే ఉంది, కానీ ఇంట్రస్టుగానే ఉంది… ఆమె ఇప్పుడు ఒంటరి… అధికారికంగా… తను వదిలేసిన చైతూ కూడా ఒంటరి… ఏదో శోభిత ధూళిపాళతో ఎఫైర్ అన్నారు గానీ, వర్కవుట్ అయినట్టు లేదు… సరే, మొత్తానికి ఇద్దరూ ఒంటరి పక్షులే…

అయితే సమంత ఎప్పుడైనా సరే, సోషల్ మీడియాలో కొన్ని డెవలప్‌మెంట్స్ మీద హింట్స్ పారేస్తుంది… మీకు తెలివుంటే తెలుసుకుని రాసుకొండిర భయ్ అన్నట్టు… పేరులో అక్కినేని అనే పదాన్ని కట్ చేసుకుంది ఓసారి హఠాత్తుగా… అంతే, అదే ఇండికేషన్… కాస్త తింగరితనం ఎక్కువ… ఈమధ్య సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్‌గా లేదు… కానీ హఠాత్తుగా ఓ ఫోటో పెట్టింది…

ఆ బ్లాక్ టాప్ మీద యు విల్ నెవర్ వాక్ అలోన్ అని రాసి ఉంది… ఒంటరిగా ఉన్న ఓ పిల్ల అలా రాసుకుందీ అంటే… కాస్త బంధం కుదురుతోంది… ఇక ఒంటరి నడక కాదు, జంటనడకే అని చెబుతోందా..? సింగర్ చిన్మయి వంటి కేరక్టర్లకు తెలుసు గానీ చెప్పరు… చెబితే ఈమె మీద పడి మెడ కొరికేస్తుంది మరి… ఇంతకీ ఆ జంట పక్షి ఎవరబ్బా…?

Ads

sam

అసలు యూ విల్ నెవర్ వాక్ అలోన్ కథేమిటో తెలుసా..? లివర్ పుల్ ఫుట్ బాల్ క్లబ్… అది ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ లో టాప్ జట్లలో ఒకటి… ఆ క్లబ్బు వాళ్ల సాంగ్ ఇది… మనం యునైటెడ్, ఒంటరివాళ్లం కాము, కలిసి నడుస్తాం అని ఫ్యాన్స్ ‌ను ఉత్తేజపరచడానికి ఈ సాంగ్ ట్యూన్ చేయించారు… ఆ డ్రెస్సు కూడా అక్కడి నుంచి ఎత్తుకొచ్చిందే…

దాన్నే వాడుతూ సోషల్ మీడియా పోస్టు పెట్టడం ద్వారా సమంత జర్నలిస్టులకు ఏమైనా మార్మికంగా చెప్పదలుచుకుందా..,? తింగరిది కదా… చాలా లోతెక్కువ, అర్థం కాదు… ‘నువ్వు ఒంటరిగా నడిచేదానవు కావు’ అనే వాక్యాన్ని నాది ఒంటరి నడక కాదు అనదలుచుకుందా..? ఏమోలే, నాలుగు రోజులాగితే థంబ్ నెయిల్ జర్నలిస్టులు రెచ్చిపోతే…. బాబ్బాబూ, మీకు దండం పెడతాను, నా ఉద్దేశం ఇదీ అని తనే చెప్పవచ్చు కూడా…

జాను తరువాత మళ్లీ సినిమా లేదు ఆమెది… గ్యాప్ వస్తోంది… తమిళంలో త్రిష చేసిన 96 సినిమాతో పోలిస్తే ఈ రీమేక్ తేలిపోయింది… ఇప్పుడు ఆమె చేతుల్లో శాకుంతలం, యశోద అనే పాన్ ఇండియా సినిమా ఉన్నాయి… అవి ఎంతకూ రిలీజ్ కావడం లేదు… అడ్డంకులు ఏమిటో తెలియదు… పర్లేదు, సామ్… యు విల్ నెవర్ వాక్ అలోన్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions