దేవతా వస్త్రం కథలో రాజు బట్టల్లేకుండా పట్టపగలు నడివీధిలో అలా నిస్సిగ్గుగా ఏనుగుమీద ఊరేగుతున్నాడేమిటి? అని కనీసం పసి పిల్లాడయినా అడిగాడు. ఆధునిక “నారా” వస్త్రం కథలో కనీసం ఆ పసి పిల్లాడు కూడా లేడు. విశ్వ విశ్వాంతరాళాల్లో “బాబుతో నేను” అని ప్లకార్డులు పట్టుకుంటున్నవారు బాబుతోపాటి రాజమండ్రి జైలులో ఉండడానికి ఉవ్విళ్లూరుతున్నట్లుగా స్పష్టంగా చెప్పుకుంటున్నారు. లేదా బయట ఉన్నా తాము జైలులో ఉన్నట్లే నిద్రాహారాలు మాని…నీరసించి ఉన్నట్లు చెప్పుకోదలుచుకున్నారు. రక్తాశ్రువులు చిందించే అభిమానులను సంపాదించుకున్న తన ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ జన్మ ధన్యమయ్యిందని బాబు గోదావరీ తీర జైలు గోడల మధ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులవుతూ ఉంటారు.
తనను తాను రాజకీయ నాయకుడు అని బాబు అనుకోరు. ఒక సీ ఈ ఓ, ఒక మేనేజర్ అని అనిపించుకోవడానికి “మనసులో మాట” రాసుకున్నారు కూడా. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలచుకోవడం తనకు హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య అని ఆయనే చెప్పుకున్నట్లు- ఇప్పుడు సింపతీ ఈవెంట్లు మిన్నుముడుతున్నాయి. కన్నీటి ప్రదర్శనలు షెడ్యూల్ అవుతున్నాయి.
ఒంగోలు మాగుంట ఉదయాన్ని అస్తమింపచేయడానికి ఉషోదయాన ఈనాడు నడిపిన కృత్రిమ సారా వ్యతిరేక ఉద్యమం ప్రపంచ మ్యాన్యుఫ్యాక్చురింగ్ కన్సెన్ట్ పాఠాలకు దారి దీపం. మద్య నిషేధాన్ని ఎత్తేసినప్పుడు అదే ఈనాడు “సరైన సమయంలో సరైన నిర్ణయం” సంపాదకీయంతో అక్షరాలా అక్షరాల హారతి పట్టింది. బాబు ప్రత్యక్ష ప్రసారాల వ్యాపారంలో ఆంధ్రజ్యోతి అడ్వాన్స్ డ్ కమ్యూనికేషన్స్ ఆమోద ముద్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. టీ వీ ఫైవ్ సాంబ జర్నలిజం పాతాళం కింది నుండి కొంగు బిగింపులకు ఇచ్చే పచ్చ పిలుపుల పచ్చి వాసనల లెక్కలు లోకానికి తెలియనివి కావు.
రెండు కళ్లు, నాలుగు నాలుకలు, ఆరు కాళ్ల వింత భావనల భవనాలకు రాళ్లెత్తిన కూలీలు, శ్రమదానం చేసిన మేస్త్రీలకు మళ్లీ చేతి నిండా పని. నోటి నిండా పని. జన్మభూమి సేవకు, పరిరక్షణకు ఉద్యోగాలు వదిలి వెళుతున్న ఐ టీ నిపుణులు…ఇప్పుడు ఉద్యమ దీపికలు.
తిప్పిన చక్రాలు, ప్రతిష్ఠించిన రాష్ట్రపతులు, పన్నిన వ్యూహాలు, తెచ్చుకున్న స్టే లు గతం. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోవడం వర్తమానం.
ఈనాడు, జ్యోతి, టీ వీ ఫైవ్ ఉన్నంతవరకు బాబుకు నిజం తెలియదు. కాగితం పులికి కాగితమే బలం. అదే బలహీనత!
ఒక వై ఎస్ ఆర్ సి పి అభిమాని డి పి గా పెట్టుకున్న పోస్ట్ ఇలా ఉంది:-
“అవినీతి బాబుతో నేను!
———————–
దొంగ సీమెన్స్ సృష్టికర్త బాబుతో నేను.
అవినీతి నైపుణ్య బాబుతో నేను.
గ్రాఫిక్స్ పగటి కలల నిర్మాతతో నేను.
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసడర్ తో నేను.
పేదల భూముల స్వాహా బాబుతో నేను.
మానిఫెస్టో మాయం బాబుతో నేను.
సోమవారం వారం పోలవరం ఏ టీ ఎం బాబుతో నేను.
ప్రత్యేక ప్యాకేజీ తాకట్టు దుర్భాగ్యవిధాతతో నేను.
రెండు కళ్ల , రెండు నాల్కల బాబుతో నేను
భ్రమరావతి బూడిద బాబుతో నేను.
రాజమండ్రిలో ఫోటో షూట్ కు జనాన్ని చంపిన బాబుతో నేను.
కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదుతూ మేము!!”
Share this Article