Murali Buddha………… కరెంట్ బిల్లు కట్టవద్దన్న ysr .. కట్టని బాబు… అట్టుడికిన అసెంబ్లీ .. ఓ జ్ఞాపకం
ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్ బిల్లులు కట్టవద్దు అని ysr పిలుపును ఇస్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాటిస్తే ఎలా ఉంటుంది .. ఇది నిజంగా జరిగింది, అసెంబ్లీ అట్టుడికింది … అలా జరగడానికి తనకు తెలియకుండానే సహకరించిన వ్యక్తికి ఆ విషయం ఇప్పటికీ తెలియదు . 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విద్యుత్ అంశం రాష్ట్రాన్ని అట్టుడికించేట్టు చేసింది .. ఒక వైపు విద్యుత్ ఉద్యమం తరువాత తెరాస ఆవిర్భావం . వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచినందుకు బిల్లులు చెల్లించవద్దు అని ysr పిలుపు .. రాష్ట్రమంతటా విద్యుత్ అంశం పైనే చర్చ …..
సచివాలయంలో పని ముగించుకొని ఆఫీస్ కు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే సీఎం ఆఫీస్ లిఫ్ట్ ఆపరేటర్ మా ఇల్లు మీ ఆఫీస్ వైపే అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తారా ? అని అడిగారు . .అప్పుడు బాబు సీఎం…. సీఎం ఆఫీస్ అటెండర్ కు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి … వారిని మాట్లాడించే సామర్ధ్యం మనకు ఉంటే …. నేను మంచి శ్రోతను .. ఎదుటి వారితో మాట్లాడించగలను … పిచ్చాపాటి ఏవేవో విషయాలు శ్రద్దగా విన్నాను … నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో బాబుకు వ్యవసాయ పొలం ఉంది అనేది గుర్తుండి పోయింది .. అంతకు ముందు ఆ విషయం ఎక్కడా వినలేదు ..
Ads
ఓ రోజు ఆకాశ రామన్న ద్వారా ఓ సమాచారం అందింది . నెల్లూరులో బాబుకు వ్యవసాయ పొలం ఉంది . విద్యుత్ మీటర్ నంబర్ వివరాలు .. దాదాపు లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బకాయిలు .. చాలా రోజుల నుంచి చెల్లించడం లేదు . సీఎంది కాబట్టి అధికారులు అడిగే ధైర్యం చేయరు .. చెప్పే ధైర్యం చేయరు … ఇప్పటి మాదిరిగా మీటర్ నంబర్ ఆన్ లైన్ లో చూస్తే బకాయి ఎంత ఉంది ? యజమాని ఎవరు అని తెలిసే రోజులు కావు … ఆదివారం అధికారులు ఉండరు .. ఉన్నా చెప్పరు ..
విలేజ్ పేరు చూశాక గుర్తుకు వచ్చింది .. ఆ రోజు లిఫ్ట్ ఆపరేటర్ చెప్పిన ఊరు ఇదే … న్యూస్ ఎడిటర్ అమర్ నాథ్ కు విషయమంతా చెప్పి *దేవుడు శాసించాడు , భాషా పాటించాడు* అని రజనీ కాంత్ డైలాగులా – వైయస్సార్ విద్యుత్ బిల్లులు కట్టొద్దని పిలుపు ఇచ్చాడు , చంద్రబాబు పాటించాడు అని వివరంగా వార్త రాస్తే బ్యానర్ వేశారు .
మరుసటి రోజు అసెంబ్లీ … ఈ అంశంపై అసెంబ్లీ అట్టుడికింది … విద్యుత్ బిల్లు కట్టక పోవడం సాధారణ సమయంలో పెద్ద అంశం కాదు .. కానీ విద్యుత్ బిల్లులు కట్టవద్దు, మేం అధికారంలోకి రాగానే మాఫీ అని వైస్సార్ పిలుపు ఇస్తే , కట్టక పోతే కనెక్షన్ కట్ అని బాబు హెచ్చరికలు … దానితో వార్త ప్రాధాన్యత సంతరించుకుంది . నెల్లూరులో పొలం నిజమే , చాలా రోజుల నుంచి బిల్లు కట్టనిది నిజమే. దాంతో బాబు సమర్ధించు కోలేక పోయారు …
లిఫ్ట్ ఇస్తే అతను నాకు న్యూస్ లో లిఫ్ట్ ఇచ్చాడని మనసులో అనుకున్నాను … ఈ విషయం లిఫ్ట్ ఆపరేటర్ కు ఇప్పటి వరకు తెలియదు . చాలా సార్లు యాంకర్లు , రిపోర్టర్లు ఎక్కువగా మాట్లాడతారు … నాయకులు , అధికారులను మాట్లాడనివ్వక సక్సెస్ అయ్యాము అనుకుంటారు . మనం తక్కువ మాట్లాడి, మనకు వార్తలు ఇచ్చే వారితో ఎక్కువ మాట్లాడించాలి .. మహా మహులే కాదు చిన్న వారి వద్ద కూడా బోలెడు సమాచారం ఉంటుంది …
Share this Article