పార్ధసారధి పోట్లూరి ……… రష్యా గత 8 నెలల కాలంలో మొదటిసారిగా భారీ ఎత్తున ఉక్రెయిన్ మీద విరుచుకుపడ్డది ! వ్లాదిమిర్ పుతిన్ పుట్టినరోజు కానుకగా రష్యా క్రిమియాని కలిపే క్రెచ్ బ్రిడ్జ్ ధ్వంసం చేసిన మరుసటి రోజునే పుతిన్ ఉక్రెయిన్ మీద మొదటి సారిగా పూర్తి స్థాయి యుద్ధాన్ని తలపించే విధంగా విరుచుకుపడ్డాడు!
మొత్తం 87 క్రూయిజ్ మిస్సైళ్లతో ఉక్రెయిన్ లోని అన్ని ప్రాంతాల మీద దాడి చేశాడు. ఏ మాత్రం విరామం ఇవ్వకుండా ఒక నగరం తరువాత ఇంకో నగరం లేదా పట్టణం కావొచ్చు వేటినీ వదలకుండా బాంబుల వర్షం కురిపించాడు పుతిన్. పుతిన్ పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టాడా..? జరుగుతున్న పరిణామాలని కనుక పరిశీలిస్తే అవుననే సమాధానం దొరుకుతుంది!
1. రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్లు అయిన ఏడు Tu-160 లని బాంబింగ్ కోసం వాడింది రష్యా !
Ads
2. Kh -101 ఎయిర్ లాంచ్డ్ స్టెల్త్ క్రూయిజ్ మిస్సైళ్ళని Tu -160 బాంబర్ల ద్వారా లాంచ్ చేసి ఉక్రెయిన్ లోని రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని వరసపెట్టి దాడులు చేసింది రష్యా !
3. దాదాపుగా రోజంతా ఆపకుండా క్రూయిజ్ మిస్సైళ్లని ప్రయోగిస్తూనే ఉంది రష్యా. దాంతో ఉక్రెయిన్ కమాండర్లు రక్షణ కోసం బంకర్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రజలని కూడా బంకర్లలోనే ఉండాలని ఉక్రెయిన్ ప్రభుత్వం మైకుల ద్వారా ప్రచారం చేయాల్సి వచ్చింది.
4. సుదూరం ప్రయాణించి లక్ష్యాలని గురి చూసి కొట్టగల KALIBR క్రూయిజ్ మిస్సైళ్లని కూడా ప్రయోగించింది రష్యా ఉక్రెయిన్ మీద. KALIBR క్రూయిజ్ మిస్సైల్ అమెరికన్ టొంమ్ హాక్ మిసైల్ తో పోల్చవచ్చు.
5. గత 7 నెలలుగా ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేయాలని చూసినా మనసు మార్చుకొని కేవలం మిలటరీ టార్గెట్ల మీదనే దాడులు చేస్తూ వచ్చిన పుతిన్ ఈ సారి నేరుగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాలనే టార్గెట్ చేసినట్లుగా చెపుతున్నారు.
పుతిన్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం అయినట్లు చెప్పడానికి మరో పెద్ద సాక్ష్యం :
గత ఫిబ్రవరి 23న పుతిన్ ఉక్రెయిన్ మీద దాడికి ఆదేశాలు ఇచ్చేటప్పటికే పక్కనే ఉన్న బెలారస్ లో దాదాపుగా 2 లక్షల మంది సైన్యాన్ని సిద్ధంగా ఉంచాడు. నిన్న బెలారస్ లోని తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా ఉండమని ఆదేశాలు ఇచ్చాడు. వీళ్ళకి తోడు పెద్ద సంఖ్యలో చెచెన్ ఫైటర్స్ ని కూడా చేర్చాడు పుతిన్.
