ఈసారి బార్క్ రేటింగ్స్ చూసేసరికి ఇంకాస్త ఆశ్చర్యం కలిగింది… శుష్క ప్రకటనలకు, ఏతులకు, ఎచ్చులకు పెట్టింది పేరుగా మారి.., నానాటికీ సొసైటీలో పరువును, పాత్రికేయ ప్రమాణాలను పోగొట్టుకుంటున్న టీవీ9 సిట్యుయేషన్ చూసి జాలేసింది… ఈ రేంజులో ఎన్టీవీ ఎలా మేనేజ్ చేస్తున్నదబ్బా, ఇన్నాళ్ల టీవీ9 ‘రేటింగ్ మేనేజ్‌మెంట్’ ప్రమాణాలు ఏమయ్యాయబ్బా అనే మథనంలో పడేసింది ఈసారి ర్యాంకింగ్…
స్థూలంగా మేనేజ్‌మెంట్స్ ఒకటే అయినా… ఎన్టీవీ, టీవీ9 బజారున పడి తన్నుకుంటున్నాయనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం… ఈసారి ఫాఫం టీవీ9 మూణ్నాలుగు రేటింగ్స్ పెంచుకుందా అని చూస్తే… ప్చ్, ఫాఫం అదేమీ లేదు సరికదా ఈసారి ఎన్టీవీ టీవీ9 మీద సంపూర్ణాధిపత్యం సంపాదించేసింది… ఇంకాస్త తొక్కేసింది… ఇప్పుడు కోయండి కేకులు, పెట్టండి హోర్డింగులు, నింపండి సోషల్ మీడియా పోస్టులు, స్వకుచమర్దనాలు… ఈ దిగువ లింకులో తాజా ర్యాంకింగ్స్, ఏయే న్యూస్ చానెల్ సిట్యుయేషన్ ఏమిటో చదవొచ్చు…
Ads
ఎన్టీవీ తొలిసారి టీవీ9ను తొక్కిపారేసి అగ్రస్థానానికి చేరినప్పుడు (మళ్లీ చెబుతున్నా, బార్క్ రేటింగ్స్ పక్కా మేనేజబుల్… ఎమ్మెస్వోలకు చెల్లింపులు ఎలాగో నాలుగు మీటర్ రీడింగ్ ఇళ్లు దొరికితే చాలు, కథ మారిపోతుంది… బార్క్ రేటింగ్స్ నాణ్యతను పట్టివ్వవు, మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను పట్టిస్తాయి అవి…) హైదరాబాద్, ఇతరత్రా ఒకటీరెండు కేటగిరిలలో స్టిల్ టీవీ9 అగ్రస్థానంలో ఉండేది… సో, ఎన్టీవీ నాణ్యమైంది కాదు, ఈ ర్యాంకింగ్ పోటీలో బెటర్ రన్ చూపిస్తోంది అని అర్థం… అంతే… ఏ రూట్‌లో అనేది వేరే కథ…
ఇక ఇప్పుడు ఏమైంది..? ఏపీ-తెలంగాణ ఓవరాల్, హైదరాబాద్, ఏపీ-తెలంగాణ బిలో 75 లాక్స్ అర్బన్, ఏపీ-తెలంగాణ రూరల్, ఏపీ-తెలంగాణ అర్బన్… ఇలా అన్ని కేటగిరీల్లోనూ ఎన్టీవీ ఇంకాస్త మెరుగైన ప్లేసులోకి వెళ్లిపోయింది… టీవీ9 మరో నాలుగు మెట్లు దిగిపోయింది… మొదట్లో ఒకటీరెండు రేటింగ్స్ తేడా ఉండేది… ఇప్పుడు ఓవరాల్ రేటింగ్స్‌లో ఎన్టీవీ 80.4 కాగా, టీవీ9 జస్ట్, 57.2 తేడా అర్థమైంది కదా… 23 టీఆర్పీల తేడా… ఇప్పట్లో దీన్ని అధిగమించడం అసాధ్యం… అదీ కీలకమైన వికెట్లు టపటపా పడిపోతున్నవేళ…
మిగతా వాటి సంగతి అంటారా..? టీవీ5 పేరుకు మూడో ప్లేసు అయినా సరే, అదొక నాసిరకం వార్తప్రసార సంస్థ… ఈమాత్రం రేటింగ్స్ కూడా ఎలా వస్తున్నాయో అర్థం కాదు… చెప్పుకోదలిచింది ఏబీఎన్… ఈ సాక్షిలు, ఈ ఈటీవీలు ఎట్సెట్రా చానెళ్లను దాటేసి మెరుగైన స్థితిలో రేటింగ్స్ పొందుతూ స్థిరంగా నిలబడి ఉంది… మిగతా చానెళ్ల గురించి ఇప్పుడైతే పెద్దగా చెప్పుకునేదేమీ లేదు… సెలవు…
Share this Article