ఎవరేం కూసినా, రాసుకున్నా… ప్రతిసారీ ఎలిమినేషన్ల అంచుల్లో నిలబడినా… బిగ్‌బాస్ ఆమెను పదే పదే కావాలనే సేవ్ చేస్తూ వేరేవాళ్లను బలి తీసుకుంటున్నాడనే విమర్శలు వచ్చినా… శోభాశెట్టి శోభాశెట్టే… అంతే… నాగార్జున మద్దతుతో, పక్కా సోషల్ మీడియా ప్రణాళికతో, ముందే విజేతగా ప్లాన్ చేసుకుని వచ్చిన శివాజీ గ్యాంగును పర్‌ఫెక్ట్‌గా ఢీకొడుతున్న మోనిత అలియాస్ శోభాశెట్టి ఇప్పుడు టీవీ సెలబ్రిటీ సర్కిళ్లలో హాట్ టాపిక్…
బిగ్‌బాస్ అంటేనే ఓ గేమ్… అందులో చాలా స్ట్రాటజీలు ఉంటయ్… ముందుగానే బిగ్‌బాస్ టీంతో తను ఎన్నివారాలు ఉండాలో మాట్లాడుకోవడం కూడా అందులో ఓ స్ట్రాటజీయే… దానికి తగినట్టు ఆడటం మరో స్ట్రాటజీ… శివాజీ గ్యాంగుకు వ్యతిరేకంగా శోభకూ ఓ గ్యాంగ్ ఉంది… జమచేసింది… అందరూ టీవీ సీరియల్ బ్యాచ్ అని తిట్టిపోసినా సరే… ఆలెక్కన శివాజీ బ్యాచును ఏమనాలి..?
నాగార్జున శివాజీకి మద్దతు ఇవ్వడానికి చాలా కారణాలు ఉండవచ్చుగాక… కానీ శోభను ఇగ్నోర్ చేయలేడు… శోభ బ్యాచ్ హౌజు బయటికి వెళ్లిపోతే ఆ షోకు రేటింగుల్లేవ్, యాడ్స్ లేవు, డబ్బుల్లేవు… ఇప్పుడిక ఇదే కథకు వేరే కోణంలోకి వెళ్దాం…
Ads
ఈయన్ని గుర్తుపట్టారా..? కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ కార్తీక్ (పరిటాల నిరుపమ్) తమ్ముడి కేరక్టర్… పాత్ర పేరు ఆదిత్య… అసలు పేరు యశ్వంత్… అదే సీరియల్‌లో శోభాశెట్టి మోనిత అనే విలన్ కేరక్టర్ చేసింది తెలుసు కదా… ఆ రోజుల నుంచే ఇద్దరూ ప్రేమలో పడ్డారు… ఎప్పుడూ బయటకు చెప్పలేదు గానీ చాన్నాళ్లుగా చెట్టపట్టాలే…
మొన్న హౌజులోకి ప్రియాంక లవర్ శివకుమార్ వచ్చాడు, ముద్దులు పెట్టుకున్నాడు… అందరికీ తెలిసిన ప్రేమకథే… త్వరలో పెళ్లిచేసుకొండి, నేనూ వస్తాను అని నాగార్జున అన్నాడు కూడా… కానీ శోభాశెట్టి ప్రేమకథ చాలామందికి తెలియదు… ఇప్పుడు బిగ్‌బాస్ పుణ్యమాని నాగార్జున యశ్వంత్‌ను పట్టుకొచ్చాడు… శోభాశెట్టి ఎదుట వర్చువల్‌గా నిలబెట్టాడు… ఇంకేముంది..? తప్పించుకునేదేముంది..? ఇద్దరూ ప్రేమలు ఒలకబోసుకున్నారు… గుడ్… లుకింగ్ ప్రెట్టీ పెయిర్…
ఆమధ్య ఇద్దరూ కలిసి మ్యూజిక్ వీడియోలు కూడా చేశారు… తను కూడా బోలెడు తెలుగు టీవీ సీరియల్స్ చేశాడు కూడా… ఇద్దరూ సేమ్ ఫీల్డ్… సో, బెస్టాఫ్ లక్… లవ్లీ పెయిర్… గో ఎహెడ్… శోభను భరించడం కష్టమే కానీ యశ్వంత్ భరించే తత్వమున్నవాడే… బిగ్‌బాస్ దీపావళి స్పెషల్ షో సందర్భంగా యశ్వంత్‌ను రంగప్రవేశం చేయించాడు నాగార్జున… అదేదో సినిమాలో జెనీలియా అంటుంది కదా… ‘‘అంతేనా, ఇంకేమీ లేదా..?’ అని… సేమ్… శోభ కూడా అలాగే అంది… తప్పేదేముంది..? ఐ లవ్ యూ అన్నాడు…
కథ పెళ్లి దిశలో వెళ్తోంది… అటు ప్రియాంక, ఇటు శోభా… ఆల్ ది బెస్ట్ టు యు బోత్… చెప్పనే లేదు కదూ… శోభాశెట్టిలాగే యశ్వంత్ కూడా కన్నడిగుడే… ఎస్, ప్రియాంక జైన్ పుట్టింది ముంబైలో అయినా సరే, పెరిగింది, స్వస్థలం కన్నడ నాడే… ఇంకా ఉంది… శోభాశెట్టి గ్యాంగులో మరో కేరక్టర్ అమర్‌దీప్… చౌదరి సాబ్… తను పెళ్లిచేసుకున్నది కూడా కన్నడ నటినే… పేరు తేజస్విని గౌడ… సో, మొత్తానికి బ్యాచ్ అంతా ఇంట్రస్టింగ్ కన్నడ బంధాలే అన్నమాట…!!
చివరగా… శోభ, అమర్‌దీప్, ప్రియాంక టాప్ ఫైవ్‌లో ఉంటారా లేదానేది వేరే విషయం… కానీ యావర్, పల్లవి ప్రశాంత్‌లకన్నా బెటర్… ఎంటర్‌టెయిన్ చేయడం చేతకాని, పెదరాయుడు శివాజీకన్నా ఇంకా బెటర్… ఎంత నాగార్జున నెత్తిన మోస్తున్నా సరే.,. దానికి కారణాలు ఏమున్నా సరే… శోభ, అమర్, ప్రియాంక భలే ఆడుతున్నారు… తెలివిగా… వెకిలి కూతల వెగటు శివాజీ బ్యాచ్‌కన్నా చాలా బెటర్‌గా…!!
Share this Article