నిన్న జరిపిన మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్ రాజధాని తీవ్రంగా కంపించి పోయింది అంటే ఈ సారి పుతిన్ చాలా కసిగా ఉన్నాడు అనే సంకేతాలని ఇస్తున్నది. మొన్నటి వరకు జరిగింది వేరు ఇప్పుడు జరుగుతున్నది లేదా రేపు జరగబోయేది వేరుగా ఉండబోతున్నది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే ఇప్పటి వరకు పుతిన్ మోహరించిన సైనికులు పెద్దగా శిక్షణ పొందిన వారు కారు కానీ నిన్నటి దాడుల కోసం సుశిక్షితులు అయిన సైనికులని మోహరించాడు. కడపటి వార్తలు అందే సమయానికి బెలారస్ నుండి ఉక్రెయిన్ లోకి రష్యన్ సైన్యం అడుగుపెట్టింది.
ఈ సారి పుతిన్ లక్ష్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం స్వాధీనం చేసుకోవడం మొదటి లక్ష్యం. అలాగే ఎలాగయినా వ్లాదిమిర్ జెలెన్స్కీ ని బంధించడం రెండో లక్ష్యం! ఫిబ్రవరి 23 న మొదలు పెట్టిన స్పెషల్ ఆపరేషన్ పేరుతో కొనసాగింది ఇన్నాళ్ళూ ! కానీ ఈ సారి పూర్తి స్థాయి యుద్ధం ఉక్రెయిన్ తో పాటు నాటో దేశాలతో చేయడానికే నిర్ణయం తీసుకున్నాడు పుతిన్ .
ఇప్పటికే ఇద్దరు కెనడాకి చెందిన స్ట్రాటజిక్ వార్ కమాండర్లు రష్యా అధీనంలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి సమాచారం తీసుకున్నాక పుతిన్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడ్డట్లు తెలుస్తున్నది. కెనడాకి చెందిన ఇద్దరు కమాండర్లు కూడా ఆఫ్ఘనిస్తాన్ మరియు లిబియాలలో నాటో తరుపున యుద్ధ వ్యూహకర్తలుగా పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే ! తాను చేస్తున్న యుద్ధమ్ ఉక్రెయిన్ తో కాదు అని, నాటోతో అని గట్టిగానే చెప్పదలుచుకున్నాడు పుతిన్.
అయితే ఆధారాలు కావాలి కదా ? ఇప్పుడు ఇద్దరు కెనడియన్లు తన అధీనంలో ఉన్నారు కానీ పుతిన్ బయటికి చెప్పట్లేదు కానీ గత రెండు నెలల క్రితం చాలా మంది నాటోకి చెందిన వాళ్ళని యుద్ధ ఖైదీలుగా బంధించి తన దగ్గరే పెట్టుకున్నాడు పుతిన్ ! వాళ్ళని వదిలిపెట్టమని నాటో ఆడగలేదు ఎందుకంటే అలా బహిరంగంగా అడిగితే ఉక్రెయిన్ విషయంలో నాటో జోక్యం ఉందని ఒప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆడగలేరు… అలా అని పుతిన్ వాళ్ళని చంపేస్తాడనే భయం కూడా ఉంది.
ఎటూ ప్రాణాలు పోతున్నప్పుడు నిజం బయటి ప్రపంచానికి చెప్పి బ్రతికి బయటికి వెళ్ళవచ్చు అని కనుక సదరు కెనడియన్లు భావిస్తే తమ ప్లాన్ ఏమిటో తమని ఎవరు ఎందుకు ఉక్రెయిన్ పంపించారో మీడియా ముందు చెప్పే అవకాశాన్ని పుతిన్ తన వద్దే ఉంచుకున్నాడు. జస్ట్ తురుపు ముక్కలు వాళ్ళు !
ఇద్దరు కెనడియన్లు కాకుండా ఇంకా ఎవరన్నా నాటో యుద్ధ నిపుణులు పుతిన్ వద్ద బందీలుగా కూడా ఉండి ఉండవచ్చు! కానీ వాళ్ళు ఎవరు ? ఎంత మంది ? అనే విషయాన్ని ఇటు పుతిన్ కానీ అటు నాటో కానీ బయటపెట్టడం లేదు. తమ వాళ్ళకి ప్రాణ భిక్ష పెట్టమని నాటో అడగలేదు ! వాళ్ళు మా దగ్గర బందీలుగా ఉన్నారు అని పుతిన్ బయటికి చెప్పడు!
నాటో స్నైపర్లు Vs రష్యన్ స్నైపర్లు
పదేళ్ళ క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో ఒక కెనడియన్ స్నైపర్ దాదాపుగా 2.2 కిలోమీటర్ల దూరం నుండి ఒకే బుల్లెట్ తో నలుగురు తాలిబన్లని చంపినట్లుగా రికార్డ్ అయి ఉంది. ఇది కేవలం నాటో ప్రకటన ఆధారంగా మనకి తెలిసింది తప్పితే దానిలో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఇప్పటికీ ఇదే ప్రపంచ రికార్డ్ ! ఆ కెనడియన్ స్నైపర్ పేరు వలీ [Wali ] కానీ ఈ పేరు అసలు పేరు కాదు. స్నైపర్ల పేర్లు రహస్యంగా ఉంచడం ఆనవాయితి !
పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టగానే విదేశాల నుండి సహాయం కోరిన సంగతి తెలిసిందే ! అయితే అందరూ అనుకున్నట్లు ఆర్ధిక, ఆయుధ సహాయంతో పాటు విదేశీ ఫైటర్లని కూడా ఆహ్వానించాడు. అలా రష్యాకి వ్యతిరేకంగా వివిధ దేశాల నుండి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీల నుండి కాక ప్రత్యేకంగా స్నైపర్లు కూడా ఉక్రెయిన్ కి చేరుకున్నారు. అలా ఉక్రెయిన్ కి వచ్చిన విదేశీ ఫైటర్ల సంఖ్య 2,500 మంది. అలాగే కెనడియన్ స్నైపర్ వలీ కూడా ఉక్రెయిన్ లోని ఎల్ వివ్ [LViv] నగరానికి వచ్చాడు.
2022 మార్చి నెలలో రష్యన్ సైన్యం వలీని కాల్చి చంపింది అని వార్తలు వచ్చాయి. సో కాల్డ్ వరల్డ్ రికార్డ్ స్నైపర్ అయిన కెనెడియన్ వలీని చంపడం పెద్ద వార్త అయి కూర్చుంది.
రెండు భిన్నమయిన కధనాలు :
అందరూ చనిపోయాడు అనుకున్న వలీ అనూహ్యంగా ఫ్రాన్స్ కి చెందిన వెబ్ న్యూస్ చానెల్ frans 24 స్టూడియోలో ప్రత్యక్షం అయి తాను రష్యన్ దళాల చేతిలో చనిపోలేదని బ్రతికే ఉన్నాను అని ఇంటర్వ్యూ ఇచ్చాడు!
కెనడియన్ స్నైపర్ వలీ కధనం ప్రకారం …… కెనడా సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యాక, ఉక్రెయిన్ వార్ కోసం అని స్వచ్ఛందంగా వెళ్ళాను కానీ నాతో ఎలాంటి స్నైపర్ రైఫిల్ తీసుకెళ్లలేదు, ఎందుకంటే నేను పనిచేసిన కెనడియన్ సైన్యానికి చెందిన స్నైపర్ రైఫిల్ ని రిటైర్ అయ్యాక వాళ్ళకే అప్పచెప్పాను కాబట్టి, నా దగ్గర రైఫిల్ లేదు. కానీ ఉక్రెయిన్ లోని LViv నగరంకి వెళ్ళిన తరువాత అక్కడ ఏదన్నా స్నైపర్ రైఫిల్ దొరకవచ్చు అనుకున్నాను. కానీ అక్కడ నాకు ఉక్రెయిన్ సైన్యానికి చెందిన వాళ్ళు తమ దగ్గర అలాంటి రైఫిల్ లాంటిది ఏదీ లేదు అన్నారు. దాంతో సాధారణ రైఫిల్ తోనే వాళ్ళకి సహాయం చేయాలని అనుకున్నాను.
ఒక రోజు Lviv నగరంలో తిరుగుతుండగా రష్యన్ దళాలు మేము ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. నేను ఇంకో ఉక్రెయిన్ సైనికుడి సహాయంతో ఒక అపార్ట్మెంట్ లోని మూడో ఫ్లోర్ లోని ఒక ఫ్లాట్ లోకి వెళ్ళాము. ఆ ఫ్లాట్ యజమాని మా కోసమే అన్నట్లుగా ఒక కిటికీ దగ్గర డబుల్ కాట్ మంచాన్ని ఉంచి రెండు పరుపులు ఒక దానిమీద ఇంకొకటి పెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ అరేంజ్మెంట్ ఒక స్నైపర్ కి కావాలని చేసినట్లుగా ఉంది. [ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి].
నేను పొజిషన్ తీసుకోవడానికి సిద్ధం అవుతుండగా ఒక రష్యన్ టాంక్ సరిగ్గా మేము ఉన్న ఫ్లాట్ కిటికీ వైపు షెల్ తో కాల్పులు జరిపింది. అది క్లోజ్ కాల్[క్లోజ్ కాల్ అనే పదాన్ని మిలటరీ వాళ్ళు వాడతారు – చావుకి దగ్గరగా వెళ్ళడం అన్నమాట ]. నేను తృటిలో తప్పించుకున్నాను కానీ నాకు సహాయంగా వచ్చిన ఉక్రెయిన్ సైనికుడు దాని దెబ్బకి చనిపోయాడు క్షణాలలో. నేను ఉక్రెయిన్ లో గడిపిన నెల రోజులు కూడా రోజూ దాదాపుగా మృత్యువుకి దగ్గరగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను. ఇలా సదర్ వెబ్ న్యూస్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వలీ చెప్పిన మాటలు ఇవి.
ఇక రష్యా కధనం ……
మాకు ఫేమస్ వరల్డ్ రికార్డ్ కెనడియన్ స్నైపర్ వలీ LViv ఉన్నట్లు ముందుగానే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది కాబట్టి మా స్నైపర్లు ఆ ప్రాంతంలో అప్పటికే ఉన్నారు. ఒక అపార్ట్మెంట్ లోకి వలీ తన స్నైపర్ రైఫిల్ తో వెళ్ళడం చూశారు. వలీ పొజిషన్ తీసుకుంటుంటుండగానే వెంటనే కాల్పులు జరిపాడు మా స్నైపర్ అయితే మా స్నైపర్ స్కోప్ లో వలీ కి బులెట్ తగలడం స్పష్టంగా కనిపించింది కాబట్టి అతను చనిపోయాడు అని నిర్ధారణకి వచ్చాము.
ఇది జరిగిన కొద్ది క్షణాలలోనే మా యుద్ధ టాంక్ వలీ ఉన్నట్లు అనుమానిస్తున్న మూడో ఫ్లోర్ కిటికీ వైపు షెల్ ని కాల్చారు, దాంతో ఆ ఫ్లాట్ మొత్తం ధ్వంసం అయిపోయింది. తరువాత ఆ ఫ్లాట్ లో మాకో శవం దొరికింది కానీ ఆనవాళ్ళు గుర్తుపట్టలేనంతగా ఉండడంతో అది వలీ శవం అని అనుకున్నాము. తరువాతి రోజుల్లో మాకు ఎక్కడో అక్కడ కొత్త స్నైపర్ తారసపడుతూనే వచ్చారు అలాగే మా స్నైపర్లు వాళ్ళని ఎటాక్ చేస్తూనే వచ్చారు.
******************
దీన్ని బట్టి ఏమి అర్ధమవుతున్నది ?
కెనడియన్ స్నైపర్ వలీ దగ్గర స్నైపర్ రైఫిల్ ఉన్నది. అది ఏ మోడల్ అన్నది తెలియదు కానీ మొత్తానికి వలీ స్నైపర్ రైఫిల్ తోనే ఉక్రెయిన్ కి వచ్చాడు. కానీ ప్రతి రోజూ తాను వెళ్ళిన ప్రదేశంలో రష్యన్ స్నైపర్ ల నుండి ప్రతిఘటనని ఎదుర్కొన్నాడు. కానీ మొదటి రోజు జరిగిన కాల్పుల ఘటనలో అంతో కొంత గాయపడ్డాడు, కానీ అలాగే తన పనిని కొనసాగించాడు చివరకి తాను రష్యన్ స్నైపర్ల ని ఎదుర్కోలేనని గ్రహించి ఉక్రెయిన్ నుండి చావు తప్పి కన్ను లొట్టపోయి వెళ్ళిపోయాడు. తాను చనిపోయినట్లు వార్త వైరల్ అవ్వడంతో గతి లేక ఫ్రాన్స్ లోని న్యూస్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది…. అదీ ముఖానికి మాస్క్ తో మాత్రమే !
స్నైపర్ రైఫిల్ లేని వాడి కోసం సదరు ఫ్లాట్ యజమాని కిటికీ దగ్గర డబుల్ బెడ్ ని, దాని మీద రెండు పరుపులని పెట్టి ఎందుకు వెళ్ళినట్లు ? సదరు ఫ్లాట్ యజమానికి ముందే సమాచారం ఉంది. వలీ తన స్నైపర్ రైఫిల్ తో అక్కడికి వస్తున్నట్లు…. కాబట్టి అన్నీ సిద్ధం చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మామూలు జవాన్ కోసం ఎవరూ ఇలాంటి ఏర్పాట్లు చేయరు !
****************************
ఆధునిక యుద్ధ పరికరాల తయారీలో వెస్ట్ కంటే వెనకపడి ఉండవచ్చు రష్యా కానీ స్నైపర్ రైఫిల్ తయారీలో కానీ స్నైపర్ల విషయంలో కానీ ఇప్పటికీ రష్యా ది బెస్ట్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యన్ స్నైపర్లు అద్భుతమయిన విజయాన్ని ఇచ్చారు సోవియట్ యూనియన్ కి. స్నైపర్ల విషయంలో జర్మనీ చాలా ముందు ఉన్నా స్టాలిన్ గ్రాడ్ దగ్గర జరిగిన యుద్ధంలో రష్యన్ స్నైపర్లు కనపరిచిన ప్రతిభ అప్పట్లో ప్రపంచాన్ని విస్మయపరిచింది అన్నది సత్యం. స్టాలిన్ గ్రాడ్ జర్మనీ వశం కాకుండా కాపాడింది అప్పటి సోవియట్ స్నైపర్లే ! ఇప్పటి వరకు స్నైపర్లు గా మగ వారే ఉన్నారు తప్పితే మహిళలు లేరు కానీ రెండో ప్రపంచ యుద్ధ కాలం నాడే సోవియట్ మహిళలు స్నైపర్లు గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు.
****************
ల్యుదిమిలా పావ్లి చెంకొ [Lyudmila Pavlichenko] రష్యన్ మొదటి మహిళా స్నైపర్. మొత్తం 309 మందిని చంపిన ఘనత ఈ రష్యన్ మహిళా స్నైపర్ ది. విచిత్రం ఏమిటంటే ఈ మహిళా స్నైపర్ అయిన ల్యుదిమిలా పావ్లి చెంకొ ఇప్పటి ఉక్రెయిన్ నగరంలో పుట్టి పెరిగింది అప్పట్లో. ఇప్పటికీ స్నైపర్లు, వాళ్ళు ఏ దేశంకి చెందిన వాళ్ళు అయినా సరే వాళ్ళు ఇష్టపడే స్నైపర్ రైఫిల్ లలో రష్యా కి చెందిన DXL-5 Ravager rifle (aka Havoc) ఒకటి గా ఉంటుంది అంటే నమ్మాలి. సో, ఈ సారి పుతిన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అనే దాని మీద ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది…
Share this Article